
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీలో ఔట్ సోర్సింగ్ రాజ్యమేలుతోంది. తెలంగాణ రాష్ట్రం వచ్చాక కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ సర్వీసులు ఉండవన్న ప్రభుత్వం మాటలు ఆచరణకు నోచుకోవడం లేదు. 2011 తరువాత ఆర్టీసీలో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా ఎలాంటి పోస్టులు భర్తీ కాకపోవడం గమనార్హం. ప్రభుత్వం ఇటీవల 5,000 పోస్టుల భర్తీకి సూత్రప్రాయ ఆమోదం తెలిపినా.. ఇంతవరకూ ఈ విషయంలో ఎలాంటి ముందడుగు పడలేదు. దీంతో ఉన్న సిబ్బందిపై పనిభారం పెరుగుతోంది. వివిధ విభాగాల్లో ఔట్‌సోర్సింగ్ విధానం కొనసాగుతుం డటంతో పనిలో నాణ్యత కొరవడుతుండగా, ఔట్ సోర్సింగ్ విభాగాల కాంట్రాక్టర్లు శ్రమదోపిడీకి పాల్పడుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి,
2011లో చివరిసారిగా?
ఆర్టీసీలో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ జరిగి దాదాపు ఎనిమిదేళ్లు కావొస్తోంది. ఆ తరువాత ఎలాంటి రిక్రూట్‌మెంట్లు లేవు. ఇకపోతే.. 2009, 2010, 2011లో కాంట్రాక్టు పద్ధతిలో రిక్రూట్ అయిన డ్రైవర్లు, కండక్టర్లను దాదాపుగా 18,000 మందిని సంస్థ రెగ్యులరైజ్ చేసింది. ఆ సమయంలో కావాల్సిన అర్హతలు లేని కారణంగా 4,000 మంది క్రమబద్ధీకరణకు నోచుకోలేకపోయారు. కొందరు 2015 సమ్మె సందర్భంగా రెగ్యులరైజ్ అయినా, దాదాపు 570 మంది రెగ్యులరైజ్ కావాల్సి ఉంది.
పెరుగుతున్న పనిభారం!
ఆర్టీసీలో 2011 తరువాత ఆరు వేలకుపైగా ఉద్యోగులు పదవీ విరమణ చేశారు. ఇందులో 5,000 పోస్టులను భర్తీ చేసేందుకు ఇటీవల జూన్‌లో మంత్రుల కమిటీ అంగీకారం తెలిపింది. ఇంత వరకూ ఈ విషయంలో ఎలాంటి అడుగు పడలేదు. మరోవైపు సంస్థాగతంగా ప్రమోషన్లు లేకపోవడం కార్మికులను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది.
ఔట్‌సోర్సింగ్ దయనీయం..
డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ లేకపోవడంతో ఔట్‌సోర్సింగ్ (పొరుగుసేవలు) కింద పలువురిని భర్తీ చేసు కున్నా రు. మెకానిక్‌లు, ఆర్టిజెన్స్ (వడ్రంగి, ఎలక్ట్రీషియన్లు తదితరులు)తోపాటు కీలకమైన సెక్యూరిటీ సిబ్బంది లోనూ ఔట్‌సోర్సింగ్ సిబ్బందే పనిచేస్తున్నారు. వీరికి నామమాత్రం జీతాలే ఇస్తుండగా, ఉద్యోగాలు పర్మినెంట్ చేస్తామంటూ.. కార్మికుల వద్ద కొందరు ఔట్‌సోర్సింగ్ కాంట్రాక్టర్లు వేలకువేలు వసూలు చేస్తున్నారు. తమ ఉద్యోగాలు రెగ్యులరైజ్ అవు తాయన్న ఆశతో అప్పుచేసి కాంట్రాక్టర్ల చేతిలో పోసి ఔట్ సోర్సింగ్ సిబ్బంది మరన్ని ఇబ్బందులు పడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment