సాధారణంగా ఒక కారు కొనడటానికి ముందు కంపెనీ డీలర్‌షిప్ టెస్ట్ డ్రైవ్ సదుపాయం కల్పిస్తుంది. అయితే కొన్ని సార్లు అనుభవం లేని డ్రైవర్లు కారుని డ్రైవ్ చేస్తే అనుకోని ప్రమాదాలు జరుగుతాయి. ఇలాంటి సంఘటన తాజాగా ఒకటి వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
నివేదికల ప్రకారం ఈ సంఘటన కేంద్రపాలిత ప్రాంతమైన దాద్రా, నగర్ హవేలీలో జరిగినట్లు తెలుస్తోంది. అమెరికన్ కార్ బ్రాండ్ అయిన జీప్ మెరిడియన్ టెస్ట్ డ్రైవ్ సమయంలో అనుకోని పెద్ద ప్రమాదానికి గురైంది. దీనికి సంబంధించిన వీడియో ప్రతీక్ సింగ్ అనే వ్యక్తి తన యూట్యూబ్ ఛానెల్‌లో షేర్ చేశారు.
ఈ వీడియోలో గమనించినట్లయితే, రోడ్డు తడిగా ఉండటం గమనించవచ్చు. ప్రమాదం జరగటానికి ఖచ్చితమైన కారణం వెల్లడి కాలేదు. దీనికి కారణం అతి వేగమా? లేక డ్రైవింగ్‌లో పెద్దగా అనుభవం లేకపోవడమా? అనేది తెలియాలి ఉంది. అయితే ప్రమాదంలో కారు చాలా ఎక్కువ దెబ్బతినడంతో ఫ్రంట్ బంపర్, రియర్ ప్రొఫైల్ చాలా వరకు పనికిరాకుండా పోయింది.
కారు డివైడర్‌ను ఢీకొట్టి రెండు స్ట్రీట్‌లైట్ స్తంభాలను ఢీకొట్టినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో కారులోని వారికి ఏదైనా ప్రమాదం జరిగిందా.. లేదా అనే విషయాలు తెలియాల్సి ఉంది. లోపల ఎయిర్ బ్యాగులు ఓపెన్ అవ్వడం వల్ల బహుశా వారికి గాయాలేమైనా అయి ఉండొచ్చని భావిస్తున్నారు.
ఇదీ చదవండి: న్యూ ఐఫోన్ 15 గురించి ఆసక్తికర విషయాలు.. 16 సిరీస్ వస్తుందా?
జీప్ మెరిడియన్..
టెస్ట్ డ్రైవ్ సమయంలో వినియోగదారుడు పరిమిత వేగంతో డ్రైవ్ చేయాలి, ఎందుకంటే కొత్త కారు గురించి వారికి పూర్తిగా అవగాహన ఉండకపోవచ్చు. అలాంటి సందర్భంలో ఇలాంటి ప్రమాదాలే జరిగే అవకాశం ఉంది. కారు ప్రమాదానికి గురైతే టెస్ట్ డ్రైవ్ కోసం తీసుకున్న వారు నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది. ఇక్కడ ఇలాంటిదే జరిగిందా? లేదా స్పష్టంగా వెల్లడించలేదు. ప్రమాదానికి గురైన జీప్ మెరిడియన్ ధర రూ. 33.41 లక్షల నుంచి రూ. 38.61 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంటుంది.
టెస్ట్ డ్రైవ్‌లో ప్రమాదం ఇదే మొదటి సారి కాదు..
టెస్ట్ డ్రైవ్ సమయంలో కార్లు ప్రమాదానికి గురవ్వడం ఇదే మొదటిసారి కాదు, గతంలో మారుతి సుజుకి కంపెనీకి చెందిన గ్రాండ్ విటారా, టాటా కంపెనీకి చెందిన కార్లు, హ్యుందాయ్ ఐ20 ప్రమాదాలకు గురయ్యాయి. కేవలం సాధారణ కార్లు మాత్రమే కాకుండా టెస్లా కార్లు కూడా టెస్ట్ డ్రైవ్‌లో ప్రమాదానికి గురైనట్లు నివేదికల ద్వారా తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment