సాక్షి, దొడ్డబళ్లాపురం: కెంపేగౌడ ఎయిర్‌పోర్టులో మంగళవారంనాడు దట్టమైన పొగమంచు కమ్మేసిన కారణంగా సుమారు 90 పైగా విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. తెల్లవారుజాము 6 గంటల నుండి 9 గంటల వరకూ ఏర్‌పోర్ట్ చుట్టుపక్కల పొగమంచు కమ్మేసింది. దీంతో అటు ఇతర రాష్ట్రాలకు, విదేశాలకు వెళ్లాల్సిన విమానాలు నిలిచిపోయాయి.
కేఐఏఎల్‌కు రావాల్సిన విమానాలను దారిమళ్లించారు. ముఖ్యంగా లండన్ వెళ్లాల్సిన బీఏ-118 బ్రిటీష్ ఏర్‌వేస్,అమెరికన్ ఏర్‌వేస్ ఐబీ-47652 ఇబ్రియా ఎయిర్‌వేస్ ,దుబాయ్ వెళ్లాల్సిన ఇండిగో తదితర అంతర్ రాష్ట్రీయ విమానాలు ఆలస్యంగా ఎగిరాయి.బ్రెజిల్ ,సింగపూర్, అబుదాబి తదితర దేశాల నుండి రావాల్సిన విమానాలు ఆలస్యంగా వచ్చాయి. మరికొన్ని విమానాలకు ఇతర ఏర్‌పోర్ట్‌లకు దారిమళ్లించారు. 9 గంటల తరువాత పొగమంచు తగ్గాక విమానాలు రాకపోకలు ప్రారంభించాయి.
ఎయిర్‌పోర్టును కమ్మేసిన పొగమంచు..
Published Tue, Dec 26 2017 4:29 PM | Last Updated on Tue, Dec 26 2017 6:45 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment