ఏపీ సిరీస్‌లోనే పాత వాహనాలు
* తెలంగాణ సిరీస్‌లోకి మారాల్సిన నిబంధన లేనట్టే
* పాత వాహనాలకు కొత్త సిరీస్ రావాలంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఎన్‌ఓసీ అవసరం?
* ఉమ్మడి రాజధానిలో ఏపీ ప్రభుత్వ కొత్త వాహనాలకూ టీ సిరీసే
* మార్గదర్శకాలు రూపొందిస్తున్న రవాణా శాఖ
సాక్షి, హైదరాబాద్: జూన్ 2కు వుుందు రిజిస్ట్రేషన్ చేరుుంచుకున్న వాహనాలు ఏపీ సిరీస్‌తో, అదే నంబర్‌తో ఇకవుుందు కూడా కొనసాగవచ్చని అధికారులు తుది నిర్ణయుం తీసుకున్నారు. గతంలో కొత్తగా ఏర్పడిన జార్ఖండ్, చత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో అనుసరించిన తీరును విశ్లేషించిన అధికారులు ఈ మేరకు నిర్ణరుుంచారు. ప్రస్తుతం తెలంగాణలో 68 లక్షలకు పైగా వాహనాలున్నాయి. వీటిలో దాదాపు 40 లక్షలు హైదరాబాద్ పరిధిలోనే ఉన్నాయి. తెలంగాణకు కేంద్రప్రభుత్వం ప్రత్యేక రిజిస్ట్రేషన్ సిరీస్ (టీఎస్ పరిశీలనలో ఉంది)ను కేటారుుంచిన తరువాత కూడా పాత వాహనాలు ఏపీ సీరీస్‌లో కొనసాగించుకునే వెసులుబాటు ఉంది. ఇదిలాఉండగా, ఏపీ సిరీస్ వద్దనుకునే పాత వాహనదారులకు కొత్త సీరీస్ కేటారుుంచే విషయుంపై వూత్రం వూర్గదర్శకాలు రూపొందించాల్సి ఉంది. అరుుతే, ఏపీ సిరీస్‌ను రద్దుచేసుకోవాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిరభ్యంతరపత్రం (ఎన్‌ఓసీ) పొందాల్సి ఉంటుందని అధికారులు అభిప్రాయుపడుతున్నారు.
కానీ, దీన్ని అధికారికంగా ఖరారు చేయులేదు. ఏపీలోనూ ప్రభుత్వం కొలువుదీరాక దీనిపై రెండు ప్రభుత్వాలు పరస్పరం చర్చించుకోవాల్సి ఉంటుందని వారు పేర్కొంటున్నారు. వెరసి తెలంగాణలో కొత్త వాహనాలకు కొత్త సిరీస్ రానున్నా, పాత వాహనాలు మాత్రం ఏపీ సిరీస్‌తోనే కొనసాగే వెసులుబాటు ఉన్న విషయం మాత్రం దాదాపు స్పష్టమైంది. పాత వాహనాలను కూడా తెలంగాణ సిరీస్‌లోకి మార్చుకునే విషయంలో మాత్రం విధివిధానాలు ఖరారు చేయాల్సి ఉంది.
అయితే ఉమ్మడి రాజధానిలో కొనసాగే సీమాంధ్ర ప్రాంతానికి చెందినవారు తమ వాహనాలకు ఏపీ సీరీస్ కేటాయించాలని కోరినా ఫలితం ఉండదు, వారికి తెలంగాణ రాష్ట్రానికి సబంధించిన నంబర్ వూత్రమే ఇవ్వనున్నారు. వాహనం తెలంగాణ ప్రాంతంలో రిజిస్టర్ చేయించుకుంటే కచ్చితంగా తెలంగాణ సిరీస్‌నే కేటాయిస్తారు. అంతేకాకుండా హైదరాబాద్‌లో ఉండే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వాహనాలకు కూడా ఇదే వర్తిస్తుంది. ఈనెల 8న రవాణా శాఖ మంత్రిగా మహేందర్‌రెడ్డి బాధ్యతలు తీసుకోబోతున్నారు. అంతకుముందు రోజు ఆయన అధికారులతో భేటీ అవుతున్నారు. ఈ సందర్భంగా దీనిపై చర్చించనున్నారు. ఆయన బాధ్యతలు తీసుకున్న తర్వాత అధికారిక ప్రకటన వెలువడనుంది.