అమెజాన్‌ ఆధ్వర్యంలో మిలటరీ ప్రోగ్రామ్‌ | Amazon Military Program | Sakshi
Sakshi News home page

అమెజాన్‌ ఆధ్వర్యంలో మిలటరీ ప్రోగ్రామ్‌

Published Thu, Feb 6 2025 8:02 PM | Last Updated on Fri, Feb 7 2025 4:55 PM

Amazon Military Program

దేశానికి సేవ చేయడానికి తమ జీవితాలను అంకితం చేసిన వారికి అద్భుతమైన అవకాశాలను అందించేందుకు ఆన్‌లైన్‌ మార్కెట్ వేదిక 'అమెజాన్‌ ఇండియా' మిలటరీ ప్రోగ్రామ్‌ను ప్రవేశపెట్టింది. దీనికి సంబంధించిన వివరాలను, ఈ ప్రోగ్రామ్‌ ద్వారా ఉద్యోగాలను అందుకున్నవారి అనుభవాలను సంస్థ ప్రతినిధులు ఓ ప్రకటనలో పంచుకున్నారు.

కెరీర్‌ మార్పు కంటే ఎక్కువ
సైనిక నేపధ్యం నుంచి  కార్పొరేట్‌ ప్రపంచానికి మారడం అనేది ఒక కెరీర్‌ మార్పు కంటే ఎక్కువ. ఎందుకంటే.. వీరు వ్యూహాత్మక దృష్టి క్రమశిక్షణ అసమానమైన స్థితిస్థాపకతల అరుదైన సమ్మేళనం కలిగిన వారు. వీటన్నింటినీ కార్పొరేట్‌ కార్యాలయానికి తీసుకురాగల సమర్ధులు. ఈ విశిష్ట విలువను గుర్తిస్తూ, అమెజాన్‌ మిలిటరీ ప్రోగ్రామ్‌ రూపొందించింది. దీని ద్వారా సైనిక నేపధ్యం ఉన్న అనుభవజ్ఞులకు మార్గదర్శకత్వం, శిక్షణతో పాటు సాధికారతను అందిస్తుంది, కంపెనీలో కీలక పాత్ర పోషిస్తూ విజయవంతంగా మారేలా చేస్తుంది.

నా జీవితాన్ని తీర్చిదిద్దింది
''మిలటరీలో పనిచేసిన మామయ్య స్ఫూర్తితో గత 2008లో భారతీయ నావికాదళ అధికారిగా విధులు నిర్వర్తించడం ప్రారంభించి, దశాబ్దం పాటు పనిచేశాను. పైరసీ వ్యతిరేక కార్యకలాపాల ద్వారా విదేశీ సేవా పతకాన్ని నిబద్ధత అంకితభావానికి 9 సంవత్సరాల సేవా పతకాన్ని అందుకున్నా. ఆ ప్రయాణం నా వృత్తిపరమైన జీవితానికి ఒక రూపం ఇవ్వడంతో పాటు నన్ను ఒక సమర్ధత కలిగిన వ్యక్తిగా మార్చింది నాకు స్థితిస్థాపకత శక్తిని, టీమ్‌ వర్క్‌  బలాన్ని నిస్వార్థ అంకితభావం తాలూకు ప్రభావాన్ని నాకు నేర్పింది. ఇక ప్రయోజనం, సహకారం అభివృద్ధి అమెజాన్‌ డైనమిక్‌ మిశ్రమం. నా మొదటి రోజు నుంచే నేను కస్టమర్‌ అబ్సెషన్, బోల్డ్‌ థింకింగ్‌ నిరంతర అభివృద్ధి చెందే కల్చర్‌లో అమరిపోయాను.''
- లెఫ్టినెంట్‌ కమాండర్‌ 'విక్టర్‌ జైస్‌' (రిటైర్డ్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement