కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాల వల్లే దేశంలో ప్రతి అరగంటకో రైతు ఆత్మహత్య చేసుకుంటున్నట్టు ఏపీ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి రావుల వెంకయ్య అన్నారు.
పాలకొల్లు టౌన్ (పశ్చిమగోదావరి) : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాల వల్లే దేశంలో ప్రతి అరగంటకో రైతు ఆత్మహత్య చేసుకుంటున్నట్టు ఏపీ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి రావుల వెంకయ్య అన్నారు. మంగళవారం పాలకొల్లులో ఏపీ రైతు సంఘం పశ్చిమగోదావరి జిల్లా 21వ మహాసభ జరిగింది. దీనికి రావుల వెంకయ్య హాజరై ప్రసంగించారు.
కేంద్రం తీసుకురాదలచిన భూ సంస్కరణల బిల్లు కార్పొరేట్ సంస్థలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు లబ్ధి కలిగించేదని, దీనిపై రైతులు పోరాటం చేయాలన్నారు. బీహార్ ఎన్నికల తర్వాత భూ సంస్కరణల బిల్లును కేంద్రం తిరిగి పార్లమెంటు ముందుకు తీసుకురానుందని, దీనిపై దేశవ్యాప్తంగా రైతు సంఘాలన్నీ ఉద్యమించాల్సి ఉందన్నారు.