సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల్లో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులపై సోమవారం ఏపీ మంత్రివర్గ ఉపసంఘం భేటీ కానుంది.
ఇప్పటికే వివిధ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగుల వివరాలు ఇవ్వాలని ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు ఆదేశించారు. ఈయన ఆధ్వర్యంలోనే సోమవారం మంత్రివర్గ ఉపసంఘం భేటీ కానుంది. గతంలోనే కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలా వద్దా అనే విషయమై గత ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది.
మొత్తం ఎంతమంది ఉద్యోగులు ఉన్నారు? ఎంత వేతనం చెల్లిస్తున్నాం? వంటి వివరాలు సేకరించారు. ఇప్పటికే ఇంటికొక ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చిన నేపథ్యంలో కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తారా? తొలగిస్తారా? అన్నది చర్చనీయాంశమైంది.