ballot box
-
అమెరికాలో బ్యాలెట్ డ్రాప్బాక్స్లకు నిప్పు
వాషింగ్టన్: అధ్యక్ష ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ అమెరికాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. గుర్తు తెలియని వ్యక్తులు బ్యాలెట్ డ్రాప్ బాక్స్‌లకు నిప్పు పెట్టారు. సోమవారం జరిగిన వేర్వేరు ఘటనల్లో ఒరెగాన్లోని పోర్ట్‌లాండ్‌లో మూడు బ్యాలెట్ డ్రాప్‌బాక్స్‌లు కాలిపోగా, వాషింగ్టన్, వాంకోవర్‌లో పెద్దసంఖ్యలో దగ్ధమైనట్లు వార్తలొచ్చాయి. అక్టోబర్ 8వ తేదీన వాంకోవర్‌లో జరిగిన ఘటనలో బ్యాలెట్లకు ఎలాంటి నష్టం వాటిల్లలేదని అధికారులు వెల్లడించారు. ఉద్దేశపూర్వకంగా బ్యాలెట్ డ్రాప్ బాక్సులకు నిప్పు పెట్టారని పోర్ట్లాండ్ పోలీస్ అసిస్టెంట్ ఛీఫ్ అమాండా మెక్‌మిల్లన్ తెలిపారు. వాషింగ్టన్, ఒరెగాన్ రాష్ట్రాల్లో జరిగిన ఈ చర్యలపై గుర్తుతెలియని నిందితులపై విధ్వంసక పరికరాన్ని కలిగి ఉండటం, ఓటింగ్ యంత్రాలకు సంబంధించిన సెక్షన్ల కింద కేసులు నమోదుచేశారు. వాంకోవర్‌లో సోమవారం బ్యాలెట్ డ్రాప్ బాక్సుల నుంచి పొగలు వస్తుండటంతో పోలీసులు బ్యాలెట్ బాక్స్ పక్కన ఉన్న అనుమానాస్పద పరికరాన్ని తొలగించారు. ఒరెగాన్లోని పోర్ట్‌లాండ్‌లో బ్యాలెట్ బాక్స్‌లో సోమవారం ఉదయం ఇలాంటి మరో ఘటనే జరిగింది. ఈ ఘటనలో మూడు బ్యాలెట్లు మాత్రమే దెబ్బతిన్నాయని, మరోసారి ఓటు వేసేలా ఆ ఓటర్లను సంప్రదిస్తామని కౌంటీ ఎన్నికల డైరెక్టర్ తెలిపారు. తమ బ్యాలెట్ లెక్కలోకి వచ్చిందో లేదో స్టేటస్‌ను ఆన్లైన్లో చెక్‌చేసుకుని, పరిగణనలోకి రాకపోతే ప్రత్యామ్నాయం కోసం అభ్యర్థించాలని వాషింగ్టన్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ కార్యాలయం ఓటర్లకు సూచించింది. వాంకోవర్‌లో డెమొక్రటిక్ ప్రతినిధి మేరీ గ్లూసెన్కాంప్ పెరెజ్, రిపబ్లికన్ ప్రత్యర్థి జోకెంట్ బరిలో ఉన్నారు. బ్యాలెట్ డ్రాప్ బాక్సులకు పోలీసులు రాత్రిపూట రక్షణగా ఉండాలని గ్లూసెన్కాంప్ పెరెజ్ డిమాండ్ చేశారు. ఫీనిక్స్‌లో గురువారం మెయిల్‌బాక్స్‌ను తగలబెట్టిన ఘటనలో ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఈ ఘటనలో దాదాపు 20 బ్యాలెట్లు ధ్వంసమైనట్లు స్థానిక మీడియా వెల్లడించింది. వాషింగ్టన్ రాష్ట్రంలో చట్టబద్ధమైన, నిష్పాక్షిక ఎన్నికలకు విఘాతం కలిగించే అతివాద చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని అమెరి కా విదేశాంగ మంత్రి స్టీవ్ హాబ్స్ ఒక ప్రకటనలో తెలిపారు. ఓటర్లందరూ సురక్షితంగా ఎన్నికల్లో పాల్గొనేలా చూసే అధికారుల సామర్థ్యంపై తనకు నమ్మకం ఉందన్నారు. -
మళ్లీ తడబడ్డ బైడెన్
మిల్వాయుకీ: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తడబాట్ల పరంపర అంతులేకుండా కొనసాగుతూనే ఉంది. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై దాడి తర్వాత ఆదివారం జాతినుద్దేశించి ప్రసంగిస్తూ ఆయన మళ్లీ తప్పులు మాట్లాడారు. విభేదాలను బ్యాలెట్ బాక్సుల్లో పరిష్కరించుకుంటాం అనబోయి ‘బ్యాటిల్ (యుద్ధ) బాక్సుల్లో’ పరిష్కరించుకుంటామని అన్నారు. దాంతో ఆయన సొంత పార్టీ అయిన డెమొక్రాట్ నేతలు మరోసారి తలపట్టుకున్నారు. ట్రంప్‌పై దాడి నేపథ్యంలో ఇది రాజకీయంగా ఉద్రిక్తతలను తగ్గించుకోవాల్సిన సమయమని బైడెన్ అభిప్రాయపడ్డారు. ‘‘రాజకీయాలంటే యుద్ధ క్షేత్రం కాదు. పారీ్టలుగా నేతల మధ్య విభేదాలు, భేదాభిప్రాయాలు ఉండొచ్చు. కానీ మనం శత్రువులం కాదని, కలిసి పనిచేసే వారిమని, తోటి పౌరులమేనని గుర్తుంచుకోవాలి. చర్చలైనా, మరోటైనా శాంతియుతమైన జరగాలి. మన దేశంలో హింసకు తావు లేదు. జాతిగా మనమంతా ఒక్కటి కావాల్సిన సమయమిది’’ అంటూ పిలుపునిచ్చారు. -
స్ట్రాంగ్ రూములకు ఈవీఎంలు.. ఇకపై పటిష్ఠ నిఘా!
సాక్షి, కరీంనగర్: ఎన్నికల క్రతువు ముగియడంతో జిల్లాలోని నాలుగు నియోజకవర్గాలకు సంబంధించిన ఎన్నికల సామగ్రిని ఎస్సారార్ కళాశాలలోని స్ట్రాంగ్ రూంలకు తరలించారు. వాటిని వచ్చే అయిదేళ్ల వరకు కాపాడాల్సి ఉంటుంది. రిటర్నింగ్ అధికారులు ఈవీఎంలు, వీవీప్యాట్లు, పోస్టల్ బ్యాలెట్ పేపర్లు, వీవీప్యాట్లలోని స్లిప్పులు, మాక్‌పోల్ ధ్రువపత్రాలు, పీవో డైరీ, టెండర్ బ్యాలెట్ పేపర్ తదితరాలను వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచి, తాళాలు, సీల్ వేశారు. 56 రోజులు.. సామాన్యుల పాట్లు! గత అక్టోబర్ 9న ఎన్నికల షెడ్యూల్ ప్రకటన నుంచి కోడ్ అమలులోకి రాగా 56 రోజులపాటు సామాన్యుల నానాపాట్లు పడ్డారు. రూ.50 వేలకు మించి నగదు తీసుకెళ్లాలంటే వ్యాపార, వాణిజ్య వర్గాలతోపాటు పేద, మధ్య తరగతి ప్రజలు భయపడ్డారు. మంగళవారం సాయంత్రం నుంచి కోడ్ ఎత్తివేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. స్ట్రాంగ్ రూములపై నిఘా.. ఈవీఎంలు ఉన్న స్ట్రాంగ్ రూములపై ఎన్నికల అధికారులు పటిష్ఠ నిఘా ఏర్పాటు చేశారు. వాటిని నిరంతరం పర్యవేక్షించడానికి సీసీ కెమెరాలు బిగించడంతోపాటు కేంద్ర బలగాలు మోహరించాయి. తిరిగి ఎన్నికల సంఘానికి అప్పగించేవరకు జిల్లా ఎన్నికల అధికారి బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఎప్పుడైనా ఫిర్యాదు చేయొచ్చు.. ఓట్ల లెక్కింపు ముగిసిన తర్వాత గెలిచిన అభ్యర్థిపై పరాజితులు ఎప్పుడైనా ఫిర్యాదు చేసే అవకాశం ఉంటుంది. ఓట్ల లెక్కింపు సమయంలో అవకతవకలు జరిగాయని భావించినా న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చు. ఇలాంటి సందర్భాల్లో అభ్యర్థులకు న్యాయం చేయడానికి ఈవీఎంల కంట్రోల్ యూనిట్లలో నిక్షిప్తమైన ఓట్లను మళ్లీ లెక్కించాలని కోర్టు ఆదేశించవచ్చు. అలాంటప్పుడు ఏ నియోజకవర్గంలో ఫిర్యాదు అందితే దానికి సంబంధించిన కంట్రోల్ యూనిట్లలో ఓట్లను తక్షణమే లెక్కించడానికి వీలుగా అధికారులు ఈవీఎంలను భద్రపరిచారు. ఎన్నికల ఫలితాలు వెల్లడించిన తర్వాత 45 రోజులపాటు జిల్లా ఎన్నికల అధికారి ఆధ్వర్యంలో ఈవీఎంలకు భద్రత కల్పిస్తారు. అనంతరం వాటిని ఎన్నికల సంఘానికి అప్పగించి, గోదాములకు చేర్చుతారు. అక్కడ ఈవీఎంలను ఐదేళ్లపాటు భద్రపరుస్తారు. అనంతరం ఎన్నికల సంఘం నియమించిన ఇంజినీర్లు వచ్చి, వాటిలోని డేటాను తొలగించి, అవసరాన్ని బట్టి దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగితే అక్కడికి తీసుకెళ్లి, ఉపయోగిస్తారు. కంట్రోల్ యూనిట్లే కీలకం! అభ్యర్థుల మధ్య ఎన్నిక పోటాపోటీగా జరిగినప్పుడు గోదాముల్లో భద్రపరిచిన ఈవీఎంల కంట్రోల్ యూనిట్లు కీలకమవుతాయి. అతి తక్కువ ఓట్లతో ఓడిపోయినవారు ఎప్పుడైనా ఓట్లను మళ్లీ లెక్కించాలని న్యాయస్థానాలను ఆశ్రయిస్తారు. ఆ సందర్భంలో ఇవి ముఖ్య పాత్ర పోషిస్తాయి. 2018 ఎన్నికల్లో 441 ఓట్లతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా ధర్మపురి నియోజకవర్గం నుంచి కొప్పుల ఈశ్వర్ (టీఆర్ఎస్) గెలిచారు. ఆయన దొడ్డిదారిన విజయం సాధించారని కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అయితే, ఈసారి జరిగిన ఎన్నికల్లో కరీంనగర్ నియోజకవర్గంలో 3,163 ఓట్లతో గంగుల కమలాకర్ గెలవగా హుజూరాబాద్, చొప్పదండి, మానకొండూర్ నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఎక్కువ మెజారిటీతో విజయం సాధించారు. దీంతో ఇప్పుడు ఆ పరిస్థితి లేదని ఎన్నికల అధికారులు చెబుతున్నారు. 8 వారాలు ప్రజావాణి నిర్వహించలే.. ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిర్వహించే ప్రజావాణిని ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినప్పటి నుంచి నిలిపివేసిన విషయం విధితమే. 8 వారాలుగా ప్రజావాణి లేకపోవడంతో ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. తాజాగా ఎలక్షన్ కోడ్ ఎత్తివేయడంతో వచ్చే సోమవారం కార్యక్రమం నిర్వహించనున్నారు. దీంతో వందల సంఖ్యలో అర్జీలు రానున్నాయి. ఇవి చదవండి: 'డిసెంబర్ 31'లోగా అని మాటిచ్చారు.. మరవకండి! -
'పోస్టల్ బ్యాలెట్' మిస్సింగ్.. ఉద్యోగుల్లో కలవరం..!
