
Ukraine War: ఉక్రెయిన్ పౌరులపై దాడి చేయమన్న రష్యా ప్రకటనలకు విరుద్ధంగా సామాన్యులపై దాడులు చేస్తోంది. కీవ్‌లోకి చొచ్చుకువస్తున్న రష్యా బలగాలు జరిపిన కాల్పుల్లో పదేళ్ల పోలినా అనే బాలికతో పాటు ఆమె తల్లిదండ్రులు సైతం అక్కడికక్కడే మరణించారు. తీవ్రగాయాలపాలైన ఆమె సోదరుడు, సోదరి ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతున్నారు. మరోవైపు రష్యా ప్రయోగించిన మిస్సైల్ ఒక్త్రికా నగరంలో కిండర్ గార్డెన్ స్కూలుపై పడడంతో ఏడేళ్ల అలీసా అనే పాప పాటు ఐదుగురు దుర్మరణం పాలయ్యారు.
శనివారం కీవ్‌కు చెందిన ఆంటాన్ కుడ్రిన్, ఆయన భార్య స్వెత్లెనా, కుమార్తె పోలినాలు బుల్లెట్ల దెబ్బకు మరణించారు. అంటాన్ పెద్ద కుమారుడు సైమన్, పెద్ద కూతురు సోఫియా గాయాలతో బయటపడ్డారు. వారి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెప్పారు. గురువారం నుంచి ప్రారంభమైన యుద్ధంలో ఇప్పటివరకు అధికారికంగా 16 మంది పిల్లలు మరణించారని, 45 మంది గాయపడ్డారని ఉక్రెయిన్ వర్గాలు తెలిపాయి. యుద్ధం పూర్తయ్యేసరికి వీరి సంఖ్య మరింత పెరగవచ్చని మానవ, బాలల హక్కుల కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
(చదవండి: రష్యా దాడిలో భారతీయ విద్యార్థి మృతి)
Comments
Please login to add a commentAdd a comment