హైదరాబాద్: వచ్చే ఫిబ్రవరి 2వ తేదీ నుంచి 4వ తేదీ వరకు హైదరాబాద్‌లో 12వ బయో ఆసియా సదస్సును నిర్వహించనున్నట్లు ఫెడరేషన్ ఆఫ్ ఏషియన్ బయోటెక్ అసోసియేషన్ ప్రకటించింది. లైఫ్ సైన్స్ విభాగంలో పరిశోధనలు, అభివృద్ధి ప్రధాన అంశాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు దీనిలో పాలు పంచుకోనున్నాయి.
హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగే ఈ కార్యక్రమం నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఐఐసీటీ మాజీ డెరైక్టర్, శాస్త్రవేత్త కె.వి.రాఘవన్ చైర్మన్‌గా, రాష్ట్ర ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.ప్రదీప్‌చంద్ర, పరిశ్రమలు, మౌలిక సదుపాయాల సంస్థ ఎండీ జయేశ్ రంజన్, పరిశ్రమల విభాగం కమిషనర్‌ను ఎక్స్‌అఫీషియో సభ్యులుగా కమిటీని నియమించింది.
ఫిబ్రవరిలో బయో ఆసియా సదస్సు
Published Sun, Oct 26 2014 1:39 AM | Last Updated on Sat, Sep 2 2017 3:22 PM
Advertisement
Advertisement