బ్యాలెట్ పత్రాలకు చెదలు | Termites eat ballot papers in a ballot box in Nellore distirct | Sakshi
Sakshi News home page

బ్యాలెట్ పత్రాలకు చెదలు

Published Tue, May 13 2014 12:10 PM | Last Updated on Sat, Oct 20 2018 6:04 PM

బ్యాలెట్ పత్రాలకు చెదలు - Sakshi

బ్యాలెట్ పత్రాలకు చెదలు

నెల్లూరు జిల్లా కావలిలో ఓ కళాశాలలో ఉంచిన కొండాపురం మండలం బ్యాలెట్ బాక్స్లకు చెదలు పట్టాయి. మంగళవారం ఓట్లు లెక్కింపు సందర్బంగా బ్యాలెట్ బాక్స్లను ఏజెంట్లు బయటకు తీశారు. అందులోని బ్యాలెట్ పత్రాలకు చెదలు పట్టి చిరిగిపోయి ఉన్నాయి. బ్యాలెట్ పత్రాలు చిరిగిపోయిఉండటంపై ఏజెంట్లు అభ్యంతరం వ్యక్తం చేశారు.

 

ఆ విషయాన్ని ఏజెంట్లు ఆర్డీవో దృష్టికి తీసుకువెళ్లారు. ఆర్డీవో బ్యాలెట్ బాక్స్లు, పత్రాలను పరిశీలించి జిల్లా కలెక్టర్ పరిస్థితి వివరించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు దీనిపై రిటర్నింగ్ అధికారి తుది నిర్ణయం తీసుకోనున్నారు. అయితే బ్యాలెట్ పత్రాలకు చెదలు పట్టడంతో అభ్యర్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement