
సాక్షి, ఖమ్మంసహకారనగర్: పోలింగ్ సమయంలో ఓటు వేయటానికి వచ్చిన ఓటర్లు తన ఓటును వేస్తూ సెల్‌ఫోన్‌లో సెల్ఫీలు దిగటం, ఇతరులకు చూపించటం చట్ట విరుద్ధం. ఒక వేళ చూపిస్తే రూల్ 49ఎం(ఓటు రహస్యం) చట్టం మేరకు ఎన్నికల అధికారులు గుర్తించి ఓటరును బయటకు పంపిస్తారు. ఆ ఓటును 17–ఏలో నమోదు చేస్తారు. లెక్కింపు సమయంలో ఆ ఓటును పరిగణనలోకి తీసుకోరు. రూల్ నంబర్ 49ఎన్ ప్రకారం అంధులైన ఓటర్లు తాము ఓటు వేయటానికి 18 సంవత్సరాలు దాటిన సహాయకుడిని వెంట తీసుకొని వెళ్ళవచ్చు. సహాయకుడు అతని ఓటును బహిర్గతం చేయనని నిబంధన 10లో ధ్రువీకరించాల్సి ఉంటుంది.