బంధం.. ప్రతి బంధకం | Dhiravath Thanda Village Review In Miryalaguda | Sakshi
Sakshi News home page

బంధం.. ప్రతి బంధకం

Published Wed, Nov 21 2018 12:57 PM | Last Updated on Wed, Nov 21 2018 12:58 PM

Dhiravath Thanda Village Review In Miryalaguda - Sakshi

ధీరావత్‌ తండా రివ్యూ

సాక్షి,మిర్యాలగూడ రూరల్‌ : అర్హులందరికీ ఓటు హ క్కు కల్పిస్తాం, ఓటు వేసేందుకు సకల సౌకర్యాలు కల్పిస్తున్నాం అని ఎన్నికల అధికారులు చెబుతున్నారు. కానీ కొన్ని గ్రామాల ఓటర్ల పోలింగ్‌ బూత్‌ అందుబాటులో లేక ఓటు వేసేందుకు నానావస్థలు పడుతున్న గ్రామాలు ఇంకా ఉన్నాయి. ఆ కోవకు చెందిన గ్రామమే మిర్యాలగూడ మండలం తుంగపహాడ్‌ గ్రామ పంచాయతీ పరిధిలోని ధీరావత్‌తండా. ఇటీవల నూతన గ్రామ పంచా యతీగా మారింది. ఈ తండాలో 315 మంది ఓట ర్లు ఉన్నారు. ఇందులో ఐదుగురు వృద్ధులు, ఇద్ద రు దివ్యాంగులున్నారు. ఈ గ్రామస్తులు ఓటు వే సేందుకు తుంగపహాడ్‌ గ్రామ శివారు లావూడితండాలో పోలింగ్‌ బూత్‌ ఏర్పాటు చేశారు. ఈ పోలింగ్‌ బూత్‌ చెప్పు కొనేందుకు రెండు కిలో మీటర్ల దూరమే అయినా రోడ్డు వసతి లేదు. ధీరావత్‌తండా నుంచి లావూడితండాకు వెళ్లాలంటే పొలం గట్ల మీదుగా కాలి నడకన వెళ్లాలి. అలా వెళదామన్న రెండు వాగులు(బంధాలు) దాటాలి. ఈ వాగుల నిండా నీరు ఎల్లప్పుడూ ఉం టుంది. దీంతో వాగులను దాటే పరిస్థితి ఉండదు. కనీసం సైకిల్, బైక్‌గానీ వెళ్లే అవకాశం లేదు.  
ఓటు వేయాలంటే బంధమైనా దాటాలి..18కి.మీటర్లైనా ప్రయాణించాలి: 
ధీనావత్‌తండా వాసులు ఓటు వేయాలంటే పొలం గట్టున రెండు కిలో మీటర్లు కాలినగక వెళ్లి రెండు బంధాలు దాటితే కానీ వారు ఓటు వేయడానికి ఏర్పాటు చేసిన లావూడితండాలోని పోలింగ్‌ బూత్‌కు చేరుకోలేరు. ఈ మార్గం వెళ్లడానికి కనీసం కాలిబాట సౌకర్యం లేదు. కాగా వాహనాలపై వెళ్లాలి. వెళ్లాలంటే శ్రీనివాస నగర్, తుంగపహాడ్‌లో పోలింగ్‌ బూత్‌లను దాటి 9 కిలోమీటర్లు రోడ్డు మార్గాన వెళ్లాలి. ఓటు వేసి తిరిగి వారు తండాకు రావాలంటే 18కిలో మీటర్లు ప్రయాణం చేయాల్సిందే. దీనితో వీరు ఓటు వినియోగించుకోవాలంటేనే ఎంతో ఇబ్బందిగా భావిస్తున్నారు. ఈ విషయం అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదు. ఇప్పటికైనా ధీరావత్‌తండా ఓటర్లకు పక్కనే ఉన్న శ్రీనివాసనగర్‌ పోలింగ్‌ బూత్‌కు మార్చడమన్న, లేదా తండాలో ప్రత్యేక బూత్‌ ఏర్పాటైనా చేయాలని తండా ఓటర్లు కోరుతున్నారు.

తండాలోనే పోలింగ్‌ బూత్‌ ఏర్పాటు చేయాలి :
ధీరావత్‌తండాలోనే పోలింగ్‌ బూత్‌ ఏర్పాటు చేయాలి. తండాలో 315మంది ఓటర్లు ఉన్నారు. అందరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలంటే వాగులు దాటి వెళ్లే పరిస్థితి లేదు. ఈ విషయం ఇప్పటికే పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. స్పందన లేదు. ఎన్నిక సమీక్షనైనా, ఎన్నికల అధికారులైనా స్పందిచాలి. తండాలోనే పోలింగ్‌ బూత్‌లు ఏర్పాటు చేయాలి.

– ధీరావత్‌ రమేశ్, ధీరావత్‌ తండా   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement