obstructs
-
ప్రకృతి వనం: సీఐ కాళ్లు పట్టుకున్న రైతులు
పెద్దఅడిశర్లపల్లి: నల్లగొండ జిల్లా పెద్దఅడిశర్లపల్లి మండలంలోని దుగ్యాల గ్రామ పంచాయతీలో ఏర్పాటుచేస్తున్న బృహత్ పల్లె ప్రకృతి వనం పనులను శనివారం కొందరు రైతులు అడ్డుకున్నారు. అనేక సంవత్సరాలుగా సాగు చేస్తున్న భూముల్లో ఎలాంటి నోటీసులు లేకుండా పనులు ఎలా చేస్తారంటూ అధికారులను నిలదీశారు. దీంతో పోలీసులు ఆందోళనకు దిగిన రైతులను అరెస్టు చేశారు. అనంతరం అధికారులు పనులు ప్రారంభించారు. వివరాలిలా ఉన్నాయి.. దుగ్యాల గ్రామ శివారులోని 10.24 ఎకరాలను రెవెన్యూ శాఖ బృహత్ పల్లె ప్రకృతి వనం కోసం కేటాయించింది. 1993లో ప్రభుత్వం ఈ భూమిని పేర్వాల ప్రాజెక్టుకు అవసరమైన మట్టికోసం సేకరించింది. మట్టి సేకరించిన నాటి నుంచి ఇప్పటి వరకు ఆ భూమిని కోల్పోయిన రైతులే చదును చేసుకొని సాగు చేసుకుంటున్నారు. కాగా పల్లెప్రకృతి వనం ఏర్పాటులో భాగంగా భూమి చుట్టూ కడీలు పాతేందుకు శనివారం ఎంపీఓ మోహన్‌రెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ శివశంకర్ పంచాయతీ సిబ్బందితో కలసి అక్కడికి చేరుకున్నారు. విషయం తెలుసుకున్న రైతులు కుటుంబ సభ్యులతో కలసి పనులను అడ్డుకున్నారు. దీంతో సీఐ రవీందర్ ఆధ్వర్యంలో పోలీసులు అక్కడికి చేరుకుని రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అనేక ఏళ్లుగా లక్షల రూపా యలు పెట్టుబడి పెట్టి నీటి కోసం పైపులైన్ వేసుకుని సాగు చేస్తున్న భూమిని ఎలాంటి నోటీసు లు లేకుం డా తీసుకోవడం సరికాదని అన్నారు. తమకు చావే శరణ్యమంటూ మహిళలు పోలీసుల కాళ్లు పట్టుకొని న్యాయం చేయాలని వేడుకున్నారు. రైతులు శాంతిం చకపోవడంతో వారిని అరెస్టు చేసి తీసుకెళ్లారు. భూములు లాక్కొని తమ పొట్ట కొట్టవద్దని రైతులు అంటున్నారు. -
ఎయిర్‌పోర్టును కమ్మేసిన పొగమంచు..
సాక్షి, దొడ్డబళ్లాపురం: కెంపేగౌడ ఎయిర్‌పోర్టులో మంగళవారంనాడు దట్టమైన పొగమంచు కమ్మేసిన కారణంగా సుమారు 90 పైగా విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. తెల్లవారుజాము 6 గంటల నుండి 9 గంటల వరకూ ఏర్పోర్ట్ చుట్టుపక్కల పొగమంచు కమ్మేసింది. దీంతో అటు ఇతర రాష్ట్రాలకు, విదేశాలకు వెళ్లాల్సిన విమానాలు నిలిచిపోయాయి. కేఐఏఎల్కు రావాల్సిన విమానాలను దారిమళ్లించారు. ముఖ్యంగా లండన్ వెళ్లాల్సిన బీఏ-118 బ్రిటీష్ ఏర్వేస్,అమెరికన్ ఏర్వేస్ ఐబీ-47652 ఇబ్రియా ఎయిర్వేస్ ,దుబాయ్ వెళ్లాల్సిన ఇండిగో తదితర అంతర్ రాష్ట్రీయ విమానాలు ఆలస్యంగా ఎగిరాయి.బ్రెజిల్ ,సింగపూర్, అబుదాబి తదితర దేశాల నుండి రావాల్సిన విమానాలు ఆలస్యంగా వచ్చాయి. మరికొన్ని విమానాలకు ఇతర ఏర్పోర్ట్లకు దారిమళ్లించారు. 9 గంటల తరువాత పొగమంచు తగ్గాక విమానాలు రాకపోకలు ప్రారంభించాయి. -
అడ్డుకునేవారికి బుద్ధి చెబుతాం
వినాయక్‌నగర్ : ఎస్సీ వర్గీకరణను అడ్డుకునేవారికి బుద్ధి చెబుతామని జాతీయ ఎమ్మార్పీఎస్ జిల్లా ఇన్చార్జి వెంకటస్వామి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని సుభాష్‌నగర్‌లోగల ఆర్అండ్బీ అతిథి గృహంలో శుక్రవారం జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కార్యక్రమంలో ఎస్సీవర్గీకరణను కొన్ని దుష్టశక్తులు అడ్డుకుంటున్నాయన్నారు. ఎస్సీవర్గీకరణ ఆగదని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు మాట ఇచ్చారన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చేసి మాదిగ ఉపకులాల అభివృద్ధికి బాటలు వేస్తుందని ఆశిస్తున్నామన్నారు. ఎస్సీ వర్గీకరణ కోసం వచ్చేనెల 20న హైదరాబాద్‌లో ధర్మ యుద్ధం సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందుకోసం వచ్చేనెల 3న సన్నాహక సదస్సు నిర్వహిస్తామన్నారు. సదస్సులో సంఘం జిల్లా అధ్యక్షుడు నాగభూషణం మాదిగ, రాష్ట్ర నాయకులు గంగాధర్, పోశెట్టి, యమున, తార, శ్రీనివాస్, తోబేవార్ సంతోష్, విఠల్, తిమప్ప, సురేశ్ తదితరులు పాల్గొన్నారు. -
తెలంగాణను అడ్డుకుంటే యుద్ధమే..
ఖమ్మం కలెక్టరేట్, న్యూస్‌లైన్:తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వేగవంతం చేయాలన్న డిమాండ్‌తో ఆందోళన కార్యక్రమాలు, విభజనకు సహకరించాలన్న విజ్ఞప్తితో శాంతి ర్యాలీలు ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో జిల్లాలో జోరుగా సాగుతున్నాయి. ఖమ్మంలో ఉద్యోగులు గురువారం భోజన విరామ సమయంలో కలెక్టరేట్‌కు చేరుకున్నారు. అక్కడి నుంచి ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో బెలూన్లు చేబూని, తెలంగాణ నినాదాలు చేస్తూ కలెక్టరేట్ ప్రధాన ద్వారం వద్ద ఆందోళన నిర్వహించారు. ‘యూటీ అంటే యుద్ధమే’, ‘పది జిల్లాలతో కూడిన తెలంగాణ కావాలి’, ‘హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా చేస్తే ఊరుకోం’, ‘సీమాంధ్రులు తెలంగాణ ఏర్పాటుకు సహకరించాలి’ అని పెద్దఎత్తున నినాదాలు చేశారు. అనంతరం, ‘అన్నదమ్ముల్లా విడిపోదాం’ ‘జై తెలంగాణ.. జైజై తెలంగాణ’ అని రాసిన తెల్ల బెలూన్లను ప్రధాన రహదారిపై గాల్లోకి ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగ జేఏసీ జిల్లా అధ్యక్షుడు కూరపాటి రంగరాజు మాట్లాడుతూ.. హైదరాబాదును యూనియన్ టెరి టరీ (యూటీ)గా ప్రకటిస్తే యుద్ధమే జరుగుతుందని హెచ్చరించారు. పది జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణను అడ్డుకునేందుకు సీమాంధ్ర నేతలు యత్నించడం సరికాదన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను గౌరవించి విభజనకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ద్రోహులకు తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఉద్యోగ జేఏసీ ప్రధాన కార్యదర్శి నడింపల్లి వెంకటపతిరాజు, తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు ఎస్కె.ఖాజామియా మాట్లాడుతూ.. హైదరాబాదులో ఏపీ ఎన్జీవోలు సభ నిర్వహించేందుకు ముఖ్యమంత్రి అనుమతి ఇప్పించారని విమర్శించా రు. ఈ సభను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణావాదులు శాంతి ర్యాలీకి అనుమతివ్వని ప్రభుత్వం.. ఏపీ ఎన్జీవోల సభ కు ఎలా అనుమతిస్తుందని ప్రశ్నించారు.కార్యక్రమంలో జేఏసీ నాయకులు నాగిరెడ్డి, కోడి లింగయ్య, కోటేశ్వరరావు, వై.వెంకటేశ్వ ర్లు, రవీంద్రప్రసాద్, బడ్జెట్ శ్రీనివాస్, రాజేష్, మల్లయ్య, బాలకృష్ణ, దుర్గాప్రసాద్, తుమ్మలపల్లి రామారావు, భాను, నందగిరి శ్రీను, వల్లోజు శ్రీనివాస్, రమణయాదవ్, ఆర్విఎస్.సాగర్, బాబూజాన్, కూరపాటి వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, రమేష్, వినోద్ తదితరులు పాల్గొన్నారు. ముల్కీ అమరవీరుల సద్భావన ర్యాలీ బయ్యారం: రాజకీయ జేఏసీ ఆధ్వర్యంలో గురువారం బయ్యారంలో ముల్కీ అమరవీరు ల సద్భావన శాంతి ర్యాలీ జరిగింది. ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ బస్టాండ్ సెంటర్‌కు చేరింది. అనంత రం, ర్యాలీనుద్దేశించి జేఏసీ మండల కన్వీనర్ గౌని ఐలయ్య మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పాటును సీమాంధ్రులు అడ్డుకోవడం సరికాదన్నారు. ర్యాలీలో రిటైర్డ్ ఉపాధ్యాయులు యాదగిరి, వెంకట్‌రెడ్డి, సహకార సంఘం అధ్యక్షుడు రామగిరి బిక్షం, నాయకులు మదా ర్, పొమ్మయ్య, నాగేశ్వరరావు, వీరభద్రం, శేషగిరిరావు, లక్ష్మణ్, సర్పంచులు కోటమ్మ, నగేశ్, క్రిష్ణ, శంకర్ పాల్గొన్నారు.