సాక్షి, ఆదిలాబాద్: ఎన్నికల విధులు నిర్వహించే ఉద్యోగులు, సిబ్బందికి అందించే పోస్టల్ బ్యాలెట్ మిస్సింగ్ అవ్వడం ఆదిలాబాద్ జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. ఆదిలాబాద్, బోథ్ నియోజకవర్గంలో ఎన్నికల విధులు నిర్వహించే ఎన్నికల అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ కోసం ఫామ్ 12 ద్వారా ఇదివరకే దరఖాస్తు చేసుకున్నారు. దీని దరఖాస్తు గడువు ఈ నెల 8వ తేదీన ముగిసింది. అయితే పోస్టల్ బ్యాలెట్‌ను వినియోగించుకునేందుకు ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు 15 మంది కార్యాలయాలకు వెళ్లగా మీ దరఖాస్తులు అందలేదని సిబ్బంది చెప్పడంతో విస్తుపోయారు. తాము ఇదివరకే దరఖాస్తు చేసుకున్నా ఎందుకు అందలేదని అధికారులను ప్రశ్నించగా, వారినుంచి సరైన సమాధానం రాలేదు. దీంతో ఏం చేయాలో తెలియక వారు నిరాశతో వెనుదిరగాల్సిన పరిస్థితి నెలకొంది. ఎన్నికల్లో ప్రతీ ఓటు కీలకమని చెప్పే అధికారులు ఇలా తాము చేసుకున్న దరఖాస్తులను ఇంత నిర్లక్ష్యంగా పట్టించుకోకపోవడం ఏమిటని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే జిల్లాలో ఎన్ని ఓట్లు నమోదయ్యాయి. ఎన్ని గల్లంతయ్యాయనే సమాచారం కోసం కలెక్టరేట్ పర్యవేక్షకురాలు జాడి స్వాతిని సంప్రదించగా.. ఎలాంటి పోస్టల్ బ్యాలెట్ మిస్ అవ్వలేదని పేర్కొన్నారు. అయితే ఇంకా దరఖాస్తులు అందాల్సి ఉందని, అవి పూర్తిస్థాయిలో వస్తే తప్పా ఎన్ని వచ్చా యి.. ఎన్ని రాలేదనే సమాచారం చెబుతామని పేర్కొనడం గమనార్హం. ఇవి చదవండి: ‘సారూ.. మంచిగ చెప్పిండ్రు..' అందరు మూడు తోవల పోతున్నరు! -
రాష్ట్రాలకు చేరిన.. మిస్టర్ బ్యాలెట్ బాక్స్
సాక్షి, న్యూఢిల్లీ : రాష్ట్రపతి ఎన్నికల్లో వినియోగించనున్న బ్యాలెట్ బాక్సులు విమానాల్లో రాష్ట్రాలకు చేరుకుంటున్నాయి. ఈ మేరకు రాష్ట్రాలకు చెందిన అధికారులతోపాటు విమానాల్లో వారి పక్క సీట్లను బ్యాలెట్ బాక్స్‌ల కోసం కేటాయించారు. ఈ మేరకు బాక్సుల కోసం ‘మిస్టర్ బ్యాలెట్ బాక్స్’ పేరిట కేంద్ర ఎన్నికల సంఘం విమాన టికెట్లు కొనుగోలు చేసింది. మంగళ, బుధవారాల్లో అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు బ్యాలెట్ బాక్సులు చేరుకొనేలా చర్యలు తీసుకుంది. ఆయా వివరాలను మంగళవారం ఢిల్లీలో ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) రాజీవ్ కుమార్ వెల్లడించారు. ‘మంగళవారం 14 ప్రాంతాలకు బుధవారం 16 ప్రాంతాలకు బ్యాలెట్ బాక్సులు విమానాల్లో చేరుకుంటాయి. రాష్ట్రాల నుంచి వచ్చి అధికారుల తిరిగి అదే రోజు ఢిల్లీకి బ్యాలెట్ బాక్సులను వెంట తీసుకొస్తారు. ఈ నెల 18న రాష్ట్రపతి ఎన్నికల నిర్వహణలో ఎన్నికల సంఘం మరింత పటిష్టత, పారదర్శకత కనబరచాలని రాష్ట్రాల రిటర్నింగ్ అధికారులకు సూచించాం. బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్లు సహా ఎన్నికల సామగ్రి రవాణా, నిల్వల సంబంధ ప్రోటోకాల్ మార్గదర్శకాలను రిటర్నింగ్ అధికారులు ఖచ్చితంగా పాటించాలి’ అని రాజీవ్ చెప్పారు. బ్యాలెట్ బాక్సులు రాష్ట్రాలకు చేరిన తర్వాత శానిటైజ్ చేసి సీలు వేసిన స్ట్రాంగ్ రూమ్‌ల్లో భద్రపరుస్తారు. ఈ ప్రక్రియ మొత్తం వీడియో తీస్తారు. ఎన్నికల ప్రక్రియ ముగిసిన అనంతరం తదుపరి విమానంలో రాష్ట్రాల అధికారులు బ్యాలెట్ బాక్సులను విమానాల్లో ఢిల్లీకి తీసుకురానున్నారు. వాతావరణ పరిస్థితులు అనుకూలించని కారణంగా బాక్స్‌లను హిమాచల్ ప్రదేశ్‌కు రోడ్డు మార్గంలో పంపిస్తారు. చదవండి: ‘ఒత్తిడి కాదు.. కరెక్ట్ నిర్ణయం’ ద్రౌపది ముర్ముకే శివసేన మద్దతు -
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో అతిపెద్ద బ్యాలెట్!
సాక్షి నల్లగొండ : ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ వేగమంతమైంది. ఈసారి బరిలో 71 మంది అభ్యర్థులు ఉండడంతో భారీ బ్యాలెట్ పేపర్ సిద్ధమవుతోంది. నమూనా బ్యాలెట్ తయారు చేసి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాష్ట్ర ఎన్నికల అధికారికి పంపించగా దానిని ఫైనల్ చేశారు. బ్యాలెట్ ముద్రణకు ముంబైకి పంపారు. పెద్ద బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే పోలింగ్‌కు సంబంధించి ఓటర్ స్లిప్‌లను మండలాలవారీగా పంపిణీ చేశారు. వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గంలో 12 కొత్త జిల్లాలు ఉన్నాయి. వాటి పరిధిలో మొత్తం 5,05,565మంది పట్టభద్రులు ఓటర్లుగా నమోదయ్యారు. మొత్తం 731 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నారు. ప్రక్రియలో భాగంగా ఫిబ్రవరి 16 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమై 23న ముగిసిన విషయం తెలిసిందే. 26న ఉçపసంహరణ కార్యక్రమం ముగిసే నాటికి 71 మంది అభ్యర్థులు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలిచారు. ఈ నెల 14న పోలింగ్, 17న కౌంటింగ్ నిర్వహించనున్నారు. అతిపెద్ద బ్యాలెట్ 71మంది పోటీదారులు ఉండడంతో పెద్ద బ్యాలెట్ సిద్ధం చేస్తున్నారు. 18్ఠ23 ఇంచుల బ్యాలెట్ పేపర్ ను ముద్రిస్తున్నారు. నాలుగు కాలాలుగా బ్యాలెట్ ను విభజిస్తున్నారు. ఒక్కో కాలానికి 20 మంది చొ ప్పున అభ్యర్థులు ఉంటారు. ఓటు వేసిన అనంత రం కాలం వారీగా బ్యాలెట్ పేపర్‌ను ఫోల్డ్ చేసేలా ముద్రిస్తున్నారు. బ్యాలెట్ పేపర్‌ను ప్రభుత్వ సంస్థలోనే ముద్రించాలన్న ఉద్దేశంతో ముంబయికి పంపించారు. రెండు రోజుల్లో ముద్రణ పూర్తికానుంది. జంబో బ్యాలెట్ బాక్సులు.. బ్యాలెట్ పేపర్ బారీ ఎత్తున ఉండడంతో దానికి అనుగుణంగా ఎన్నికల అధికారులు జంబో బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేస్తున్నారు. 2్ఠ2్ఠ21/2 సైజులో బాక్సు ఉండేలా చూస్తున్నారు. మొత్తం 12 జిల్లాల పరిధిలో 731 పోలింగ్ స్టేషన్లు ఉండగా ఒక్కో కేంద్రానికి ఒక జంబో బ్యాలెట్ బాక్సుçతోపాటు మరో బిగ్ సైజ్ బ్యాలెట్ బాక్సు ఇవ్వనున్నారు. ఆ దిశగా ఎన్నికల అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఎన్నికల అధికారులు, సిబ్బందికి మొదటి విడత శిక్షణ కూడా ఇచ్చారు. -
పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకోండి: ఎస్ఈసీ
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల సిబ్బంది అందరూ మున్సిపల్ ఎన్నికల్లో విధిగా తమ ఓటు హక్కును పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఉపయోగించుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) విజ్ఞప్తి చేసింది. తమ టీ–పోల్ సాఫ్ట్వేర్ tsec.gov.inలో మున్సిపల్ ఎన్నికల సిబ్బంది తమ వివరాలు నమోదు చేసుకొని పోస్టల్ బ్యాలెట్ పత్రాన్ని (ఫారం–12) పొందవచ్చని తెలిపింది. ఈ ఫారాన్ని పూర్తి చేసి సంబంధిత రిటర్నింగ్ అధికారికి నిర్ణీత సమయానికి సమర్పించి, తదుపరి తమ పోస్టల్ పత్రాన్ని పొందే వరకు పర్యవేక్షించుకోవచ్చని తెలిపింది. పోస్టల్ బ్యాలెట్ పత్రాన్ని పొందేందుకు సిబ్బంది తమ ఆర్వోలు/ మున్సిపల్ కమిషనర్ నుంచి ఫారం–12ను పొంది, అందులో వివరాలను పొందుపరచి వారికి సమర్పించాక.. వారికి పోస్ట్ ద్వారా పోస్టల్ బ్యాలెట్ పత్రాన్ని పంపుతారని తెలియజేసింది. దానిపై సిబ్బంది తమ ఓటు హక్కు వినియోగించుకుని నిర్ణీత కవర్లో పెట్టి కౌంటింగ్ మొదలయ్యేలోగా రిటర్నింగ్ అధికారులకు సమర్పించాలని సూచించింది. గతేడాది జరిగిన పంచాయతీరాజ్, స్థానిక సంస్థల ఎన్నికల్లో విధులు నిర్వహించిన సిబ్బంది చాలా తక్కువ సంఖ్యలో పోస్టల్ బ్యాలెట్ల ద్వారా ఓటు హక్కును వినియోగించుకున్నందున, మున్సిపల్ ఎన్నికల్లో సిబ్బంది తమ ఓటు హక్కును పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఉపయోగించుకోవాలని కోరింది. -
ఈవీఎంలు ఎలా పని చేస్తాయంటే ...
సాక్షి, మిర్యాలగూడ రూరల్ : సాధారణ ఎన్నికల్లో వినియోగించనున్న ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను ఈవీఎంలు అంటారు. ఓటింగ్‌లో కంట్రోలింగ్ యునిట్ (సీయూ), బ్యాలెట్ యునిట్ (బీయూ),కీలకం. వాటి పనితీరును ఎన్నికల వేళ ఒకసారి పరిశీలిద్దాం. ఓటర్లు వేసే ఓటింగ్‌లో సీయూ, బీయూ కీలక మైన ఎన్నికల కేంద్రంలోని అధికారుల వద్ద సీయూ ఉంటుంది. ఓట్లు బీయూలో ఓటు వేయాల్సి ఉంది. ప్రతి ఓటరు ఓటు వేయడానికి వెళ్లేటప్పుడు అధికారి సీఅయూలోని బ్యాలెట్ బటన్ నొక్కితే ఓటరు వద్ద ఉన్న బ్యాలెట్ యునిట్ ద్వారా ఓటు వేసేందుకు వీలవుతుంది. బీయూలో 16 గుర్తుల వరకు ఉంటాయి. ఒక వేళ అంతకంటే ఎక్కువ గుర్తులు ఉంటే...మరో యంత్రాన్ని ఉపయోగించాలి. అభ్యర్థులు పది మందికన్న తక్కువగా ఉంటే ఎంత మంది పోటీలో ఉంటే అందరి గుర్తులు ఉండేలా సాంకేతిక చర్యలు తీసుకుంటారు. ఉదాహరణకు 10మంది అభ్యర్థులు పోటీలో ఉంటే 10బటన్లు మాత్రమే పని చేసేలా చేస్తారు. అదే విధంగా పై వారిలో ఎవరు కాదు అనే అనే అంశంలో( నోటా)బటన్ కూడా ఉంటుంది. ఇది అభ్యర్థుల అందరి గుర్తు కంటే దిగువన ఉంటుంది. ఎన్నికల అధికారి సీయూలో బ్యాలెట్ బటన్ నొక్కగానే ఓటు వేసేందుకు వెళ్లిన ఓటరు వద్ద ఉన్న బీయూలోని ‘బిజీ’ బల్బు వెలుగుతుంది. బీయూలోని అభ్యర్థుల గుర్తుల్లో ఎదురుగా ఉన్న బటన్ నొక్కితే ఓటు వేసే పక్రియ పూర్తయినట్లు. ఎన్నిక పూర్తి కాగానే బీజీ బల్బు ఆగిపోతుంది. అప్పుడు అధికారి మరో ఓటరును పంపించి ఎన్నికల అధికారి బ్యాలెట్ బటన్ నొక్కుతాడు. ఇలా మరొకరు ఓటు వేసేందుకు వీలవుతుంది. సీయూ, బీయూ ధ్రువీకరణ : సీయూ, బీయూ వెనుక వైపున పనిశీలిస్తే ఈవీఎం యంత్రాలు క్యూసీ క్వాలిటీ చెక్ జరుగుతుందీ లేనిది తెలుసుకోవచ్చు. వెనుక భాంగాలో అంటించి ఉండే స్టికర్‌పై ఈవీఎం తయారీ సంస్థ ఈసీఎల్ ప్రతినిధి, జిల్లా ఎన్నిక అధికారి ఈవీఎం పనితీరు, క్వాలిటీని ధ్రువీకరిస్తూ సంతకాలు చేసి ఉంటాయి. పకడ్బందీగా పరిశీలన : ప్రస్తుతం ఈవీఎంల తనిఖీ చాలా వరకు పకడ్బందీగా నిర్వహిస్తున్నారు. ప్రథమ దశలో సజావుగా ఉన్నాయని తెలిపేందుకు పైభాగంలో భారత ప్రభుత్వ లోగోతో కూడిన పింక్ స్టికర్ అంటిస్తారు. ఈవీఎంలపై ఆయా రాజకీయ పార్టీల సందేహాలు, అనుమానాలు నివృతి చేసేందుకు వీలుగా మాక్ పోలింగ్ నిర్వహిస్తారు. ఈ మాక్ పోలింగ్ సందర్భంగా ఆయా పార్టీ అభ్యర్థులు తమకు నచ్చిన గుర్తుపై ఓట్లు వేసి తరువాత పోలైన ఓట్లతో ఏయే గుర్తులకు ఎన్ని ఓట్లు పడ్డాయో సరిచూస్తారు. నీలి రంగు మూతలు తెరిస్తే ...క్లోజ్ , రిజల్స్ ,ప్రింట్ ,క్లియర్ అనే బటన్లు కనిపిస్తాయి. ఆయా సూచికలు సదరు పనిచేస్తాయి. రివర్స్ బటన్ నొక్కితే ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయో తెలుస్తుంది. ఇవన్ని రిటర్నింగ్ అధికారులు నిర్వహించే పనులు కాగా రాజకీయ పార్టీల అనుమానాలు తొలగించేందుకు మాక్ పోలింగ్‌లో వాటిద్వారా ఈవీఎం పని తీరు తెలియజేస్తారు. కంట్రోలింగ్ యూనిట్ కంట్రోలింగ్ యూనిట్లో ఎరుపు రంగు దీర్ఘ చతురస్రాకారంలో ఉన భాగం ‘‘డిస్ప్లే’’ఈ ప్రాతంలో ఎంత మంది ఓటు వేసింది.. ఎప్పటికప్పుడు తెలుపుతుంది. దిగువన నీలి రంగులో చతురస్రాకార భాగాలున్న ప్రాంతంలో ఉన్న››‘క్యాండ్ సెట్ యూనిట్ ’గా వ్యవహరిస్తారు. వీటిని రిటర్నింగ్ అధికారి స్థాయిలో పోలింగుకు ముందు తగిన విధంగా సెట్ చేసి ఉపయోగిస్తారు. -
ఎన్నికలు నిష్పక్షపాతంగా నిర్వహించాలి
ప్రిసైడింగ్ అధికారులకు జిల్లా ఎన్నికల అధికారి ఆదేశం ఒంగోలు టౌన్ : జిల్లాలో ఈ నెల 9న జరగనున్న శాసనమండలి ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సుజాతశర్మ ఆదేశించారు. సోమవారం స్థానిక పాత జిల్లా పరిషత్ కార్యాలయ సమావేశపు హాలులో ప్రిసైడింగ్ అధికారులు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులతో ఎన్నికల నిర్వహణపై ఏర్పాటు చేసిన శిక్షణ తరగతులను ఉద్దేశించి ఆమె మాట్లాడారు. ఎన్నికల నిర్వహణలో ప్రిసైడింగ్ అధికారుల పాత్ర చాలా కీలకమైందన్నారు. పోలింగ్ కేంద్రానికి ముందుగానే చేరుకొని బ్యాలెట్ బాక్స్‌లను సిద్ధం చేసుకోవాలని సూచించారు. ముందుగా ఖాళీ బ్యాలెట్ బాక్స్‌లు పోలింగ్ ఏజెంట్లకు చూపించి పేపర్ సీల్‌పై వారి సంతకాలు తీసుకొని క్రమపద్ధతిలో అమర్చాలని సూచించారు. అంతకు ముందు పోలింగ్ ఏజెంట్లు, వారి అభ్యర్థుల సంతకాలు పరిశీలించి సరిచూసుకొని వారికి గుర్తింపు కార్డులు ఇవ్వాలని చెప్పారు. ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చే ఓటర్ల ఎడమచేయి చూపుడు వేలుకు సిరా గుర్తు చేయాలన్నారు. పోలింగ్ కేంద్రంలోకి పోలింగ్ సిబ్బంది, ఏజెంట్లు, పోటీ చేస్తున్న అభ్యర్థులు, వారి ఎన్నికల ఏజెంట్లు, సూక్ష్మ పరిశీలకులు, జోనల్ అధికారులు, ఎన్నికల పరిశీలకులు, ఓటర్లను, దివ్యాంగులకు సహాయకులు, బీఎల్ఓలు, చంటిబిడ్డలతో వచ్చే మహిళలను మాత్రమే అనుమతించాలని ఆదేశించారు. ఎన్నికలను క్రమశిక్షణతో హుందాగా నిర్వహించాలని సూచించారు. తొలుత బ్యాలెట్ బాక్స్‌లు సీల్‌వేసే విధానం, పోలింగ్ ప్రక్రియను జిల్లా పరిషత్ సీఈఓ బాపిరెడ్డి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కొండయ్యలు వివరించారు. -
బ్యాలెట్ పత్రాలకు చెదలు
నెల్లూరు జిల్లా కావలిలో ఓ కళాశాలలో ఉంచిన కొండాపురం మండలం బ్యాలెట్ బాక్స్‌లకు చెదలు పట్టాయి. మంగళవారం ఓట్లు లెక్కింపు సందర్బంగా బ్యాలెట్ బాక్స్‌లను ఏజెంట్లు బయటకు తీశారు. అందులోని బ్యాలెట్ పత్రాలకు చెదలు పట్టి చిరిగిపోయి ఉన్నాయి. బ్యాలెట్ పత్రాలు చిరిగిపోయిఉండటంపై ఏజెంట్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ విషయాన్ని ఏజెంట్లు ఆర్డీవో దృష్టికి తీసుకువెళ్లారు. ఆర్డీవో బ్యాలెట్ బాక్స్‌లు, పత్రాలను పరిశీలించి జిల్లా కలెక్టర్ పరిస్థితి వివరించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు దీనిపై రిటర్నింగ్ అధికారి తుది నిర్ణయం తీసుకోనున్నారు. అయితే బ్యాలెట్ పత్రాలకు చెదలు పట్టడంతో అభ్యర్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. -
తడిసిన బ్యాలెట్ బాక్స్‌లు, అభ్యర్థుల ఆందోళన
తూర్పు గోదావరి జిల్లాలోని పెద్దపూడి మండలంలో పోలైన ఓట్లతో కూడిన బ్యాలెట్ బ్యాక్స్ వర్షానికి తడిసిపోయింది. దాంతో బ్యాలెట్ బ్యాక్స్లోని పేపర్లు పూర్తిగా తడిసిపోయాయి. బ్యాలెట్ పేపర్లు అధికారులు ఆరబెడుతున్నారు. అలాగే పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ -1, నిడదవోలు మండలంలోని కోరుమామిడి, తాడిమల్ల గ్రామాలకు చెందిన బ్యాలెట్ బాక్స్‌లోకి వర్షపు నీరు వచ్చి చేరడంతో ... బ్యాలెట్ పేపర్లు పూర్తిగా తడిసిపోయాయి. పేపర్లను ఎన్నికల సిబ్బంది ఆరబెడుతున్నారు. బ్యాలెట్ బాక్స్‌లు తడవటంతో సదరు అభ్యర్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. -
ఆఖరి మోఖా
సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : ఒక్క ఓటు అటు ఇటైతే.. గెలుపోటములు తారుమారవుతాయి. అందుకే బ్యాలెట్ బాక్స్‌ల్లో పడే.. ప్రతి ఓటును తమ ఖాతాలో జమ చేసుకునేందుకు అభ్యర్థులు ఆరాటపడుతున్నారు. పోలింగ్ ముగిశాక విజయం తమదంటే తమదేనని ధీమా వ్యక్తం చేస్తున్న ప్రధాన పార్టీల అభ్యర్థులు ఆఖరి ప్రయత్నంగా పోస్టల్ బ్యాలెట్లపై దృష్టి సారించారు. హోరాహోరీ పోరులో ఈ ఓట్లు సైతం తమకు కలిసొస్తాయని ఛాలెంజ్‌గా స్వీకరిస్తున్నారు. కౌంటింగ్ ముందు రోజు మే 15 సాయంత్రం వరకు వీటిని దాఖలు చేసే అవకాశముంది. గత నెలాఖరు వరకు వీటిని దరఖాస్తు చేసుకున్న పోలింగ్ ఉద్యోగులు, సిబ్బందికి ఈ ఓటు వర్తిస్తుంది. జిల్లాలోని 13 నియోజకవర్గాల పరిధిలో మొత్తం 13,028 మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్లకు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 10,157 మందికి ఇప్పటికే ఎన్నికల యంత్రాంగం బ్యాలెట్ పత్రాలను జారీ చేసింది. కరీంనగర్, హుజూరాబాద్, హుస్నాబాద్, సిరిసిల్ల, జగిత్యాల నియోజకవర్గాల్లో వీటి సంఖ్య వెయ్యి దాటింది. అత్యధికంగా కరీంనగర్లో 3,638 మంది, అత్యల్పంగా ధర్మపురిలో 375 మంది పోలింగ్ సిబ్బంది వీటికి దరఖాస్తు చేసుకున్నారు. తక్కువ ఓట్లు ఉన్నప్పటికీ లెక్కింపు సందర్భంగా పోస్టల్ బ్యాలెట్లు కీలకంగా మారనున్నాయి. అభ్యర్థుల మధ్య పోటాపోటీ ఉన్నప్పుడు ఈ ఓట్లే జయాపజయాలను నిర్ణయిస్తాయనటంలో సందేహం లేదు. కౌంటింగ్ రోజున మొట్టమొదటగా రిటర్నింగ్ ఆఫీసర్ టేబుల్‌పై ఈ ఓట్లను లెక్కిస్తారు. అందుకే ఎలాగైనా వీటిని సొంతం చేసుకునేందుకు ప్రధాన పార్టీల అభ్యర్థులు పోటీ పడుతున్నారు. కొన్ని సెగ్మెంట్లలో అభ్యర్థులు పేరుపేరునా పోలింగ్ సిబ్బంది ఫోన్ నెంబర్లు సేకరించి.. ఫోన్లోనే ఓట్లు అభ్యర్థించే పని పెట్టుకున్నారు. కొందరు నాయకులు ప్రత్యేకంగా పోలింగ్ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి వారిని అభ్యర్థించి.. రకరకాల మార్గాల్లో వారిని ఆకట్టుకొని తమకు అనుకూలంగా ఓట్లు రాబట్టుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. కొందరు అభ్యర్థులు గంపగుత్తగా తమ ఓట్లు వేయించాలని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులను ఆశ్రయిస్తున్నారు. రామగుండం, కోరుట్ల నియోజకవర్గాల్లో తిరుగుబాటు అభ్యర్థులు ప్రత్యర్థులకు గట్టి పోటీనిచ్చారు. ఈ రెండు సెగ్మెంట్లలో ఇండిపెండెంట్ అభ్యర్థులే పోస్టల్ బ్యాలెట్ల సేకరణలోనూ పోటీ పడుతున్నారు. క్రాస్ ఓటింగ్ ఎవరిని గెలిపిస్తుందోనని అందోళనలో ఉన్న ఎంపీ అభ్యర్థులు వీటిని తమకు అనుకూలంగా మలుచుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇప్పటివరకు పోస్టల్ బ్యాలెట్లకు దరఖాస్తు చేసుకున్న వారిలో 2431 మంది తమ ఓట్లు దాఖలు చేశారు. మరో 13 రోజులు గడువు ఉండటంతో అభ్యర్థులు వీటికి గురి పెట్టిన తీరు ఆసక్తి రేపుతోంది. -
ఈవీఎం..అదో అద్భుతం
సాక్షి, ముంబై: ఒకప్పుడు ఓటు వేయడమంటే పోలింగ్ బూత్‌లోకి వెళ్లడం, అక్కడ ఎన్నికల సిబ్బంది ఇచ్చిన పొడుగాటి బ్యాలెట్ పేపరుపై ఉన్న వివిధ గుర్తుల్లో తమకు నచ్చిన ఒక అభ్యర్థి గుర్తుపై ముద్ర వేయడం, ఆ తరువాత దాన్ని మడతపెట్టి అక్కడే ఉంచిన బ్యాలెట్ బాక్స్‌లో వేయడమనే తంతు ఉండేది. ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెల్లడికి కనీసం ఒకటి లేదా రెండు రోజుల సమయం పట్టేంది. కానీ ఇప్పుడు కాలం మారిపోయింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చింది. బ్యాలెట్ పత్రాల ముద్రణ గత చరిత్ర. దాని స్థానంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ (ఈవీఎం) లు అందుబాటులోకొచ్చాయి. ఎన్నికల ప్రక్రియతోపాటు లెక్కింపు, ఫలితాల వెల్లడి కొద్దిసేపట్లోనే ముగుస్తుంది. ఇందుకు ప్రధాన కారణం ఈవీఎంలే. దేశంలో 1982లో వీటిని కేరళలోని పరూర్ నియోజకవర్గం ఉప ఎన్నికకు తొలిసారిగా వినియోగించారు. ఎలా పనిచేస్తాయంటే.. ఈవీఎంలో అనేక కీలమైన విభాగాలుంటాయి. దీనిని వినియోగించడంద్వారా మనం ఎవరికి ఓటు వేశామనే విషయం సిబ్బందికి కూడా తెలియదు. మీట నొక్కగానే బీప్ శబ్దం వస్తుంది. దీంతో ఓటింగ్ ప్రక్రియ పూర్తయి లాక్ అవుతుంది. ఒకవేళ ఓటరు రెండోసారి నొక్కడానికి ప్రయత్నించినా అది సాధ్యం కాదు. రెండు మీటలు ఒకేసారి నొక్కితే దేనికీ ఓటు పడదు. ఆ తర్వాత సిబ్బంది తమవద్ద ఉన్న యంత్రం మీట నొక్కడంతో మరో వ్యక్తికి ఓటు వేసేందుకు మార్గం సుగమమవుతుంది. ఈవీఎంలు ఆరు వోల్టుల బ్యాటరీతో పనిచేస్తాయి. ఒకవేళ పోలింగ్ కేంద్రాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయినా ఈ యంత్రాలకు అంతరాయం కలగదు. బ్యాటరీతో పనిచేయడంవల్ల మీటా నొక్కగానే ఈవీఎంకు అనుసంధానించిన కంప్యూటర్లో ఓటు నమోదవుతుంది. ఏ అభ్యర్థికి ఓటు వేశామో అందులో నమోదవుతుంది. ఇక ఒక్కో ఈవీఎంకు 3,840 ఓట్లను నమోదు చేసుకునే సామర్థ్యముంది. ఇలాంటి యంత్రాలు ఒక్కో పోలింగ్ కేంద్రంలో కనీసం ఒకటి లేదా రెండింటిని అందుబాటులో ఉంచుతారు. అదేవిధంగా ఒక్కో ఈవీఎంలో 16 గుర్తులు మాత్రమే ఉంటాయి. అంతకంటే ఎక్కువ సంఖ్యలో అభ్యర్థులు బరిలో దిగితే రెండు ఈవీఎంలు ఉంచుతారు. దీన్ని మొదటి ఈవీఎంతో అనుసంధానిస్తారు. ఇలా నాలుగు యంత్రాలను ఒకదానితో మరొకటి అనుసంధానించేందుకు వీలుంది. అంటే ఒకే నియోజక వర్గంలో 64 మంది అభ్యర్థులు బరిలో ఉన్నప్పటికీ ఇబ్బందేమీ ఉండదు. ప్రక్రియ ఎప్పటిలాగే కొనసాగుతుంది. -
బస్సులోంచి పడిన బ్యాలెట్ బాక్స్
వేపాడ, న్యూస్‌లైన్: ప్రజాభిప్రాయాన్ని గుట్టుగా ఉంచాల్సిన ఎన్నికల సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారు. దీనిపై ప్రశ్నించిన పాత్రికేయులపై ‘మీరు బయటికి పొండి’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో శుక్రవారం నిర్వహించిన స్థానిక పోలింగ్‌లో భాగంగా వేపాడ మండలంలో రూట్ నంబర్ 7లో ఉన్న నీలకంఠరాజపురం ఎంపీటీసీ సెగ్మెంట్లో నంబర్ 40వ బూత్‌లో ఎన్నికలు ప్రక్రియ పూర్తిచేశారు. పోలింగ్ పూర్తయిన తర్వాత శుక్రవారం రాత్రి 7.30 గంటల అనంతరం బ్యాలెట్ పెట్టెలకు సీళ్లు వేసిన ఎన్నికల సిబ్బంది ఎన్నికల విధుల కోసం కేటాయించిన ఆర్టీసీ బస్‌లో వేపాడ మండల కేంద్రానికి బయల్దేరారు. భరతవానిపాలెం గ్రామానికి ముందున తాడవానిచెరువు మలుపు తిరుగుతుండగా బస్‌లో ఉన్న 40వ బూత్‌కు చెందిన బ్యాలెట్ బాక్స్ రోడ్డుపై పడింది. దీంతో బ్యాలెట్ బాక్స్ సీల్ ఊడిపోయి బ్యాలెట్ పేపర్లు చెల్లాచెదురుగా పడిపోయాయి. వెంటనే అప్రమత్తమైన ఎన్నికల సిబ్బంది బ్యాలెట్ పేపర్లను ఏరి బాక్స్‌లో వేశారు. ఇది గమనించిన భరతవానిపాలెం గ్రామస్తులు సహాయం చేయబోగా ఎస్కార్ట్‌గా ఉన్న పోలీసులు ఎవ్వరినీ దరి చేరనీయలేదు. బ్యాలెట్‌పత్రాలు ఏరుకుని బ్యాలెట్ బాక్స్‌లో వేసి, బ్యాలెట్బాక్స్తో సహా వేపాడ చేరారు. గ్రామస్తుల ద్వారా ఈ విషయం తెలుసుకున్న పాత్రికేయులు ఆర్ఓ, ఏఆర్ఓలకు సంఘటన వివరాలు చెప్పి వివరణ కోరగా తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని బదులిచ్చారు. ఈ సంఘటనను రూడీ చేసుకోవటానికి వల్లంపూడి పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్న విలేకరులు ఎస్.ఐ బాలాజీరావును వివరణ కోరగా ఆయన తన పోలీస్ సిబ్బందితో మాట్లాడి ‘బాక్స్ పడిపోవటం నిజం. సీల్ ఊడిపోయిందట. ఏమయిందో తెలీదు. పూర్తి వివరాలు తెలియాలి.’ అంటూ చెప్పారు. దీంతో విలేకరులతో పాటూ నీలకంఠరాజపురానికి చెందిన వైఎస్సార్సీపీ నేతలు వేచలపు చినరాయునాయుడు, పోతల రమణ, కండిపల్లి పెదనాయుడులు అంతా ఆర్ఓ, ఏఆర్ఓలకు ఫిర్యాదు చేశారు. అయితే నేతల ప్రశ్నలకు ఆర్ఓ మాధరావు, ఏఆర్ఓ గ్లాడ్సలు సరిగ్గా స్పందించలేదు. ‘మేము చూడం. మాకు ఫిర్యాదు లేదు. మీరు బయటికి పొండి. పీఓ వస్తే చెబితే అప్పుడు చూస్తాం. అడిగేందుకు మీరెవ్వరు’ అంటూ సమాధానం దాటవేశారు. దీంతో వాతావరణం ఉద్రిక్తంగా మారింది. నేతలకు అధికారులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. అదే సమయంలో సీల్ లేని బ్యాలెట్ బాక్స్ ఎంపీడీఓ ఆఫీసుకు చేరుకుంది. ఇది చూసిన పార్టీ నేతలు, విలేకరులు ‘ఇది ఎలా తెరుచుకుంది? ఎవరు తెరిచారు? ఈ ఘటనకు బాధ్యులు ఎవరు. మీకు భాద్యత లేదా..?’ అంటూ నిలదీశారు. అయితే ఎవరూ సమాధానం చెప్పకపోవడంతో వైఎస్ఆర్ సీపీ నేతలు అక్కడ ఎంపీడీఓ కార్యాలయంలో బైఠాయించారు. విషయం తెలుసుకున్న టీడీపీ నేతలు జి.భారతి, కె.గోవింద, కాంగ్రెస్ నేతలు ఎం.సత్యంనాయుడు తదితరులు వచ్చి అధికారుల తీరును నిరసించారు. 40వ బూత్‌కు ప్రిసైడింగ్ అధికారిగా బాధ్యతలు నిర్వహించిన ఎల్.దాలినాయుడును ఘటన పై వివరణ కోరగా ఆయన మాట్లాడుతూ ‘టర్నింగ్లో బాక్స్ కిందపడింది నిజం. సీల్ ఊడిపోయింది, నాలుగు బ్యాలెట్ పేపర్లు పడిపోయాయి. వెంటనే ఏఆర్ఓకు చెప్పాం. బాక్స్ ఆఫీస్‌కు తెచ్చేయమన్నారు. తెచ్చి అప్పగించాం’ అన్నారు. 7వ రూట్అధికారి సతీష్ కూడా ఇలాగే చెప్పారు. అనంతరం జోనల్ అధికారి కె.ఆర్.వి.పైడిరాజు మాట్లాడుతూ ‘నాలుగు రూట్లు చూశాను. ఆర్ఓల నుంచి మెటీరియల్ తీసుకుంటుండగా విషయం తెలిసింది. ఏమైందీ నాకూ పూర్తిగా తెలియదు అంటూ చెప్పారు. ఈ మొత్తం వ్యవహారంపై ఆర్.ఓ ఎ.మాధవరావు, ఎ.ఆర్.ఓ గ్లాడ్స్లు మాత్రం పెదవివిప్పలేదు. -
ప్రాదేశిక పోరు మలివిడతకు ఏర్పాట్లు పూర్తి
సాక్షి, రంగారెడ్డి జిల్లా : ప్రాదేశిక పోరు మలివిడతకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. జిల్లాలోని చేవెళ్ల, సరూర్‌నగర్ రెవెన్యూ డివిజన్లలోని 17 జెడ్పీటీసీ స్థానాలు, 311 ఎంపీటీసీ స్థానాలకు శుక్రవారం పోలింగ్ నిర్వహించనున్నారు. ఉదయం 7గంటలకు ఓటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించి జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. ఇప్పటికే బ్యాలెట్ పత్రాలు, ఇతర సామగ్రితో అధికారులు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. చేవెళ్ల డివిజన్లో 4,07,902 మంది, సరూర్‌నగర్ డివిజన్లో 3,77,602 మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. గత ఆదివారం జరిగిన తొలివిడత ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించిన జిల్లా యంత్రాంగం.. అదే ఉత్సాహంతో ఏర్పాట్లను పూర్తి చేసింది. 17 మండలాల్లో పోలింగ్ మలివిడతలో భాగంగా శుక్రవారం జిల్లాలోని 17 మండలాల్లో పోలింగ్ ప్రక్రియ నిర్వహించనున్నారు. చేవెళ్ల, దోమ, గండేడ్, హయత్‌నగర్, ఇబ్రహీంపట్నం, కందుకూరు, కుల్కచర్ల, మహేశ్వరం, మంచాల, మొయినాబాద్, నవాబ్‌పేట, పరిగి, పూడూరు, సరూర్‌నగర్, షాబాద్, శంకర్పల్లి, యాచారం మండలాల్లో 935 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మలివిడత పోలింగ్ ప్రక్రియకు 4,675 మంది సిబ్బందిని ఎన్నికల విధులకు నియమించారు. వీరిలో 935 పోలింగ్ అధికారులు, 935 సహాయ పోలింగ్ అధికారులు, 2,805 మంది ఇతర సిబ్బంది ఉన్నారు. అదేవిధంగా 10శాతం.. అంటే 468 మంది సిబ్బందిని అదనంగా అందుబాటులో ఉంచారు. గురువారం సాయంత్రమే సిబ్బంది సంబంధిత పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. జిల్లాలో 215 సున్నిత, 165 అతి సున్నితమైన పోలింగ్ కేంద్రాలున్నాయి. వీటి పరిధిలో భద్రతను కట్టుదిట్టం చేయడంతో పాటు ఓటింగ్ సరళిని వీడియో, వెబ్‌కాస్టింగ్‌లో చిత్రీకరించనున్నారు. అదేవిధంగా సూక్ష్మ పరిశీలకులను ఏర్పాటు చేసి ఓటింగ్ శాంతియుతంగా జరిగేందు కు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. శుక్రవారం నాటి ఎన్నికల బరిలో 1,332 మంది అభ్యర్థులున్నారు. 17 జెడ్పీటీసీ స్థానాలకు 107 మంది అభ్యర్థులు పోటీ పడుతుండగా.. 311 ఎంపీటీసీ స్థానాలకు 1,225 మంది బరిలో నిలిచారు. చాలాకాలం తర్వాత ప్రాదేశిక సమరం జరుగుతుండ డం.. పార్టీ గుర్తులపై జరుగుతున్న ఎన్నికలు కావడంతో పార్టీలు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. ఇప్పటికే పోటాపొటీగా ప్రచారం చేసిన అభ్యర్థులు ఇప్పుడు అంతర్గత ప్రచారంలో నిమగ్నమయ్యారు. జెడ్పీటీసీ స్థానాలు : 17 ఎంపీటీసీ స్థానాలు : 311 బరిలో ఉన్న అభ్యర్థులు : 1,332 ఓటర్లు : 7,85,504