
హైదరాబాద్: కన్జూమర్ టెక్నాలజీ సంస్థ ఉడ్‌చలో కొత్తగా వీర్‌బైక్ పేరిట ఎలక్ట్రిక్ సైకిల్‌ను ఆవిష్కరించింది. సాయుధ బలగాల కోసం దీర్ఘకాలం మన్నే, చౌకైన రవాణా సాధనాన్ని అందుబాటులోకి తెచ్చే ఉద్దేశంతో దీన్ని ప్రత్యేకంగా తీర్చిదిద్దినట్లు సంస్థ సహ వ్యవస్థాపకుడు సాహిల్ ఉత్తేకర్ తెలిపారు.
(ఇదీ చదవండి: రూ.8 లక్షలకే ఎంజీ ఎలక్ట్రిక్ కారు!)
మన్నికైన తేలికపాటి ఫ్రేమ్, ఎలక్ట్రిక్ కటాఫ్‌లతో డిస్క్ బ్రేక్‌లు, సర్దుబాటు చేసుకోగలిగే సీటు, తక్కువ మెయింటెనెన్స్ ఖర్చులు, ఏడాది వారంటీ తదితర ప్రత్యేకతలు ఈ విద్యుత్ బైక్‌లో ఉంటాయని సంస్థ సీఈవో రవి కుమార్ పేర్కొన్నారు. ఆలివ్ గ్రీన్, నేవల్ వైట్, ఎయిర్‌ఫోర్స్ బ్లూ తదితర అయిదు రంగుల్లో ఈ బైక్‌లు లభ్యమవుతాయని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment