
సాక్షి, సూర్యాపేట : రాజకీయ పార్టీలు ఎన్నికల వేళ ప్రలోభాలకు గురిపెడుతూ ఉంటాయి. అయితే పోలింగ్ బూత్ వద్దే తమ పార్టీకి ఓటు వేయమంటూ ఓటర్లను ప్రలోభపెట్టిన ఘటన సూర్యాపేటలోని హుజుర్‌నగర్‌లో జరిగింది. హుజుర్ నగర్ పోలింగ్ బూత్ 187లో కొందరు టీఆర్ఎస్ ఏజెంట్లు ప్రలోభాలకు గురిచేయడంతో ఓటర్లు ఫిర్యాదు చేశారు. కారు గుర్తుకు ఓటెయ్యమంటున్నారంటూ.. వెంటనే వారిపై చర్యలు తీసుకోవల్సిందిగా అధికారులతో వాగ్వాదానికి దిగారు.