milatary
-
వెంటనే నిద్ర రావాలంటే ఏం చేయాలి?
మనిషికి నిద్ర చాలా ముఖ్యం. నిద్రలేమి అనేది హృదయ సంబంధిత వ్యాధులు, మధుమేహం, ఊబకాయం, చిత్తవైకల్యం మొదలైన సమస్యలను సృష్టిస్తుంది. మానసిక స్థితిని త్రీవంగా ప్రభావితం చేస్తుంది. మతిమరపును కలిగిస్తుంది. రోగనిరోధక వ్యవస్థలోని ఇన్ఫెక్షన్లతో పోరాడే సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. పనితీరును కూడా ప్రభావితం చేస్తుంది. అటువంటి సందర్భాలలో ప్రమాదాల బారినపడే అవకాశం ఉంటుంది. నిద్రపోతున్నప్పుడు ఎవరైనా సరే మంచి ప్రశాంతతను పొందుతారు. నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఫర్ హెల్త్ తెలిపిన వివరాల ప్రకారం అణు రియాక్టర్ మెల్ట్డౌన్లు, పెద్ద ఓడలు మునిగిపోవడం, విమాన ప్రమాదాలు వంటి విషాదకర సంఘటనల వెనుక నిద్రలేమి కారణంగా నిలుస్తుంది. సైన్యంలో పని చేసేవారికి నిద్రా సమయం చాలా తక్కువగా ఉంటుంది. అందుకే వారు నిద్ర వచ్చేందుకు, మంచి విశ్రాంతి తీసుకునేందుకు ఒక టెక్నిక్ అనుసరిస్తారు. దానిని మిలటరీ మెథడ్ అని అంటారు. ఈ విధానం ద్వారా ఎవరైనా సులభంగా త్వరగా నిద్రపోవచ్చు. అది ఎలా సాధ్యమో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిసారిగా 1981లో ‘రిలాక్స్ అండ్ విన్: ఛాంపియన్షిప్ పెర్ఫార్మెన్స్’ అనే పుస్తకంలో ఈ టెక్నిక్కు సంబంధించిన పలు వివరాల అందించారు. రెండవ ప్రపంచ యుద్ధం అనంతరకారంలో మిలిటరీ పద్ధతిని ఉపయోగించిన ప్రీ-ఫ్లైట్ స్కూల్లోని పైలట్లు 10 నిమిషాల్లోనే నిద్రపోయారని ఆ పుస్తకంలో తెలియజేశారు. ఈ పద్ధతిని ఉపయోగించిన 96% పైలట్లు యుద్ధ సమయంలోనూ కొద్దిసేపటికే మంచి విశ్రాంతి తీసుకోగలిగారని వెల్లడయ్యింది. ఐదు దశల్లో త్వరగా నిద్ర ఈ మ్యాజిక్ టెక్నిక్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ విధానం ద్వారా ఎవరైనా సరే త్వరగా నిద్రపోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం. 1 మీ ముఖాన్ని రిలాక్స్ చేయండి: మీ ముఖంలోని నుదురు, కళ్ళు, బుగ్గలు, దవడ మొదలైన వాటిపై దృష్టి పెట్టండి. వాటిపై ఒత్తిడి ఉన్నట్లు భావించి, తరువాత దానిని వదిలివేసి, రిలాక్స్ అవుతున్నట్లు భావించండి. 2 మీ భుజాలను వదులు చేయండి: మీ చేతులను రిలాక్స్ చేయండి. మీ భుజాలు విశ్రాంతిగా ఉన్న భావన చేయండి. చేతులు, భుజాల మీదుగా గాలి తగులుతూ అది మెల్లగా మీ చేతుల కిందకి వస్తున్నట్లు ఊహించండి. 3 గట్టిగా ఊపిరి తీసుకోండి. నెమ్మదిగా గాలిని బయటకు వదలండి. మీరు అలా చేస్తున్నప్పుడు, అది మీ కడుపుని ఎలా తేలికపరుస్తున్నదనే దానిపై దృష్టి పెట్టండి. మీ కడుపును బిగపట్టడానికి ప్రయత్నించవద్దు. అన్ని అవయవాలు తేలికపడినట్లు భావించండి. 4 మీ కాళ్ళను విశ్రాంతి తీసుకోనివ్వండి. నునువెచ్చని గాలి మీ కాళ్ళను సున్నితంగా తాకుతున్నట్లు భావించండి. మీ కాళ్ళు మంచంపై రిలాక్స్ అవుతున్నట్లు చేయండి. 5 మీ మనసును ప్రశాంతపరచండి. ఇందుకు కొన్ని మార్గాలు ఉన్నాయి. ఉదాహరణకు మేఘాలను తదేకంగా చూడడం లేదా ప్రశాంతమైన చిత్రాలను చూసేందుకు ప్రయత్నించండి. 10 సెకన్ల పాటు మనసులో ఎటువంటి ఆలోచన లేకుండా చూసుకోండి. అప్పుడు మీకు త్వరగా నిద్రపడుతుంది. అభ్యాసంతో సాధ్యం ఈ మిలటరీ మెథడ్ గురించి సైన్స్ ఏమి చెబుతున్నదంటే.. ఈ విధానంలోని1, 2, 5 దశలు కండరాలకు సడలింపునిస్తాయి. ప్రశాంతతకు, శాంతియుత స్థితిని ప్రేరేపించడానికి మంచి మార్గాలుగా నిలుస్తాయి. మూడవ దశలో శ్వాస పద్ధతులు మెరుగుపడతాయి. ఐదవ దశ శరీరాన్ని మరింత రిలాక్స్ చేస్తుంది. ఈ ప్రక్రియ అత్యంత త్వరగా నిద్రను అందిస్తుంది. ఈ మిలటరీ మెథడ్‌లో అనేక ప్రయోజనాలుఉన్నాయి. నిద్ర అలవాట్లను మెరుగుపరచడానికి ఉత్తమమైన మార్గాలలో ఇది ఒకటి అని పలు పరిశోధనలలో తేలింది. అయితే మిలటరీ మెథడ్‌లో తక్షణ ఫలితాలను ఆశించకూడదని, ఇది అలవడేందుకు రెండు నుంచి ఆరు వారాల సమయం పట్టవచ్చని నిపుణులుచెబుతున్నారు. ఇది కూడా చదవండి: బాధితులకు వైద్య సేవలు అందించే ఎక్స్‌ప్రెస్ రైలు -
సాయుధ బలగాల కోసం వీర్ ఎలక్ట్రిక్ బైక్.. ఫీచర్స్ అదుర్స్!
హైదరాబాద్: కన్జూమర్ టెక్నాలజీ సంస్థ ఉడ్చలో కొత్తగా వీర్‌బైక్ పేరిట ఎలక్ట్రిక్ సైకిల్‌ను ఆవిష్కరించింది. సాయుధ బలగాల కోసం దీర్ఘకాలం మన్నే, చౌకైన రవాణా సాధనాన్ని అందుబాటులోకి తెచ్చే ఉద్దేశంతో దీన్ని ప్రత్యేకంగా తీర్చిదిద్దినట్లు సంస్థ సహ వ్యవస్థాపకుడు సాహిల్ ఉత్తేకర్ తెలిపారు. (ఇదీ చదవండి: రూ.8 లక్షలకే ఎంజీ ఎలక్ట్రిక్ కారు!) మన్నికైన తేలికపాటి ఫ్రేమ్, ఎలక్ట్రిక్ కటాఫ్‌లతో డిస్క్ బ్రేక్‌లు, సర్దుబాటు చేసుకోగలిగే సీటు, తక్కువ మెయింటెనెన్స్ ఖర్చులు, ఏడాది వారంటీ తదితర ప్రత్యేకతలు ఈ విద్యుత్ బైక్‌లో ఉంటాయని సంస్థ సీఈవో రవి కుమార్ పేర్కొన్నారు. ఆలివ్ గ్రీన్, నేవల్ వైట్, ఎయిర్‌ఫోర్స్ బ్లూ తదితర అయిదు రంగుల్లో ఈ బైక్‌లు లభ్యమవుతాయని తెలిపారు. -
లెజండరీ ఘోస్ట్ ఆఫ్ కీవ్ మృతి
అతనుయుద్ధం మొదలైన తొలిరోజే ఆరు రష్యా యుద్ధ విమానాలను కూల్చేసి గార్డియన్ ఏంజెల్‌గా ప్రశంసలు అందుకున్నాడు. వైమానిక దాడులతో రెచ్చిపోతున్న రష్యాకి దడ పుట్టేలా చేశాడు. ఎవరా పైలెట్ ఫైటర్ అని రష్యా బలగాల్లో ఒకటే ఉత్కంఠ. రష్యా బలగాలకు నిద్రపట్టకుండా చేసి సుమారు 40 యుద్ధ విమానాలకు కూల్చేశాడు ఉక్రెయిన్‌లో ఘొస్ట్ ఆఫ్ కీవ్‌గా పిలిచే యుద్ధ వీరుడు. రష్యా బలగాలను మట్టికరింపించేలా చివరి శ్వాస వరకు పోరాడాడు. war hero dies in battle after shooting down 40 Russian aircraft: ఘోస్ట్ ఆఫ్ కీవ్‌గా పిలిచే 29 ఏళ్ల స్టెపాన్ తారాబల్కా అనే ఉక్రెనియన్ ఫైటర్ పైలెట్ గత నెలలో జరిగిన యుద్ధంలో మరణించాడని వైమానికదళ అధికారులు వెల్లడించారు. అతను మిగ్ 29 ఫైలెట్లో వెళ్తున్నప్పుడూ శత్రుదళాలు జరిపిన కాల్పులో మరణించాడని తెలిపారు. అతను యుద్ధం మొదలైన తొలరోజునే ఆరు రష్యా యుద్ధ విమానాలను కూల్చి వేశాడని చెప్పారు. దీంతో అతన్ని ఉక్రెనియన్లు గార్డియన్ ఏంజెల్‌గా ప్రశంసించారు. అంతేకాదు తారాబల్కా ఘోస్ట్ ఆఫ్ కీవ్‌గా యుద్ధంలో రహస్య ఆపరేషన్లు చేపట్టి దాడులు చేస్తుంటాడని తెలిపారు. అంతేకాదు యుద్ధంలో ఇప్పటివరకు సుమారు 40 రష్యా యుద్ధ విమానాలను కూల్చాడు. దీంతో రష్యా బలగాలకు నిద్రపట్టకుండా చేసే ఒక భయంకరమైన వ్యక్తిగా మారాడు. తారాబాల్కకు మరణానంతరం యుద్ధంలో కనబర్చిన ధైర్యసాహసాలకు ఇచ్చే ఉక్రెయిన్ అత్యుత్తమ పతకం ఆర్డర్ ఆఫ్ ది గోల్డెన్ స్టార్, హీరో ఆఫ్ ఉక్రెయిన్ అనే బిరుదును అందించారు. అతనికి భార్య ఒలేనియా, ఎనిమిదేళ్ల కుమారుడు యారిక్ ఉన్నారు. తారాబల్కా పశ్చిమ ఉక్రెయిన్‌లోని కొరోలివ్కా అనే చిన్న గ్రామంలోని శ్రామిక కుటుంబంలో జన్మించారు. అతను చిన్నప్పుడూ తన గ్రామం మీదుగా ఆకాశంలో ఎగురుతున్న ఫైటర్ జెట్లు పైలట్ కావాలనుకునేవాడు. మరోవైపు ఉక్రెయిన్ ప్రభుత్వం తారాబల్కా మరణం గురించి ఎలాంటి సమంచారం ఇవ్వదని తల్లిదండ్రులు చెబుతుండటం గమనార్హం. ఉక్రెయిన్ ధైర్య సాహసాలు ప్రంపంచానికి అవగతమయ్యేలా వీరోచితంగా పోరాడి గొప్ప వీర మరణం పొందాడు. తారాబల్కా మరణించినా అతని ధైర్య సాహసాలు మాత్రం చిరస్థాయిగా నిలిచిపోతాయి. (చదవండి: రష్యా బలగాలు నాడు మా దాకా వచ్చాయి.. టైమ్ మ్యాగజైన్‌పై జెలెన్స్కీ) -
చిన్ని చేతులు చేస్తున్న అద్భుతం! రష్యా బలగాలకు అడ్డుగా..
Build Barricades To Stop Russian Invasion: ఉక్రెయిన్ పై రష్యా సాగిస్తున్న దురాక్రమణ నిరవధికంగా సాగుతునే ఉంది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ అతలాకుతలమై పోయింది. అంతేగాక ప్రధాన నగరాలను ఒక్కొకటిగా రష్యా బలగాలు మోహరించడమే కాక కైవసం చేసుకుంటున్నాయి. అందులో భాగంగానే ఉక్రెయిన్‌లోని ఓడరేవు నగరమైన ఒడెస్సాలో రష్యా దాడి చేయనుందంటూ తరుచుగా సైరన్లు మోగుతున్నాయి. దీంతో ఆ నగరంలోని సిటీ సెంటర్‌ను అడ్డుకునేందుకు స్థానికులు ఇసుకుతో బారికేడ్లను నిర్మించేందుకు ఉపక్రమించారు. ఆ బారికేడ్ నిర్మాణం పనుల్లో పదకొండేళ్ల పిల్లలు కూడా పాల్గొన్నారు. అంతేకాదు అక్కడ చిన్నారులు తమ నగరంలో రష్యా దళాలు ప్రవేశించనివ్వమని, నిర్మాణం సజావుగా సాగుతోందని చెబుతున్నారు. అయితే ఓడరేవు నగరం ఖేర్సన్ను రష్యా బలగాలు గురువారం స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. మరోవైపు మైకోలైవ్ నగర కేంద్ర నుంచి రష్యా దళాలు ప్రవేశించకుండా స్థానిక వేటగాళ్లు నిలువరించడమే కాకుండా సఫలమయ్యారు కూడా. ఈ మేరకు ఉక్రెయిన్‌లో కొన్ని నగరాల్లోని ప్రజలు తమ పోరాటంతో కొంత మేర విజయాన్ని సాధించాయనే చెప్పాలి. రష్యా దాడి ప్రారంభమైనప్పటి నుంచి ఉక్రెయిన్‌లో దాదాపు 750 మందికి పైగా పౌరులు మరణించారని అధికారులు పేర్కొన్నారు. అంతేకాదు పోరాటం ప్రారంభమైనప్పటి నుంచి సుమారు 1.2 మిలియన్లకు పైగా ప్రజలు ఉక్రెయిన్ను విడిచిపెట్టారు కూడా. (చదవండి: పారిపోలేదు!..నేను ఇక్కడే ఉన్నా! పోరాడుతున్నా: జెలెన్ స్కీ) -
పసిపాపను కాల్చిచంపారు
Ukraine War: ఉక్రెయిన్ పౌరులపై దాడి చేయమన్న రష్యా ప్రకటనలకు విరుద్ధంగా సామాన్యులపై దాడులు చేస్తోంది. కీవ్‌లోకి చొచ్చుకువస్తున్న రష్యా బలగాలు జరిపిన కాల్పుల్లో పదేళ్ల పోలినా అనే బాలికతో పాటు ఆమె తల్లిదండ్రులు సైతం అక్కడికక్కడే మరణించారు. తీవ్రగాయాలపాలైన ఆమె సోదరుడు, సోదరి ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతున్నారు. మరోవైపు రష్యా ప్రయోగించిన మిస్సైల్ ఒక్త్రికా నగరంలో కిండర్ గార్డెన్ స్కూలుపై పడడంతో ఏడేళ్ల అలీసా అనే పాప పాటు ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. శనివారం కీవ్‌కు చెందిన ఆంటాన్ కుడ్రిన్, ఆయన భార్య స్వెత్లెనా, కుమార్తె పోలినాలు బుల్లెట్ల దెబ్బకు మరణించారు. అంటాన్ పెద్ద కుమారుడు సైమన్, పెద్ద కూతురు సోఫియా గాయాలతో బయటపడ్డారు. వారి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెప్పారు. గురువారం నుంచి ప్రారంభమైన యుద్ధంలో ఇప్పటివరకు అధికారికంగా 16 మంది పిల్లలు మరణించారని, 45 మంది గాయపడ్డారని ఉక్రెయిన్ వర్గాలు తెలిపాయి. యుద్ధం పూర్తయ్యేసరికి వీరి సంఖ్య మరింత పెరగవచ్చని మానవ, బాలల హక్కుల కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. (చదవండి: రష్యా దాడిలో భారతీయ విద్యార్థి మృతి) -
ఆర్మీ: నెయిల్ పాలిష్, పోనిటెయిల్‌కు ఓకే
వాషింగ్టన్: అమెరికా నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన జో బైడెన్.. అగ్రరాజ్య సైన్యానికి సంబంధించి పలు కీలక మార్పులకు ఆమోదం తెలిపారు. సైన్యంలో మహిళా సైనికుల వస్త్రధారణకు సంబంధించి కొన్ని నియమాల్లో కీలక మార్పులు చేశారు. ఇక మీదట అమెరికన్ సైన్యంలోని మహిళా సైనికులు షార్ట్ పోనిటెయిల్ వేసుకోవడానికి.. లిప్‌స్టిక్ పెట్టుకోవడానికి అనుమతించారు. అలానే మగ సైనికులు స్పష్టమైన రంగుల నెయిల్ పాలిష్ ధరించవచ్చని తెలిపారు. ఇక బిడ్డకు పాలిచ్చే మహిళా సైనికులు వస్త్రధారణకు సంబంధించి పలు సడలింపులు ఇచ్చారు. బ్రెస్ట్ ఫీడింగ్, పంపింగ్ ద్వారా బిడ్డకు పాలిచ్చే తల్లులు ప్రస్తుత వస్త్రధారణ ప్రమాణాలకు అదనంగా లోపల మరో వస్త్రం ధరించేందుకు అనుమతిచ్చారు. ఈ నూతన మార్పులు ఫిబ్రవరి 25 నుంచి అమల్లోకి రానున్నాయి అని తెలిపారు. ప్రస్తుత మార్పులు అమెరికా సైన్యంలో చేరే మహిళల సంఖ్యను పెంచుతాయని.. అంతేకాక ప్రస్తుతం ఉన్న మహిళా సైనికులపై అసమాన ప్రభావాన్ని చూపుతాయని అధికారులు అభిప్రాయపడుతున్నారు. (చదవండి: బైడెన్ వలస చట్టంపై హోరాహోరీ ) మాజీ డిఫెన్స్ సెక్రటరీ మార్క్ ఎస్పర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రివ్యూ కమిటీ సూచనల ఫలితమే ఈ మార్పులు. ఈ కమిటీ మిలటరీలో జాతివివక్ష, మైనారిటీలపై అధికార దుర్వినియోగం వంటి పలు అంశాల పరిశీలనకు ఉద్దేశించబడింది. గతంలో అమెరికా సైన్యంలోని మహిళలు పొడవాటి జుట్టును బన్(కొప్పు)లా కట్టుకోవాల్సి వచ్చేది. ఇది అసౌకర్యంగా ఉండటమే కాక.. హెల్మెట్ ధరించడంలో ఇబ్బంది కలిగేది. ఇక తాజా సవరణలతో ఈ సమస్యలు తొలగిపోనున్నాయి. ఈ సందర్భంగా ఆర్మీ డిప్యూటీ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ గ్యారీ బిట్రో మాట్లాడుతూ.. ‘‘మా విధానాలను నిరంతరం పరిశీలించుకుంటూ.. అవసరమైన చోట మార్పులు చేసుకుంటూ.. ముందుకు సాగుతున్నాం. ఇక మేం అవలించే విధానాల వల్ల సైన్యంలోని సైనికులందరు మాకు ఎంత విలువైన వారో.. వారి పట్ల మాకు ఎంత నిబద్ధత ఉందో వెల్లడవుతుంది. మా ర్యాంకుల్లో చేరిక, ఈక్విటీ వంటి అంశాల్లో.. మాటల కంటే చేతలు ఎక్కువ ప్రభావాన్ని చూపుతాయని ఈ రోజు మేం మరోసారి నిరూపించాం. మేం ప్రకటించిన ఈ మార్పులు మన ప్రజలను మొదటి స్థానంలో ఉంచే విధానాలకు ఒక ఉదాహరణ అని మేం నమ్ముతున్నాం’’ అన్నారు. (చదవండి: అంతా ఒక్కటే.. నో ఆడ, నో మగ, నో ట్రాన్స్‌జెండర్) The #USArmy has revised Army Regulation 670-1, Wear and Appearance of Army Uniforms and Insignia. The updates will be effective Feb. 25, 2021 and directly supports the Army’s diversity and inclusion efforts. Learn more in this STAND-TO! ➡️ https://t.co/Y2VlaZgQHr#ArmyLife pic.twitter.com/4y9e7hBJ5a — U.S. Army (@USArmy) January 27, 2021 ఇక ఆర్మీలో చేసిన ఈ మార్పులు పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరి కొందరు మగ వారికి నెయిల్ పాలిషా.. వ్వాటే జోక్ అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇక అమెరికా వాయు సేన తన విభాగంలో పని చేస్తున్న మహిళా సైనికుల హెయిర్ స్టైల్ విషయంలో పలు మార్పులు చేసిన వారం రోజుల తర్వాత మిలిటరీ ఈ నూతన మార్పులు ప్రకటించింది. ఇక ఇదే కాక బైడెన్ లింగమార్పిడి వ్యక్తులను సైన్యంలోకి నిషేధిస్తూ.. ట్రంప్ చేసిన ఉత్తర్వులను రద్దు చేశారు. అంతేకాక ‘‘దేశానికి సేవ చేయాలనుకునే వారిని ప్రోత్సాహిస్తేనే.. అమెరికా సురక్షితంగా ఉంటుంది. అలాంటి వారి విషయంలో వివక్ష చూపకూడదని.. వారి పట్ల గర్వంగా భావించాలి’’ అని బైడెన్ ట్వీట్ చేశారు. -
బెల్జియం రాకుమారి సైనిక శిక్షణ
కొత్త స్టూడెంట్ వస్తే క్లాస్ రూమ్‌కి కళ వస్తుంది. ఇక్కడ కొత్తగా వచ్చింది రాకుమారి ఎలిజబెత్! ఆమె అడుగు పెట్టగానే రాయల్ మిలటరీ అకాడెమీ మొత్తానికే కళాకాంతులు వచ్చాయి. కాంతి ఎక్స్ట్రా. ఆరేళ్లు రాగానే పిల్లల్ని మన భాషలో స్కూల్లో పడేసినట్లు.. పద్దెనిమిదేళ్లు రాగానే రాజవంశాల్లో మిలటరీ అకాడెమీకి పంపించేస్తారు. రెండుమూడేళ్ల వరకు ఇంటి మీద బెంగ పడేందుకు లేదు. ఎలిజబెత్ బెల్జియం రాకుమారి. క్రౌన్ ప్రిన్సెస్. అంటే సింహాసనాన్ని అధిష్టించడానికి నెక్స్ట్ లైన్లో ఉన్న వారసురాలు. తండ్రి కింగ్ ఫిలిప్. బెల్జియం రాజు. ఆయన కూడా ఈ అకాడెమీలోనే 1978–81 మధ్య సైనిక శిక్షణ తీసుకున్నారు. రథ గజ తురగ పదాతి సైన్యాలు ఎన్ని ఉన్నా రైతు బిడ్డ వ్యవసాయం చేసినట్లు రాజు బిడ్డ కత్తి తిప్పాల్సిందే. ఇప్పుడు కత్తుల్లేవు కనుక ఆడపిల్లయినా కసరత్తులు చేసి రాటు తేలాలి. డిఫెన్స్ వాల్యూస్ నేర్చుకోవాలి. డిసిప్లెయిన్, రెస్పెక్ట్, కమిట్మెంట్.. ఇవీ ఆ వాల్యూస్. ధైర్యం ఒకరు నేర్పేది కాకపోయినా ధైర్యంగా ఉండటం కూడా ఒక సబ్జెక్టుగా నేర్పిస్తారు. షూటింగ్, మార్చింగ్, మారువేషంలో తప్పించుకునే మెళకువలు చెప్తారు. ఇప్పుడైతే రాకుమారి ఎలిజబెత్ కు నాలుగు వారాల శిక్షణే. అయితే చేరి నెల కావస్తున్నా.. ఈ వాట్సాప్ యుగంలోనూ.. మిలటరీ డ్రెస్ వేసుకుని యుద్ధ విద్యలు అభ్యసిస్తున్న ఆమె ఫొటోలు ఇన్నాళ్లకు గానీ బయటికి రిలీజ్ కాలేదు. ఇక రాజుగారు, రాణిగారు కూతుర్ని కళ్లారా సోల్జర్ గా చూసుకుని మురిసిపోయే వేడుక కోసం సెప్టెంబర్ 25 వరకు ఆగక తప్పదు. ఆరోజు అందరు జననీజనకులను రప్పించి, వారి పుత్రుడికో, పుత్రికకో వారి ఎదురుగా ‘బ్లూ బెరెట్’ (క్యాప్) తొడగబోతున్నారు. రత్నాల కిరీటాలు ఎన్ని ఉన్నా, రాజపుత్రికకు బ్లూ బెరెట్ తెచ్చే ఠీవే వేరు. అదొక స్టెయిల్లో ఉంటుంది.. కాన్ఫిడెన్సు, కదనోత్సాహమూ మిక్స్ అయి! బెల్జియం రాచకుటుంబంలో రాకుమారి ఎలిజబెత్ పెద్దమ్మాయి. తర్వాత ఇద్దరు తమ్ముళ్లు, ఒక చెల్లెలు. వాళ్లతో ఈ పెద్దమ్మాయికి సమీప భవిష్యత్తులో ఆటలు లేనట్లే. బ్లూ బెరెట్ సెరమనీ తర్వాత రెండో దశ శిక్షణ ప్రారంభం అవుతుంది పాపం. -
లిబియాలో ఘోరం; 28 మంది సైనికుల మృతి
ట్రిపోలి : లిబియాలో శనివారం ఘోర దుర్ఘటన చోటు చేసుకుంది. లిబియా రాజధాని ట్రిపోలీలోని సైనిక పాఠశాలపై జరిగిన వైమానిక దాడుల్లో 28 మంది సైనికులు మృతి చెందగా, 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇదే విషయాన్ని జిఎన్ఎ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి అమిన్ అల్-హషేమి మీడియా సమావేశంలో ధృవీకరించారు. ఆయన మాట్లాడుతూ.. ట్రిపోలిలోని సైనిక పాఠశాలపై శనివారం వైమానిక దాడులు జరిగాయని తెలిపారు. ఈ దాడిలో 28 మంది మృతి చెందగా, 12 మంది తీవ్రంగా గాయపడ్డారన్నారు. అయితే వైమానిక దాడులకు ముందు సైనికులంతా పెరేడ్ గ్రౌండ్లో సమావేశంలో పాల్గొన్నారని తెలిపారు. సమావేశం ముగిసిన తర్వాత వీరంతా తమ గూడారాల్లోకి వెళుతుండగా ఒక్కసారిగా దాడులు జరిగాయని అమిన్ పేర్కొన్నారు. ఈ మిలటరీ స్కూల్ ట్రిపోలి కేంద్రంగా అల్-హద్బా అల్-ఖాద్రాలో ఉంది. కాగా దాడిలో తీవ్రంగా గాయపడిన సైనికులకు రక్తం ఇచ్చేందుకు స్వచ్ఛందంగా ముందుకు రావాలని జిఎన్ఎ ఆరోగ్య మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది. 2011లో నాటో సహాయంతో అప్పటి దీర్ఘకాల నియంత మోమెర్ ఖడాఫీని జిఎన్ఏ దళాలు మట్టుబెట్టడంతో లిబియాలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అప్పటి నుంచి జీఎన్ఎ, దాని ప్రత్యర్థుల మధ్య వైమానిక దాడులు జరుగుతూనే ఉన్నాయి.దీంతో పాటు గత ఎప్రిల్లో లిబియా దక్షిణభాగానికి నేతృత్వం వహిస్తున్న మిలటరీ కమాండర్ ఖలీఫా హప్తర్ జిఎన్‌ఎకు వ్యతిరేకంగా మారడంతో లిబియా దేశం నిత్యం వైమానిక దాడులతో అట్టుడుకుతుందని సమాచారం.(ఇరాన్‌కు ట్రంప్ తీవ్ర హెచ్చరిక) -
కన్నీరుమున్నీరవుతున్న హిజ్రాలు
న్యూయార్క్: అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు వ్యతిరేక నినాదాలతో అమెరికా వినువీధులు గర్జించాయి. దేశ మిలటరీ రంగంలో పని చేయడానికి హిజ్రాలు పనికిరారని, వారి ఆరోగ్యంపై మిలటరీ చేస్తున్న ఖర్చు తలకు మించిన భారంగా మారిందంటూ వారిపై బుధవారం ట్రంప్ నిషేధం విధించారు. దీంతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా ట్రంప్ నిర్ణయంపై ప్రతిఘటన మొదలైంది. న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ వద్ద ఉన్న ఆర్మీ రిక్రూట్మెంట్ సెంటర్ వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్న హిజ్రాలు కన్నీరు కారుస్తూ 'ఈ ప్రెసిడెంట్ మాకొద్దూ అంటూ నినదించారు'. ఏం తప్పు చేస్తే మాపై నిషేధం విధించారంటూ ప్రశ్నించారు. అధ్యక్షుడి నిర్ణయానికి వ్యతిరేకంగా ఉవ్వెత్తున ఉద్యమాన్ని లేవదీస్తామని పేర్కొన్నారు. మరికొందరు వైట్ హౌస్ వీధిలో మార్చ్ నిర్వహించారు. మార్చ్ సందర్భంగా.. ' మేం ఇక్కడికి వచ్చాం. మేమంతా ఒక్కటే. మా అందరికీ ప్రెసిడెంట్ ట్రంప్ అంటే అసహ్యం' అంటూ నినాదాలు చేశారు. 'మా శరీరాల్లో భాగాల గురించి మీ అందరికీ ఎందుకు.. మేం పోరాడటానికి సిద్ధం' అనే ప్లకార్డు సగటు అమెరికన్ హిజ్రా భావోద్వేగాన్ని, మిలటరీలో పని చేయాలనే వారి తాపత్రయాన్ని తెలుపుతోంది. ట్రంప్ ఏమన్నారు మిలటరీలోని జనరల్స్, నిపుణులను సంప్రదించిన అనంతరమే తాను హిజ్రాలపై నిషేధాన్ని విధించాలనే నిర్ణయానికి వచ్చినట్లు ట్రంప్ చెప్పారు. మిలటరీ విజయాలపై దృష్టి సారించాలంటే హిజ్రా సైనికుల ఆరోగ్య ఖర్చుల భారాన్ని తగ్గించుకోక తప్పదని పేర్కొన్నారు.