
బ్యూటీ... బాంబు.....
మన దగ్గరైతే సౌందర్యవతి నేరుగా సినిమాల్లోకి వెళ్తుంది. ఇజ్రాయిల్ లో నైతే సైన్యంలోకి వెళ్తుంది.
ఈ చిత్రంలో ఎర్రటి డ్రస్సులో ఓ నల్ల కలువ లాంటి అందగత్తె కనిపిస్తోంది కదూ... ఆమె ఓ బ్యూటీ క్వీన్. ఆమె పేరు యిత్యిష్ టిటి ఐనావ్. 2013 మిస్ వరల్డ్ పోటీలో ఇజ్రాయిల్ తరఫున పాల్గొన్న అందాల బొమ్మ.
ఆమె పక్కన ఆటోమేటిక్ రైఫిల్ పట్టుకుని శత్రువుల గుండెల్లోకి బుల్లెట్లు దించే ఇంకో కత్తి లాంటి అమ్మాయి కనిపిస్తోంది కదూ. ఆమె ఎవరనుకుంటున్నారు. ఆ సొగసుల కొమ్మ, ఈ సాహసాల బొమ్మ ఒకరే.
పువ్వంత మృదువుగా ఉన్న ఆ అమ్మాయి వజ్రమంత కఠినంగా ఎందుకు మారిందనే కదా మీ ప్రశ్న.
గాజాలో ఇజ్రాయిలీ సైనికుల సరసన నిలిచి నిజంగానే యుద్ధం చేస్తోంది ఐనావ్. తన దేశం పట్ల తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తోంది. ఒక ఇజ్రాయిలీగా తన బాధ్యతను నిర్వర్తిస్తోంది. మన దగ్గరైతే సౌందర్యవతి నేరుగా సినిమాల్లోకి వెళ్తుంది. ఇజ్రాయిల్ లో నైతే సైన్యంలోకి వెళ్తుంది. అదే ఇజ్రాయిల్ విజయ రహస్యం.