Kempe Gowda International Airport
-
Vande Bharat: జెండా ఊపిన ప్రధాని మోదీ
బెంగళూరు: దక్షిణ భారత దేశంలో తొలి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ అధికారికంగా పట్టాలెక్కింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం కర్ణాటక బెంగళూరు క్రాంతివీర సంగోలీ రాయన్న రైల్వే స్టేషన్(KSR Railway Station) నుంచి రైలును ప్రారంభించారు. చెన్నై(తమిళనాడు) నుంచి వయా బెంగళూరు మీదుగా మైసూర్ మధ్య ఈ రైలు ప్రయాణించనుంది. దేశంలో ఇప్పటివరకు పరుగులు పెడుతున్న సెమీ హైస్పీడ్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ఇది ఐదవది. ఇండియన్ రైల్వేస్ ఆధ్వర్యంలో నడిచే మిగతా నాలుగు నార్త్‌లో ఇప్పటికే పరుగులు పెడుతున్నాయి. ఇప్పటికే మైసూర్-చెన్నై వందే భారత్ విజయవంతంగా ట్రయల్ రన్ పూర్తి చేసుకుంది కూడా. వందే భారత్ రైలు ప్రారంభంతో పాటు భారత్ గౌరవ్ కాశీ దర్శన్ రైలుకు సైతం ప్రధాని మోదీ పచ్చ జెండా ఊపారు. I would like to compliment Karnataka for being the first state to take up the Bharat Gaurav Kashi Yatra train. This train makes brings Kashi and Karnataka closer. Pilgrims and tourists will be able to visit Kashi, Ayodhya and Prayagraj with ease. pic.twitter.com/7fBlEW091Q — Narendra Modi (@narendramodi) November 11, 2022 Hon’ble PM Shri @narendramodi flagged off Vande Bharat Express between Mysuru & Puratchi Thalaivar Dr. MGR Central, Chennai from KSR Bengaluru Station in Karnataka, today. pic.twitter.com/qn9DihjGeB — Ministry of Railways (@RailMinIndia) November 11, 2022 అంతకు ముందు విధాన సభ వద్ద కనకదాస, మహర్షి వాల్మీకి విగ్రహాలకు ప్రధాని మోదీ పూల నివాళి అర్పించారు. బెంగళూరు పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ.. కెంపగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో టెర్మినల్ 2ను ప్రారంభించడంతో పాటు ఎయిర్పోర్ట్ వద్ద ఏర్పాటు చేసిన 108 అడుగుల భారీ నాదప్రభు కెంపెగౌడ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. -
ట్యాక్సీ డ్రైవర్ ఆత్మహత్య: ఎయిర్‌పోర్టు కీలక ప్రకటన
బెంగళూరు: డ్రైవర్ ఆత్మహత్యకు నిరసనగా ట్యాక్సీ డ్రైవర్లు నిరసన తెలుపుతుండటంతో విమానశ్రాయంలో టాక్సీ సర్వీసులను నిలిపివేస్తున్నట్లు బెంగళూరు కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రకటించింది. కర్ణాటక టూరిజం శాఖలో పని చేస్తున్న ఓ ట్యాక్సీ డ్రైవర్ మంగళవారం సాయంత్రం తన కారులో ఆత్మహత్యాయత్నం చేశాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సదరు డ్రైవర్ బుధవారం ఉదయం మరణించాడు. ఈ క్రమంలో ట్యాక్సీ డ్రైవర్లు నిరసన తెలుపుతుండటంతో బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం ఈ ప్రకటన చేసింది. ఈ మేరకు ‘‘బీఎల్‌ఆర్‌ఏ విమానాశ్రయంలో ట్యాక్సీ సేవలను నిలిపివేస్తున్నాం. ప్రయాణికులు బీఎంటీసీ బస్సు సేవలను, వ్యక్తిగత వాహనాలను వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం’’ అంటూ ట్వీట్ చేసింది. Taxi services at @BLRAirport have been regularised. Passengers may opt for app-based taxis or BMTC bus services for travel to and from BLR Airport.#taxi #bengaluru #KIAB #bengaluruairport pic.twitter.com/KB55MQ9VBP — BLR Airport (@BLRAirport) March 31, 2021 రాష్ట్ర టూరిజం డిపార్ట్మెంట్లో పని చేస్తున్న ప్రతాప్ (32) అనే ట్యాక్సీ డ్రైవర్ మంగళవారం సాయంత్రం విమానాశ్రయం వెలుపల ఆత్మహత్యాయత్నం చేశాడు. ఇది గమనించిన చుట్టుపక్కల వారు అతడిని కారు నుంచి బయటకు తీసి ఆస్పత్రిలో చేర్పించారు. తీవ్రంగా గాయపడి హస్పిటల్లో చికిత్స పొందుతున్న ప్రతాప్ బుధవారం ఉదయం మరణించాడు. ఇందుకు నిరసనగా ట్యాక్సీ డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కెంపెగౌడ విమానాశ్రయం ఈ నిర్ణయం తీసుకుంది. వీలైనంత త్వరగా సమస్యని పరిష్కరిస్తాం అని తెలిపారు. ఈ సందర్భంగా ఓ పోలీసు ఉన్నతాధికారి మాట్లాడుతూ.. ‘‘ప్రతాప్ మృతికి కారణాలు తెలియదు. తీవ్రంగా గాయపడటంతో అతడి వద్ద నుంచి ఎలాంటి స్టేట్మెంట్ తీసుకోలేకపోయాం’’ అని తెలిపాడు. -
ఎయిర్‌పోర్టును కమ్మేసిన పొగమంచు..
సాక్షి, దొడ్డబళ్లాపురం: కెంపేగౌడ ఎయిర్‌పోర్టులో మంగళవారంనాడు దట్టమైన పొగమంచు కమ్మేసిన కారణంగా సుమారు 90 పైగా విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. తెల్లవారుజాము 6 గంటల నుండి 9 గంటల వరకూ ఏర్పోర్ట్ చుట్టుపక్కల పొగమంచు కమ్మేసింది. దీంతో అటు ఇతర రాష్ట్రాలకు, విదేశాలకు వెళ్లాల్సిన విమానాలు నిలిచిపోయాయి. కేఐఏఎల్కు రావాల్సిన విమానాలను దారిమళ్లించారు. ముఖ్యంగా లండన్ వెళ్లాల్సిన బీఏ-118 బ్రిటీష్ ఏర్వేస్,అమెరికన్ ఏర్వేస్ ఐబీ-47652 ఇబ్రియా ఎయిర్వేస్ ,దుబాయ్ వెళ్లాల్సిన ఇండిగో తదితర అంతర్ రాష్ట్రీయ విమానాలు ఆలస్యంగా ఎగిరాయి.బ్రెజిల్ ,సింగపూర్, అబుదాబి తదితర దేశాల నుండి రావాల్సిన విమానాలు ఆలస్యంగా వచ్చాయి. మరికొన్ని విమానాలకు ఇతర ఏర్పోర్ట్లకు దారిమళ్లించారు. 9 గంటల తరువాత పొగమంచు తగ్గాక విమానాలు రాకపోకలు ప్రారంభించాయి. -
ఎయిర్‌పోర్ట్‌కు మెట్రో రైలు
ఊహించినట్లుగానే బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం వరకు మెట్రో రైలు సౌకర్యాన్ని పొడిగించడానికి ప్రభుత్వం నిర్ణయించింది. దీర్ఘకాలంగా ఉన్న ఈ డిమాండ్‌కు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మోక్షం లభించింది. పథకం సాకారమైతే 30 కిలోమీటర్ల ట్రాఫిక్ కష్టాల నుంచి నగరవాసులకు విముక్తి లభిస్తుంది. నాగవార, హెగ్డే నగర, జక్కూరు మీదుగా ఎయిర్‌పోర్టుకు వెళ్లవచ్చు. సాక్షి, బెంగళూరు: కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం వరకూ మెట్రో రైలు సౌకర్యాన్ని పొడిగించడానికి రాష్ట్ర మంత్రిమండలి పచ్చజెండా ఊపింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అధ్యక్షతన సోమవారం విధానసౌధలో జరిగిన మంత్రిమండలి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. వివరాలను రాష్ట్ర న్యాయశాఖ మంత్రి టీ.బీ జయచంద్ర మీడియాకు వివరించారు. నాగవార, హెగ్డే నగర, జక్కూరు మీదుగా మెట్రో రైలు మార్గాన్ని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం వరకూ నిర్మిస్తామన్నారు. సుమారు 30 కిలోమీటర్ల పొడవైన ఈ రైలు మార్గం నిర్మాణానికి పూర్తి ప్రాజెక్ట్ రిపోర్ట్‌ను తయారు చేయాల్సిందిగా సంబంధిత శాఖలకు సూచించామని చెప్పారు. ఈ ప్రాజెక్టు వ్యయం మొత్తాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 50:50 నిష్పత్తిలో పంచుకుంటాయన్నారు. కేంద్రం వాటా సుమారుగా రూ.6 వేల కోట్లు వరకూ ఉంటుందని, ఈ మేరకు ఇప్పటికే కేంద్రానికి నివేదిక అందించామన్నారు. ఈ రైలు మార్గం నిర్మాణం వల్ల బెంగళూరులో ట్రాఫిక్ సమస్య కొంతవరకూ పరిష్కారమవుతుందని తెలిపారు. కేబినెట్ భేటీ నిర్ణయాల్లో ముఖ్యమైనవి ఇలా... ♦ స్మార్ట్ సిటీ పథకంలో ఎయిర్‌పోర్ట్‌కు మెట్రో రైలు భాగంగా స్మార్ట్‌సిటీ లిమిటెడ్ కంపెనీ ఏర్పాటుకు అనుమతి. ♦ రాష్ట్రంలో అగ్రికల్ జోన్ల ఏర్పాటుకు అనుమతి ♦ విక్టోరియా ఆసుపత్రిలో మౌలిక సదుపాయాల కల్పనకు రూ.30 కోట్లు విడుదల ♦ రాష్ట్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల మొదలుకొని జిల్లా ఆసుపత్రుల వరకూ ఆప్తాల్మాలజీ (కంటి విభాగం) ఏర్పాటుకు, మౌలిక సదుపాయాల కల్పనకు రూ.8.06 కోట్లు విడుదల. ♦ రాష్ట్రంలో 500 గ్రామపంచాయతీల్లో వై–ఫై ఏర్పాటుకు అంగీకారం. ♦ మురుగునీటిని సంస్కరించి పునఃవినియోగానికి వీలుగా ప్రత్యేక పాలసీని రూపొందించడానికి అంగీకారం. ♦ రూ.200 కోట్లతో చిన్ననీటిపారుదలశాఖ ఆధ్వర్యంలో పశ్చిమవాహిని అనే పథకం అమలు. -
రూ.2 కోట్ల విలువైన బంగారం పట్టివేత
సాక్షి, బనశంకరి (బెంగళూరు): దుబాయ్ నుంచి పెద్ద ఎత్తున అక్రమంగా బంగారం తరలిస్తున్న ఇద్దరిని బెంగళూరు కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.2 కోట్ల విలువ చేసే బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. అబ్దూల్ రహమాన్ జారిజిక్ అనే వ్యక్తి మంగళవారం రాత్రి దుబాయ్ నుంచి బెంగళూరుకు చేరుకున్నాడు. అయితే అతడు అనుమానాస్పదంగా కనిపించడంతో కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. అతడి బ్యాగ్‌లో భారీగా బంగారు బిస్కెట్లు లభించాయి. దీంతో కస్టమ్స్ అధికారులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. అబ్దూల్ రహమాన్ కోసం వేచిచూస్తున్న యూసుప్ పర్జుల్లా అనే వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు. వీరిద్దరూ గత కొన్నేళ్లుగా అక్రమంగా బంగారం స్మగ్లింగ్ చేస్తున్నట్లు విచారణలో తెలిసింది. మరో కేసులో.. మలేసియా నుంచి ఎయిర్ఏషియా విమానంలో వచ్చిన మునిస్వామి అనే ప్రయాణికుడిని తనిఖీ చేయగా, ఒక బంగారు బిస్కెట్ లభించింది. దీంతో అతడిని కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు. -
ఆ పేరు మార్చేది లేదు: సిద్ధరామయ్య
బెంగళూరు: కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం పేరు మార్చేదిలేదని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పష్టం చేశారు. బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి టిప్పు సుల్తాన్ పేరు పెట్టాలన్న వాదన తెరపైకి వచ్చిన నేపథ్యంలో ఆయనీ ప్రకటన చేశారు. కాగా ప్రజల మనోభావాలను కర్ణాటక ప్రభుత్వం గౌరవించాలని కేంద్ర మంత్రి ఎం వెంకయ్య నాయుడు సూచించారు. సున్నితమైన అంశాలపై జాగ్రత్తగా స్పందించాలన్నారు. బెంగళూరు వ్యవస్థాపకుడైన కెంపెగౌడను కర్ణాటక ప్రజలు ఎంతో గౌరవిస్తారని చెప్పారు. కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి టిప్పు సుల్తాన్ పేరు పెట్టాలని తాను చేసిన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున వివాదం చెలరేగడంపై ప్రముఖ నటుడు గిరీష్ కర్నాడ్ విచారం వ్యక్తం చేశారు. ఇది చాలా బాధకరమని ఆయన పేర్కొన్నారు. కర్ణాటకలో శాంతి భద్రతలు క్షీణించాయని, దీనికి బాధ్యత వహించి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది. టిప్పు సుల్తాన్ జయంతిని అధికారికంగా నిర్వహించడంతో కర్ణాటకలో ఘర్షణలు చెలరేగాయి.