రాయదుర్గం: పట్టణాల్లో రోడ్డుకు ఇరు పక్కల ఉన్న చెట్లను లెక్కించేందుకు ట్రిపుల్ ఐటీ–హైదరాబాద్ పరిశోధకులు వినూత్నమైన పద్ధతిని రూపొందించారు. మెషీన్ లెర్నింగ్ సాంకేతికత సాయంతో పనిచేసే కంప్యూటర్ విజన్ అసిస్టెడ్ పరికరాన్ని అభివృద్ధి పరిచారు. ఈ పరికరం ఆటోమేటిక్‌గా పట్టణాల్లో చెట్ల విస్తారం ఎంత ఉందో గుర్తిస్తుందని ట్రిపుల్ ఐటీ–హైదరాబాద్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది.
ఇప్పటివరకు చెట్ల సంఖ్య ఎంత ఉందో నేరుగా లెక్కించడం ద్వారా కాని, కృత్రిమ ఉపగ్రహాల సాయంతో గానీ లెక్కించేవారు. ఈ సరికొత్త పరికరాన్ని ట్రిపుల్ ఐటీ– హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ విజువల్ ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీకి చెందిన ప్రొఫెసర్ సీవీ జవహర్ నేతృత్వంలో అర్పిత్ బహేతి అనే పరిశోధక విద్యార్థి రూపొందించారు. ఈ పరికరాన్ని బైక్‌కు బిగించి ఏదైనా రోడ్డు మీదుగా తీసుకెళ్తే చాలు ఆటోమేటిక్‌గా చెట్లను లెక్కించడమే కాకుండా ఆ రోడ్డుకు సంబంధించిన మ్యాప్‌ను కూడా సులువుగా అర్థం అయ్యేలా రంగులతో అందజేస్తుందని అర్పిత్ వివరించారు. చెట్ల కాండాలు లేదా మొదళ్ల ద్వారా చెట్ల సంఖ్యను లెక్కిస్తుందని తెలిపారు. ఈ పరికరాన్ని హైదరాబాద్‌తో పాటు సూరత్‌లో పరీక్షించగా, 83 శాతం కచ్చితత్వంతో ఫలితాలు వచ్చాయని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment