misspell
-
మళ్లీ తడబడ్డ బైడెన్
మిల్వాయుకీ: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తడబాట్ల పరంపర అంతులేకుండా కొనసాగుతూనే ఉంది. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై దాడి తర్వాత ఆదివారం జాతినుద్దేశించి ప్రసంగిస్తూ ఆయన మళ్లీ తప్పులు మాట్లాడారు. విభేదాలను బ్యాలెట్ బాక్సుల్లో పరిష్కరించుకుంటాం అనబోయి ‘బ్యాటిల్ (యుద్ధ) బాక్సుల్లో’ పరిష్కరించుకుంటామని అన్నారు. దాంతో ఆయన సొంత పార్టీ అయిన డెమొక్రాట్ నేతలు మరోసారి తలపట్టుకున్నారు. ట్రంప్‌పై దాడి నేపథ్యంలో ఇది రాజకీయంగా ఉద్రిక్తతలను తగ్గించుకోవాల్సిన సమయమని బైడెన్ అభిప్రాయపడ్డారు. ‘‘రాజకీయాలంటే యుద్ధ క్షేత్రం కాదు. పారీ్టలుగా నేతల మధ్య విభేదాలు, భేదాభిప్రాయాలు ఉండొచ్చు. కానీ మనం శత్రువులం కాదని, కలిసి పనిచేసే వారిమని, తోటి పౌరులమేనని గుర్తుంచుకోవాలి. చర్చలైనా, మరోటైనా శాంతియుతమైన జరగాలి. మన దేశంలో హింసకు తావు లేదు. జాతిగా మనమంతా ఒక్కటి కావాల్సిన సమయమిది’’ అంటూ పిలుపునిచ్చారు. -
కేంద్ర మంత్రి లెటర్ హెడ్లో అక్షర దోషాలు
న్యూఢిల్లీ: కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ తన పేరుతో ఇచ్చిన లెటర్ హెడ్లో దొర్లిన తప్పులు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో సంబంధిత అధికారలను వివరణ కోరారు. స్మృతి ఇరానీ జూలై 11న తన పేరు మీద ఇచ్చిన లెటర్ హెడ్లో ఇంగ్లీష్, హిందీ భాషల్లో మంత్రి పదంలో అక్షర దోషాలు దొర్లాయి. దీంతో తప్పులను గుర్తించి ఉన్న ఆ లెటర్ హెడ్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా కొందరు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. దీనికి సమాధానంగా 'నా పేరును నేను తప్పుగా హిందీలో రాయనని దీనిపై సంబంధిత అధికారులను వివరణ కోరుతాను' అని స్మృతి ఇరానీ పేర్కొన్నారు. అయితే తప్పు మీ పేరులో కాదు మినిస్టర్ అన్న పదంలో అని తిరిగి ట్విట్లు చేశారు. @rai_saurabh100 no it's not Saurabh. Would not misspell my own name in Hindi. Have asked concerned organisation to give an explanation. — Smriti Z Irani (@smritiirani) August 21, 2015