తెలంగాణను అడ్డుకుంటే యుద్ధమే..
Published Fri, Sep 6 2013 3:44 AM | Last Updated on Fri, Sep 1 2017 10:28 PM
ఖమ్మం కలెక్టరేట్, న్యూస్‌లైన్:తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వేగవంతం చేయాలన్న డిమాండ్‌తో ఆందోళన కార్యక్రమాలు, విభజనకు సహకరించాలన్న విజ్ఞప్తితో శాంతి ర్యాలీలు ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో జిల్లాలో జోరుగా సాగుతున్నాయి. ఖమ్మంలో ఉద్యోగులు గురువారం భోజన విరామ సమయంలో కలెక్టరేట్‌కు చేరుకున్నారు. అక్కడి నుంచి ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో బెలూన్లు చేబూని, తెలంగాణ నినాదాలు చేస్తూ కలెక్టరేట్ ప్రధాన ద్వారం వద్ద ఆందోళన నిర్వహించారు. ‘యూటీ అంటే యుద్ధమే’, ‘పది జిల్లాలతో కూడిన తెలంగాణ కావాలి’, ‘హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా చేస్తే ఊరుకోం’, ‘సీమాంధ్రులు తెలంగాణ ఏర్పాటుకు సహకరించాలి’ అని పెద్దఎత్తున నినాదాలు చేశారు.
అనంతరం, ‘అన్నదమ్ముల్లా విడిపోదాం’ ‘జై తెలంగాణ.. జైజై తెలంగాణ’ అని రాసిన తెల్ల బెలూన్లను ప్రధాన రహదారిపై గాల్లోకి ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగ జేఏసీ జిల్లా అధ్యక్షుడు కూరపాటి రంగరాజు మాట్లాడుతూ.. హైదరాబాదును యూనియన్ టెరి టరీ (యూటీ)గా ప్రకటిస్తే యుద్ధమే జరుగుతుందని హెచ్చరించారు. పది జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణను అడ్డుకునేందుకు సీమాంధ్ర నేతలు యత్నించడం సరికాదన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను గౌరవించి విభజనకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ద్రోహులకు తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు.
ఉద్యోగ జేఏసీ ప్రధాన కార్యదర్శి నడింపల్లి వెంకటపతిరాజు, తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు ఎస్‌కె.ఖాజామియా మాట్లాడుతూ.. హైదరాబాదులో ఏపీ ఎన్జీవోలు సభ నిర్వహించేందుకు ముఖ్యమంత్రి అనుమతి ఇప్పించారని విమర్శించా రు. ఈ సభను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణావాదులు శాంతి ర్యాలీకి అనుమతివ్వని ప్రభుత్వం.. ఏపీ ఎన్జీవోల సభ కు ఎలా అనుమతిస్తుందని ప్రశ్నించారు.కార్యక్రమంలో జేఏసీ నాయకులు నాగిరెడ్డి, కోడి లింగయ్య, కోటేశ్వరరావు, వై.వెంకటేశ్వ ర్లు, రవీంద్రప్రసాద్, బడ్జెట్ శ్రీనివాస్, రాజేష్, మల్లయ్య, బాలకృష్ణ, దుర్గాప్రసాద్, తుమ్మలపల్లి రామారావు, భాను, నందగిరి శ్రీను, వల్లోజు శ్రీనివాస్, రమణయాదవ్, ఆర్‌విఎస్.సాగర్, బాబూజాన్, కూరపాటి వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, రమేష్, వినోద్ తదితరులు పాల్గొన్నారు.
ముల్కీ అమరవీరుల సద్భావన ర్యాలీ
బయ్యారం: రాజకీయ జేఏసీ ఆధ్వర్యంలో గురువారం బయ్యారంలో ముల్కీ అమరవీరు ల సద్భావన శాంతి ర్యాలీ జరిగింది. ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ బస్టాండ్ సెంటర్‌కు చేరింది. అనంత రం, ర్యాలీనుద్దేశించి జేఏసీ మండల కన్వీనర్ గౌని ఐలయ్య మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పాటును సీమాంధ్రులు అడ్డుకోవడం సరికాదన్నారు. ర్యాలీలో రిటైర్డ్ ఉపాధ్యాయులు యాదగిరి, వెంకట్‌రెడ్డి, సహకార సంఘం అధ్యక్షుడు రామగిరి బిక్షం, నాయకులు మదా ర్, పొమ్మయ్య, నాగేశ్వరరావు, వీరభద్రం, శేషగిరిరావు, లక్ష్మణ్, సర్పంచులు కోటమ్మ, నగేశ్, క్రిష్ణ, శంకర్ పాల్గొన్నారు.
Advertisement
Advertisement