మున్సిపాలిటీలకు ఆధునిక వాహనాలు
Published Wed, Jul 12 2017 11:56 AM | Last Updated on Sat, Aug 18 2018 5:57 PM
అమరావతి: రాష్ట్రంలోని మున్సిపాలిటీలకు ఆధునిక చెత్త తరలింపు వాహనాలు మంజూరయ్యాయి. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 14 వాహనాలను జెండా ఊపి బుధవారం ప్రారంభించారు. ఈ వాహనాల్లో ఆధునిక టెక్నాలజీ కారణంగా చెత్త బయటకు కనపడకుండా మూసివేసినట్లు ఉంటుంది.
అలాగే పెద్ద మొత్తంలో ఉన్న చెత్తను వాహనంలోనే తక్కువ మొత్తంలోకి మార్పు చేయవచ్చు. ఇతర వాహనాలకంటే 60 శాతం ఎక్కువ సామర్థ్యముండడం ఈ వాహనాల విశేషం.
Advertisement
Advertisement