పశ్చిమ గోదావరి: జనసేన బాగు గూర్చి ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ గురించి తాను ఇచ్చే సలహాలు ఆయనకు నచ్చినట్టు లేవంటూ కాపు సంక్షేమసేన అధ్యక్షుడు హరి రామ జోగయ్య అన్నారు. ఆయన శుక్రవారం మరోసారి పవన్ కళ్యాణ్‌కు లేఖ రాశారు.
‘ఈ విషయం బహిరంగసభలో నా పేరు పెట్టి మీరు అనకపోయినా ఎల్లో మీడియా ప్రచారం చేస్తున్న తప్పుడు వార్తలు చూస్తే అలానే అనిపిస్తోంది. ఎల్లో మీడియా ఈ ప్రయత్నం ముఖ్యంగా మీకు, నాకు మధ్య తగువులు పెడ్తున్నట్లుగా కనబడుతుంది. పవన్ కళ్యాణ్ మరింత ఒంటరిగా చేస్తూ చంద్రబాబుకు మరింత దాసోహం అనిపించేటట్లు చేయాలనే కృత్తిమ చర్యలా అనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ లేకుండా టీడీపీ నెగ్గటం అసాధ్యం.
...గతంలో తనకున్న పదవులు సైతం వదులుకొని చిరంజీవికి సపోర్ట్ చేసిన వ్యక్తి హరిరామ జోగయ్య. వెన్నుపోటు రాజకీయాలకు అలవాటు పడిన చంద్రబాబు ఎన్నికలకు తర్వాతనైనా మీకు అధికారంలో సముచితమైన స్థానం ఇస్తాడని ముఖ్యమంత్రి పదవి చేపట్టటంలో భాగస్వామిని చేస్తాడని ఎవరు నమ్ముతారు?. ఎన్నికలైన తర్వాత జనసేనను క్రమేపీ నిర్వీర్యం చేసి తన కొడుకు నారా లోకేష్‌ను ముఖ్యమంత్రిని చేస్తాడనే భయం జనసైనికులు అందరిలో ఉన్నమాట నిజం.
ఎన్నికలు ముందే మీకు అధికారంలో రావటంతో పాటు, మీ స్థానం ఏమిటో తేల్చాలని జనసైనికుల తరపున నేను డిమాండు చేయటంలో తప్పేమిటి?. సముచితమైన నా సలహాలను వక్రీకరిస్తూ వైఎస్సార్‌సీపీ కోవర్టుగా నాకు ముద్ర వేయటానికి ప్రయత్నం చేస్తున్న ఈ ఎల్లో మీడియాను కానీ, జనసేన పార్టీలోని కొంతమంది మీ సలహాదారులను కానీ ఏమనాలి?. వారు తెలుగుదేశం కోవర్టులుగా చెప్పవచ్చా.
...పవన్ కళ్యాణ్‌ను ప్యాకేజి వీరుడుగా జనంలో నమ్మింపచేసి, నిర్వీర్యం చేసి దానివల్ల లబ్ది పొందాలనేది ఈ తెలుగుదేశం అధినేతల కుతంత్రమా?. జరుగుతున్న ఈ పరిణామాలపై మిత్రులెవరో, శత్రువులెవరో తెలుసుకుని మీరు ప్రవర్తించటం, జనసేన మంచికోరి ఎంతైనా మంచిది. మీకు యిష్టమైనా, యిష్టం లేకపోయినా మీ వెంటనే ఉండి మిమ్మల్ని కాపడుకోవటం నా విధిగా భావిస్తున్నాను’ అని హరిరామ జోగయ్య లేఖలో స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment