బ్యాలెట్ అనబోయి బ్యాటిల్!
తలపట్టుకుంటున్న డెమొక్రాట్లు
మిల్వాయుకీ: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తడబాట్ల పరంపర అంతులేకుండా కొనసాగుతూనే ఉంది. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై దాడి తర్వాత ఆదివారం జాతినుద్దేశించి ప్రసంగిస్తూ ఆయన మళ్లీ తప్పులు మాట్లాడారు. విభేదాలను బ్యాలెట్ బాక్సుల్లో పరిష్కరించుకుంటాం అనబోయి ‘బ్యాటిల్ (యుద్ధ) బాక్సుల్లో’ పరిష్కరించుకుంటామని అన్నారు. దాంతో ఆయన సొంత పార్టీ అయిన డెమొక్రాట్ నేతలు మరోసారి తలపట్టుకున్నారు.
ట్రంప్‌పై దాడి నేపథ్యంలో ఇది రాజకీయంగా ఉద్రిక్తతలను తగ్గించుకోవాల్సిన సమయమని బైడెన్ అభిప్రాయపడ్డారు. ‘‘రాజకీయాలంటే యుద్ధ క్షేత్రం కాదు. పారీ్టలుగా నేతల మధ్య విభేదాలు, భేదాభిప్రాయాలు ఉండొచ్చు. కానీ మనం శత్రువులం కాదని, కలిసి పనిచేసే వారిమని, తోటి పౌరులమేనని గుర్తుంచుకోవాలి. చర్చలైనా, మరోటైనా శాంతియుతమైన జరగాలి. మన దేశంలో హింసకు తావు లేదు. జాతిగా మనమంతా ఒక్కటి కావాల్సిన సమయమిది’’ అంటూ పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment