రైల్వే తొలి ఎఫ్‌డీఐ బిడ్‌లకు 3 దిగ్గజ కంపెనీలు
న్యూఢిల్లీ: మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా రైల్వేలో తొలి అతి పెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి(ఎఫ్‌డీఐ) ఆఫర్‌కు మూడు అంతర్జాతీయ కంపెనీలు బిడ్‌లు దాఖలు చేశాయి. బీహార్‌లోని మాధేపురాలో ఆధునిక ఎలక్ట్రిక్ రైలు పెట్టెలు తయారు చేసే ఫ్యాక్టరీని రూ.1.300 కోట్లతో ఏర్పాటు చేయనున్నారు. సీమెన్స్, ఆల్‌స్టోమ్, బొంబార్డీయిర్.. ఈ మూడు అంతర్జాతీయ దిగ్గజ కంపెనీలు తమ తమ బిడ్‌లను దాఖలు చేశాయి. ఏడాదికి ఇక్కడ 80కు పైగా రైలుపెట్టెలు తయారవుతాయి. ఈ మూడు అంతర్జాతీయ కంపెనీలు వేసిన బిడ్‌లను టెండరింగ్ కమిటీ మదింపు చేసి సెప్టెంబర్ చివరికల్లా ఫలితం ప్రకటిస్తారు.