వరల్డ్‌ టాప్‌ వర్సిటీల్లోహెచ్‌సీయూ, ఐఐటీ–హైదరాబాద్‌ | HCU and IIT Hyderabad are among the worlds top universities | Sakshi
Sakshi News home page

వరల్డ్‌ టాప్‌ వర్సిటీల్లో హెచ్‌సీయూ, ఐఐటీ–హైదరాబాద్‌

Published Sat, May 20 2023 4:42 AM | Last Updated on Sat, May 20 2023 3:48 PM

HCU and IIT Hyderabad are among the worlds top universities - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: సెంటర్‌ ఫర్‌ వరల్డ్‌ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌ (సీడబ్ల్యూయూఆర్‌)–2023లో తెలంగాణ నుంచి రెండు యూనివర్సిటీలు చోటు సంపాదించుకున్నాయి. మొదటి 2 వేల యూనివర్సిటీల్లో దేశం నుంచి 64 యూనివర్సిటీలు టాప్‌ ర్యాంకుల్లో ఉండగా, తెలంగాణ నుంచి యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ 1,265వ ర్యాంకు, ఐఐటీ–హైదరాబాద్‌ 1,373వ ర్యాంకు సాధించాయి.

గత ఏడాది ర్యాంకులతో పోలిస్తే హెచ్‌సీయూ 7 ర్యాంకులు కిందకు పడిపోగా, ఐఐటీ–హైదరాబాద్‌ మాత్రం 68 స్థానాలు పైకి ఎగబాకింది. దేశంలో ఐఐటీ–అహ్మదాబాద్‌ 419 ర్యాంకుతో టాప్‌లో ఉండగా తర్వాతి స్థానాల్లో ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్, ఐఐటీ–మద్రాస్‌ ఉన్నాయి.

ఇక వరల్డ్‌ టాప్‌ వర్సిటీల్లో హార్వర్డ్‌ యూనివర్సిటీ నంబర్‌వన్‌గా నిలిచింది. విద్య నాణ్యత, ఉపాధి, అధ్యాపకుల నాణ్యత, పరిశోధన పనితీరు ఆధారంగా ఈ ర్యాంకులను ప్రకటించింది. పరిశోధనల్లో వెనకబాటుతో పాటు నిధుల కేటాయింపుల్లో నిర్లక్ష్యం కారణంగా దేశ యూనివర్సిటీలు వెనకబడ్డాయని సీడబ్ల్యూయూఆర్‌ నివేదిక వెల్లడించింది.  

దేశంలో నాల్గోస్థానం 
రాయదుర్గం: దేశంలోని అత్యుత్తమ విశ్వవిద్యాలయాల్లో ఒకటిగా హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ నిలిచింది. ‘ది వీక్‌ హన్సా’పరిశోధన సర్వే–2023లో దేశంలోని టాప్‌ 85 మల్టీ డిసిప్లినరీ వర్సిటీల్లో రాష్ట్ర, సెంట్రల్, ప్రైవేట్, డీమ్డ్‌ వర్సిటీల్లో హెచ్‌సీయూ నాల్గోస్థానంలో నిలిచింది.

2022లో ఐదో స్థానంలో ఉండగా ఈ సంవత్సరం ఒక స్థానం పైకి ఎగబాకింది. దక్షిణాదిలోని టాప్‌ మల్టీ డిసిప్లినరీ విశ్వవిద్యాలయాల్లో మొదటి స్థానంలో ఉంది. అధ్యాపకులు, విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, అధికార యంత్రాంగం, సిబ్బంది సమష్టి కృషి వల్లే ఇది సాధ్యమైందని, భవిష్యత్తులో టాప్‌లో నిలిచేందుకు ప్రయత్నం చేస్తామని వీసీ ప్రొఫెసర్‌ బీజేరావు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement