మొన్నటిదాకా ప్రచారపర్వంతో తెలంగాణలో ఎన్నికల రణరంగం వేడెక్కగా.. నేడు తెలంగాణ వ్యాప్తంగా పోలింగ్ జరగనుంది. కొద్దిసేపటి క్రితమే.. పోలింగ్ ప్రారంభమైంది. అన్ని చోట్లా వేడి ప్రశాంతంగా పోలింగ్ జరుగుతోంది. ఈ ఎన్నికల్లో అందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పలువురు సినీ ప్రముఖులు విజ్ఞప్తి చేశారు. అయితే ఎంతో బిజీగా ఉండే సెలబ్రెటీస్.. బాధ్యతగా వారి ఓటు హక్కును వినియోగించుకోకున్నారు.
అన్ని చోట్లా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలవద్ద బారులు తీరారు. ఉదయం 7గంటలకు ప్రారంభమైన పోలింగ్ కేంద్రాల వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల్లోకి సెల్‌ఫోన్లు తీసుకెళ్లడం, సెల్ఫీలు తీసుకోవడాన్ని నిషేదించారు. అయితే ఈ పోలింగ్ సాయంత్రం 5వరకు జరగనుండగా..మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్రం 4గంటల వరకు జరగనుంది.
మెగాస్టార్ చిరంజీవి, ఆయన కుటుంబ సభ్యులు జూబ్లిహిల్స్ క్లబ్‌లో ఓటు వేయనుండగా.. జూబ్లీహిల్స్ ఉమెన్ కోఆపరేటివ్ సొసైటీలో నాగార్జున, జూబ్లీహిల్స్ బీఎస్‌ఎన్‌ఎల్ ఆఫీస్‌లో అల్లు అర్జున్, బంజారా హిల్స్ యూరోకిడ్స్ స్కూల్లో విజయశాంతి, జూబ్లీహిల్స్ ఓబుల్‌రెడ్డి పబ్లిక్ స్కూల్లో జూ. ఎన్టీఆర్ తమ ఓటు హక్కును వినియోగించుకోకున్నారు.
చింతమడక గ్రామంలోని బూత్ నెంబర్13లో కేసీఆర్, బంజారాహిల్స్ రోడ్‌నెంబర్ 2 సెయింట్ నిజామ్స్ హైస్కూల్‌లో కేటీఆర్, బోధన్ నవీపేట్ హైస్కూల్‌లో బూత్‌నంబర్ 177లో కవిత, సోమాజిగూడ రాజ్‌నగర్ అంగన్‌వాడి కేంద్రంలో గవర్నర్ నరసింహన్, అచ్చంపేట కొండారెడ్డి బూత్‌నెంబర్82లో రేవంత్ రెడ్డి, తార్నాకలో కోదండరామ్, జూబ్లీహిల్స్ క్లబ్‌లో జైపాల్ రెడ్డి, పరిపూర్ణానంద, బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10లో సీఈఓ రజత్‌కుమార్, బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 5లో జాయింట్ సీఈఓ ఆమ్రపాలి తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment