![Pole Slips Are Attested With Voter Photo In Telangana - Sakshi](/styles/webp/s3/article_images/2018/11/30/ss.jpg.webp?itok=_KZpToGR)
ఫోటోలతో పోల్ స్లిప్పులు పంపిణీ చేస్తున్న బీఎల్‌ఓ
సాక్షి, నేలకొండపల్లి/వైరా: జిల్లా యంత్రాంగం ఎన్నికల నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు చేస్తోంది. ఎన్నికల విధుల్లో భాగంగానే ప్రతీ ఓటరుకు పోల్ స్లిప్పులను పంపిణీ చేసేందుకు ఆయా రిటర్నింగ్ అధికారుల కార్యాలయాలకు చేరుకున్నాయి. జిల్లాలోని 5 అసెంబ్లీ స్థానాల్లో 10,83,175 మంది ఓటర్లు ఉన్నారు. 1,306 పోలింగ్ కేంద్రాలు ఉన్నా యి. 100శాతం ఓటు హక్కును సద్వినియోగం చేసుకునేందుకు స్లిప్పులు ప్రతీ ఓటరుకు చేరేలా చర్యలు తీసుకుంటున్నారు. వీటిని ఆర్‌వో కార్యాలయాల్లో బూత్‌ల వారీగా సిద్ధం చేస్తున్నారు. పోల్ స్లిప్పులపై ఫొటోలు ముద్రించడంతో బోగస్ ఓట్లను అరికట్టే అవకాశం ఉంది.
బహుముఖ ప్రయోజనాలు:
ఓటర్లకు ఫొటోలో కూడా పోల్ స్లిప్పులు ఇవ్వటం వల్ల బహుముఖ ప్రయోజనాలు ఉన్నాయి. స్లిప్పు పై ఫొటో, ఓటరు సంఖ్య ఉంటుంది. దీంతో ఓటర్లకు ఎలాంటి గందరగోళం ఉండదు. ఫొటో ఉంటుంది కాబట్టి ఎన్నికల సిబ్బంది సులభంగా గుర్తు పడతారు. ఓటింగ్ శాతం పెరిగేందుకు ఈ స్లిప్పులు దోహదపడతాయి.
–దశరథ్, పాలేరు రిటర్నింగ్ అధికారి
పోల్ స్లిప్పు తీసుకోవాలి:
రాష్ట్ర ఎన్నికల సంఘం ముద్రించిన ఓటరు చిట్టీల ను ప్రతీ ఓటరు తీసుకోవాలి. బూత్ లెవల్ అధికారుల ద్వారా పంపిణీ చేస్తున్నాం. కొత్తగా నమోదైన ఓటర్లను స్మార్ట్ ఓటరు కార్డులు కూడా అం దించనున్నాం. బూత్ లెవల్ అధికారులతో పాటు నోడల్ అధికారులు కూడా ఓటరు చిట్టీల పంపిణీలో పాల్గొననున్నారు.
–రవీందర్, ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్, వైరా
ప్రతీ ఓటరుకు..
పోలింగ్ చిట్టీలు ప్రతి ఒక్కరికీ అందేలా ప్రత్యేక చర్యలతో గతంలో ప్రజా ప్రతినిధులకు అందించే పద్ధతిని తొలగించారు. వారికి సైతం ఫొటోలతో ఉన్న పోలింగ్ చిట్టీలకు సంబంధించిన వివరాలు ఇవ్వడం లేదు. నేరుగా ఆయా పోలింగ్ బూత్‌లకు కేటాయించిన బూత్ లెవల్ అధికారులతో పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. డిసెంబర్ 1వ తేదీ నాటికి ప్రతీ ఓటరుకు తమ ఓటరు చిట్టీలు అందించడంతో పాటు, అందని వారికి ఎన్నికల సమయంలో పోలింగ్ కేంద్రాల వద్ద పంపిణీ చేయనున్నారు.
గతం కన్నా భిన్నంగా...
గత ఎన్నికల సమయంలో పోల్ చిట్టీల కన్నా ప్రస్తుత పోలింగ్ చిట్టీలు భిన్నంగా ఉన్నాయి. ప్రతీ ఓటరు చిట్టీపై వారి ఫొటో ఉంటుంది. దీంతో పాటు పోలింగ్ ఏజెంట్ గుర్తుంచుకునేందుకు ఇబ్బందులు తీరాయి. గతంలో పంపిణీ చేసిన చిట్టీలపై ఫొటో ఉండేది కాదు. దీంతో ఓటింగ్ సమయంలో ఏజెం ట్లు గుర్తుపట్టేవారు. ఇక నుంచి ఓటర్లకు ఇబ్బంది ఉండదు. వీటితో పాటు పోలింగ్ కేంద్రం ఎక్కడ ఉంది, తదితర వివరాలు కూడా పొందుపరిచారు. ఓటరు నేరుగా తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రానికి చేరుకునేలా చిరునామా పొందుపరిచారు.
![1](/gallery_images/2018/11/30/blo.jpg)
వైరాలో పోల్ స్లిప్పులు పంపిణీ చేస్తున్న బీఎల్‌ఓ
Comments
Please login to add a commentAdd a comment