IIT హైదరాబాద్‌లో వినూత్న ప్రయత్నం
బ్రిడ్జిని 3డి ప్రింట్ చేసిన ఇంజినీర్లు
తక్కువ సమయంలో నాణ్యమైన నిర్మాణం
భవిష్యత్తులో విప్లవాత్మక మార్పులకు సంకేతం
ఐఐటీ హైదరాబాద్ అరుదైన ఘనత సాధించింది. యువ స్టార్టప్ సింప్లిఫోర్జ్ క్రియేషన్సతో కలిసి భారతదేశపు మొట్టమొదటి ప్రోటోటైప్ బ్రిడ్జ్‌ను తయారుచేసింది. స్వదేశీ 3D ప్రింటింగ్ టెక్నాలజీతో ఈ బ్రిడ్జ్ తయారు చేయడం విశేషం. ఈ త్రీడీ ప్రింటెడ్ బ్రిడ్జ్‌ని ఐఐటీ హైదరాబాద్‌లో ఏర్పాటు చేశారు. దీన్ని కేవీఎల్ సుబ్రమణ్యం అతని రీసెర్చ్ గ్రూప్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ సివిల్ ఇంజనీరింగ్ బృందం కలిసి పాదాచారుల బ్రిడ్జ్‌ని రూపొందించారు. లోడ్ పరీక్ష తర్వాత పూర్తి స్థాయి 7.50 మీటర్ల వంతెనను రూపొందించే యత్నం చేశారు.
కాంక్రీట్ ఉపబలాన్ని తగ్గించి ఈ నిర్మాణాన్ని అభివృద్ధి చేశారు. ఈ వంతెనలో మెటీరియల్ ప్రాసెసింగ్, డిజైన్ మెథడాలజీలలో అనేక పురోగతులు హైలెట్‌గా నిలిచాయి. నిజానికి ఈ త్రీడి కాంక్రీట్ ప్రింటింగ్ అనేది అభివృద్ధి చెందుతున్న సాంకేతికతకు నిదర్శనం. పైగా తక్కువ బరువుతో వేగవంతమైన సమర్థవంతమైన వంతెనలు, నిర్మాణాలను అభివృద్ధి చేసే నిర్థిష్ట ఆప్టమైజ్ అప్లికేషన్ త్రీడీ టెక్నాలజీ. ఈ మేరకు ఈ ప్రోటోటైప్ వంతెనను అభివృద్ధి చేసిన కేఎల్ సుమ్రమణ్యం, అతని బృందాన్ని ఐఐటీ హైదరబాద్ డైరెక్టర్ బీఎస్ మూర్తి అభినందించారు.
వేగవంతమైన సమర్థవంతమైన నిర్మాణాలకు సాంకేతికతో కూడిన పరిష్కారాలు అత్యంత అవసరమని అన్నారు. సమర్థవంతమైన నిర్మాణం కోసం స్వదేశీ సామర్థ్యాన్ని అభివృద్ధి చేయడం అనేది ఆత్మ నిర్బర్ కలను సాకారం చేసుకునే దిశగా డిజిటల్‌క్నాలజీని అభివృద్ధిపరిచే ఘనమైన ముందుడగు అని ప్రశంసించారు. ఇలాంటి ఆవిష్కరణలు ఆర్థిక పరంగా స్థానిక అభివృద్ధికి మాత్రమే గాక మౌలిక సదుపాయల రంగానికి మరిన్ని ప్రయోజనాలు అందించగలదని భావిస్తున్నానని అన్నారు.
(చదవండి: ఆరోజు రాత్రి వరకు అబ్బాయి.. లేచిన వెంటనే అమ్మాయిగా మార్పు..!)
Comments
Please login to add a commentAdd a comment