ఐఐటీ హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ హెల్త్‌కేర్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ (సీఎఫ్‌హెచ్‌ఈ) విస్తరణకు తనుశ్రీ ఫౌండేషన్, ఎస్కీన్ వెంచర్స్ వ్యవస్థాపకులు సుశాంత్‌కుమార్ 9.6 మిలియన్ డాలర్లు (రూ.80 కోట్లు) సమకూర్చనున్నట్లు హామీ ఇచ్చారు. హెల్త్‌కేర్ టెక్నాలజీలో భాగంగా సీఎఫ్‌హెచ్‌ఈ ఎన్నో ఆవిష్కరణలు తీసుకొచ్చినట్లు ఆయన తెలిపారు.
ఈ సందర్భంగా సుశాంత్ కుమార్ మాట్లాడుతూ ‘సీఎఫ్‌హెచ్‌ఈ ఆవిష్కరణలు చాలా మంది రోగులకు ఎంతో ఉపయోగపడుతున్నాయి. మరిన్ని కొత్త ఆవిష్కరణలు చేసేలా ఈ పెట్టుబడులు ఉపయోగపడుతాయి. ఆరోగ్య సంరక్షణ రంగంలో ఈ కేంద్రం చేస్తున్న సేవలో భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది. ఔత్సాహిక ఆరోగ్య సంరక్షణ వ్యాపారవేత్తలను పెంపొందించడంలోనూ సీఎఫ్‌హెచ్‌ఈ సహకారం అందిస్తుంది. హెల్త్‌కేర్ టెక్నాలజీ రంగంలో పరిశోధనలు చేస్తున్న వారికి కావాల్సిన ప్రోత్సాహం, వనరులు అందించడం గొప్ప విషయం’ అని అన్నారు.
సీఎఫ్‌హెచ్‌ఈ హెడ్ ప్రొఫెసర్ రేణు జాన్ మాట్లాడుతూ ‘హెల్త్‌కేర్ టెక్నాలజీలో సమీప భవిష్యత్తులో చాలాపురోగతి రాబోతుంది. అందులో సుశాంత్‌కుమార్ భాగమవ్వడం ఆహ్వానించదగ్గ విషయం. ఆరోగ్య సంరక్షణ విభాగంలో చాలా కంపెనీలు కొత్త ఆవిష్కరణలు తీసుకొస్తున్నాయి. వాటికి సరైన వనరులు, ప్రోత్సాహం ఉంటే మరింత వృద్ధి సాధిస్తాయి’ అని చెప్పారు. ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ ప్రొఫెసర్ బీఎస్ మూర్తి మాట్లాడుతూ ‘సమాజంలో డయాగ్నస్టిక్స్ పరికారాల్లో సరైన ఆవిష్కరణలు లేక చాలా మంది సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ అంతరాన్ని తొలగించడానికి ఐఐటీ హైదరాబాద్, సీఎఫ్‌హెచ్‌ఈ పనిచేస్తున్నాయి. అవసరాలకు తగిన వైద్య పరికరాల సరఫరా, శిక్షణ పొందిన వర్క్‌ఫోర్స్‌ను అందించడంలో ఈ కేంద్రం ముందుంది. ఆత్మ నిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా దృక్పథంతో స్టార్ట్అప్‌లను ప్రోత్సహిస్తున్నాం’ అని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: మస్క్ భారత పర్యటనకు డేట్ ఫిక్స్.. ఏం జరగబోతుందంటే..
సీఎఫ్‌హెచ్‌ఈలోని కొన్ని ఆవిష్కరణలు..
- ఆర్మబుల్ అనే న్యూరోరిహాబిలిటేషన్ డివైజ్‌ను కనుగొనేలా బీఏబుల్ హెల్త్‌కేర్ ప్రైవేట్ లిమిటెడ్ అనే స్టార్టప్‌కు ప్రోత్సాహం అందించింది.
- నిమోకేర్‌రక్ష అనే నవజాత శిశువులను రక్షించడానికి ధరించగలిగే చిన్న పరికారాన్ని తయారుచేసేందుకు కావాల్సిన వనరులను అందించింది. దీన్ని నిమోకేర్‌వెల్‌నెస్ ప్రైవేట్ లిమిటెడ్ తయారుచేసింది.
- జీవికా హెల్త్‌కేర్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో మూడేళ్లలో 2.5 మిలియన్ మందికి ‘వ్యాక్సిన్ ఆన్ వీల్స్’ ప్లాట్‌ఫారమ్ ద్వారా టీకాలు అందించే ప్రయత్నం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment