ఈవీఎం
సాక్షి, మిర్యాలగూడ రూరల్ : సాధారణ ఎన్నికల్లో వినియోగించనున్న ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను ఈవీఎంలు అంటారు. ఓటింగ్‌లో కంట్రోలింగ్ యునిట్ (సీయూ), బ్యాలెట్ యునిట్ (బీయూ),కీలకం. వాటి పనితీరును ఎన్నికల వేళ ఒకసారి పరిశీలిద్దాం.
ఓటర్లు వేసే ఓటింగ్‌లో సీయూ, బీయూ కీలక మైన ఎన్నికల కేంద్రంలోని అధికారుల వద్ద సీయూ ఉంటుంది. ఓట్లు బీయూలో ఓటు వేయాల్సి ఉంది. ప్రతి ఓటరు ఓటు వేయడానికి వెళ్లేటప్పుడు అధికారి సీఅయూలోని బ్యాలెట్ బటన్ నొక్కితే ఓటరు వద్ద ఉన్న బ్యాలెట్ యునిట్ ద్వారా ఓటు వేసేందుకు వీలవుతుంది. బీయూలో 16 గుర్తుల వరకు ఉంటాయి. ఒక వేళ అంతకంటే ఎక్కువ గుర్తులు ఉంటే...మరో యంత్రాన్ని ఉపయోగించాలి. అభ్యర్థులు పది మందికన్న తక్కువగా ఉంటే ఎంత మంది పోటీలో ఉంటే అందరి గుర్తులు ఉండేలా సాంకేతిక చర్యలు తీసుకుంటారు. ఉదాహరణకు 10మంది అభ్యర్థులు పోటీలో ఉంటే 10బటన్లు మాత్రమే పని చేసేలా చేస్తారు. అదే విధంగా పై వారిలో ఎవరు కాదు అనే అనే అంశంలో( నోటా)బటన్ కూడా ఉంటుంది. ఇది అభ్యర్థుల అందరి గుర్తు కంటే దిగువన ఉంటుంది. ఎన్నికల అధికారి సీయూలో బ్యాలెట్ బటన్ నొక్కగానే ఓటు వేసేందుకు వెళ్లిన ఓటరు వద్ద ఉన్న బీయూలోని ‘బిజీ’ బల్బు వెలుగుతుంది. బీయూలోని అభ్యర్థుల గుర్తుల్లో ఎదురుగా ఉన్న బటన్ నొక్కితే ఓటు వేసే పక్రియ పూర్తయినట్లు. ఎన్నిక పూర్తి కాగానే బీజీ బల్బు ఆగిపోతుంది. అప్పుడు అధికారి మరో ఓటరును పంపించి ఎన్నికల అధికారి బ్యాలెట్ బటన్ నొక్కుతాడు. ఇలా మరొకరు ఓటు వేసేందుకు వీలవుతుంది.
సీయూ, బీయూ ధ్రువీకరణ :
సీయూ, బీయూ వెనుక వైపున పనిశీలిస్తే ఈవీఎం యంత్రాలు క్యూసీ క్వాలిటీ చెక్ జరుగుతుందీ లేనిది తెలుసుకోవచ్చు. వెనుక భాంగాలో అంటించి ఉండే స్టికర్‌పై ఈవీఎం తయారీ సంస్థ ఈసీఎల్ ప్రతినిధి, జిల్లా ఎన్నిక అధికారి ఈవీఎం పనితీరు, క్వాలిటీని ధ్రువీకరిస్తూ సంతకాలు చేసి ఉంటాయి.
పకడ్బందీగా పరిశీలన :
- ప్రస్తుతం ఈవీఎంల తనిఖీ చాలా వరకు పకడ్బందీగా నిర్వహిస్తున్నారు. ప్రథమ దశలో సజావుగా ఉన్నాయని తెలిపేందుకు పైభాగంలో భారత ప్రభుత్వ లోగోతో కూడిన పింక్ స్టికర్ అంటిస్తారు.
- ఈవీఎంలపై ఆయా రాజకీయ పార్టీల సందేహాలు, అనుమానాలు నివృతి చేసేందుకు వీలుగా మాక్ పోలింగ్ నిర్వహిస్తారు. ఈ మాక్ పోలింగ్ సందర్భంగా ఆయా పార్టీ అభ్యర్థులు తమకు నచ్చిన గుర్తుపై ఓట్లు వేసి తరువాత పోలైన ఓట్లతో ఏయే గుర్తులకు ఎన్ని ఓట్లు పడ్డాయో సరిచూస్తారు.
- నీలి రంగు మూతలు తెరిస్తే ...క్లోజ్ , రిజల్స్ ,ప్రింట్ ,క్లియర్ అనే బటన్లు కనిపిస్తాయి. ఆయా సూచికలు సదరు పనిచేస్తాయి.
- రివర్స్ బటన్ నొక్కితే ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయో తెలుస్తుంది. ఇవన్ని రిటర్నింగ్ అధికారులు నిర్వహించే పనులు కాగా రాజకీయ పార్టీల అనుమానాలు తొలగించేందుకు మాక్ పోలింగ్‌లో వాటిద్వారా ఈవీఎం పని తీరు తెలియజేస్తారు.
కంట్రోలింగ్ యూనిట్
కంట్రోలింగ్ యూనిట్‌లో ఎరుపు రంగు దీర్ఘ చతురస్రాకారంలో ఉన భాగం ‘‘డిస్‌ప్లే’’ఈ ప్రాతంలో ఎంత మంది ఓటు వేసింది.. ఎప్పటికప్పుడు తెలుపుతుంది. దిగువన నీలి రంగులో చతురస్రాకార భాగాలున్న ప్రాంతంలో ఉన్న››‘క్యాండ్ సెట్ యూనిట్ ’గా వ్యవహరిస్తారు. వీటిని రిటర్నింగ్ అధికారి స్థాయిలో పోలింగుకు ముందు తగిన విధంగా సెట్ చేసి ఉపయోగిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment