ఆన్‌లైన్‌ గేమర్స్‌ను వరించనున్న.. రూ. 2 కోట్ల ప్రైజ్‌ మనీ.. | Battlegrounds Grand Finale Hosted By Krafton India | Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్‌ గేమర్స్‌ను వరించనున్న.. రూ. 2 కోట్ల ప్రైజ్‌ మనీ..

Published Thu, Jun 27 2024 10:33 AM | Last Updated on Thu, Jun 27 2024 11:46 AM

Battlegrounds Grand Finale Hosted By Krafton India

28 నుంచి ‘బ్యాటిల్‌ గ్రౌండ్స్‌’ గ్రాండ్‌ ఫినాలే..

సాక్షి, సిటీబ్యూరో: భారత్‌లో ప్రతిష్టాత్మకమైన ‘బ్యాటిల్‌ గ్రౌండ్స్‌ మొబైల్‌ ఇండియా సిరీస్‌ 2024’(బీజీఐఎస్‌) గ్రాండ్‌ ఫినాలేకు నగరం ఆతిథ్యం ఇవ్వనుంది. క్రాఫ్టన్‌ ఇండియా ఆధ్వర్యంలో నగరంలోని హైటెక్స్‌ ఎగ్జిబిషన్‌ సెంటర్‌ వేదికగా గ్రాండ్‌ ఫినాలే ఈ నెల 28 నుంచి 30వ తేదీ వరకు జరగనుంది.

దేశంలోనే అతిపెద్దదైన ఈ రాయల్‌ ఎస్పోర్ట్స్‌ ఇండియా సిరీస్‌ టోర్నమెంట్‌లో రూ.2 కోట్ల ప్రైజ్‌ మనీ అందించడం విశేషం. దేశంలోని యువ ఆటగాళ్లతో కూడిన చివరి 16 అగ్రశ్రేణి జట్లు చాంపియన్‌షిప్‌ టైటిల్‌ను దక్కించుకోవడానికి ఆన్‌లైన్‌ రౌండ్‌లలో పోటీ పడనున్నారు. గేమింగ్‌ ఔత్సాహికులు ఈ సీరీస్‌ను ప్రత్యక్షంగానే కాకుండా క్రాఫ్టన్‌ ఇండియా ఈ–స్పోర్ట్స్‌ యూట్యూబ్‌ ఛానెల్‌లో వీక్షించవచ్చని నిర్వాహకులు పేర్కొన్నారు.

ఇవి చదవండి: టీనేజర్ల రక్షణ కోసం.. సరికొత్తగా స్నాప్‌చాట్‌!
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement