పాలకొల్లు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎస్సీలకు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా పశ్చిమగోదావరి జిల్లాలో మంగళవారం ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. పాలకొల్లులో వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు చిల్లం ఆనంద్‌ప్రకాశ్ ఆధ్వర్యంలో స్థానిక గాంధీ బొమ్మ సెంటర్‌లో కార్యకర్తలు చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేశారు. ఎస్సీలకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.