Holland
-
KISAN Agri Show: న్యూ హాలండ్ రెండు కొత్త ట్రాక్టర్లు
హైదరాబాద్: న్యూ హాలండ్ అగ్రికల్చర్ (సీఎన్‌హెచ్ ఇండస్ట్రియల్) రెండు నూతన ట్రాక్టర్లను విడుదల చేసింది. హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో 3 నుంచి 5వ తేదీ వరకు జరిగిన కిసాన్ అగ్రి షోలో భాగంగా ‘బ్లూ సిరీస్ సింబా 30’, ‘5620 పవర్ కింగ్’ పేరుతో వీటిని ఆవిష్కరించింది. ఈ వ్యవసాయ సదస్సులో ఆరు ట్రాక్టర్లు, మూడు సాగు ఎకిŠవ్ప్మెంట్లను ప్రదర్శించింది. ఇందులో సింబా 30 అనేది స్ప్రేయింగ్, రోటావేషన్, కల్టివేషన్, అంతర్గత కల్టివేషన్ పనులకు అనుకూలంగా ఉంటుందని సంస్థ తెలిపింది. అధిక పవర్‌తో, ఇంధనం ఆధా సామర్థ్యాలు ఇందులోని ప్రత్యేకతలు. ఇక 5620 పవర్ కింగ్ అనేది రవాణాకు, సాగుకు సంబంధించి పనులకు అనుకూలంగా ఉంటుందని తెలిపింది. -
చిక్కుల్లో ప్రపంచ కుబేరుడు.. కుళ్లిన కోడిగుడ్లతో కొడతామంటూ ప్రజల హెచ్చరిక!
అమెజాన్ వ్యవస్థాపకుడు, ప్రపంచ కుబేరుడు జెఫ్ బేజోస్ ఊహించని చిక్కుల్లో పడ్డారు. ఎంతో ముచ్చపడి తయారు చేయించుకున్న పడవ ఆయన్ని కలవరపాటుకి గురి చేస్తోంది. అలలపై ప్రయాణం మొదలుకాకముందే ఆయన్ని వివాదాల్లోకి ముంచింది. మెగాయాచ్ ఎలన్‌మస్క్ కంటే ముందు ప్రపంచంలో నంబర్ ధనవంతుడిగా రికార్డులెక్కారు జెఫ్ బేజోస్. దాదాపు 200 బిలియన్ డాలర్లకు సంపద ఆయన సొంతం. ఈ క్రమంలో తను సేద తీరేందుకు.. విహార యాత్రలు చేపట్టేందుకు సర్వాంగ సుందరంగా.. సకల సౌకర్యాలతో ఓ పడవ (మెగాయాచ్) తయారు చేయించుకోవాలని నిర్ణయించారు. కస్టమైజ్డ్ యాచ్‌లు తయారు చేసే ఓ డచ్ కంపెనీతో ఈ మేరకు ఒప్పందం చేసుకున్నారు. హలాండ్లో నిర్మాణం హలాండ్లోని ప్రముఖ పోర్టు సిటీల్లో రోటెర్డామ్ దగ్గరున్న ఆల్బ్లెస్సర్డామ్లో Y721 పేరుతో మెగాయాచ్ నిర్మాణ పనులు చేపట్టారు. ఈ పడవ ఖరీదు రమారమీ 485 మిలియన్ డాలర్లు. ఎట్టకేలకు ఫుట్‌బాల్ స్టేడియం కంటే పెద్దదిగా ఈ యాచ్ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ యాచ్‌ని సముద్రంలో ప్రవేశపెట్టే సమయంలో పెద్ద చిక్కు వచ్చి పడింది. రోటెర్డామ్లో చారిత్రక సంపదగా భావించే ఓ వంతెన యాచ్ ప్రయాణానికి అడ్డుగా నిలిచింది. చారిత్రక వంతెన యాచ్‌ని తయారు చేసిన చోటు నుంచి సముద్రంలోకి తీసుకెళ్లే నీటి ప్రవాహంపై పురాతన కాలం నాటి కోనింగ్షావెన్ అనే వంతెన ఉంది. దీనిని మొదటిసారి 1878లో నిర్మించారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జర్మన్ నాజీలతో జరిగిన యుద్దంలో బాంబింగ్ కారణంగా ఈ వంతెన పాడవగా.. తిరిగి పునర్మించారు. అప్పటి నుంచి ఈ వంతెన ఓ చారిత్రాత్మక కట్టడంగా స్థానికులు భావిస్తున్నారు. చివరిసారి 2017లో వంతెనకు మరమ్మత్తులు చేశారు. వంతెన కూల్చేద్దాం జెఫ్‌బేజోస్ కోసం తయారు చేసిన మెగా యాచ్‌ను సముద్రంలోకి పంపే క్రమంలో పురాతన వంతెన అడ్డుగా ఉన్నందున... పాక్షికంగా వంతెనను కూల్యేయాలంటూ పడవ తయారీ సంస్థ రోటెర్డామ్ పాలకమండలకి విజ్ఞప్తి చేసింది. యాచ్‌ను సముద్రంలో పంపిన తర్వాత వంతెన పునర్ నిర్మాణానికి నిధులు అందిస్తామని పేర్కొంది. మేం ఒప్పుకోం జెఫ్ బేజోస్ పడవ వెళ్లేందుకు తమ చారిత్రక కట్టడానికి కూల్చాలనే ప్రతిపాదనలను రోటెర్డామ్ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వంతెన కూల్చివేతకు వ్యతిరేకంగా ఉద్యమం ప్రారంభించారు. తమ సెంటిమెంట్స్ పట్టించుకోకుండా వంతెన కూల్చి ఈ మార్గంలో జోఫ్ బేజోస్ పడవని తీసుకెళ్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరిస్తున్నారు. కుళ్లిన కోడిగుడ్లతో యాచ్‌పై దాడి చేస్తామంటూ తమ కార్యాచరణ ప్రకటించారు. సోషల్ మీడియాలో ఈ కోడిగుడ్ల దాడికి మద్దతు రోజురోజుకి పెరుగుతోంది. బాయ్‌కాట్ అమెజాన్ ప్రజల నుంచి ఆగ్రహావేశాలు వ్యక్తం కావడంతో ఏం చేయాలో పాలుపోక ఇటు రోటెడ్డ్యామ్ పాలకమండలి, అటు పడవ తయారీ కంపెనీలు బిక్కచచ్చిపోయాయి. మరోవైపు జెఫ్‌బేజోస్‌కి వ్యతిరేకంగా బాయ్‌కాట్ అమెజాన్ అంటూ గళం విప్పుతున్నారు. మొత్తంగా ఈ కొత్త పడవ వ్యహారం జెఫ్‌బేజోస్‌కి టైటానిక్‌లా మారింది. చదవండి: అమెజాన్ బాస్ పంటపండింది.. ఏకంగా లక్షా నలభై వేల కోట్లకు పైనే పెరిగిన సంపద -
'కౌ'గిలింత
ఆవు మనకు గోమాత.కాని ఆవు యాంగ్జయిటీని తగ్గించే డాక్టర్ కూడా అని హాలెండ్వాసులే ముందు కనిపెట్టి దశాబ్దం నుంచి‘కౌ హగింగ్’ను సాధన చేస్తున్నారు. ఆవును కావలించుకుని కొంతసేపు గడిపితే యాంగ్జయిటీ పోతుందనివారు చెబుతున్న అనుభవం ఇప్పుడు మన దేశానికి కూడా వ్యాపించింది. కోవిడ్ సమయంలో ఆందోళనలు పోగొట్టుకోవడానికికౌ హగింగ్ను ప్రయత్నిస్తున్నారు. ‘కో నఫ్లెన్’ అంటారట డచ్‌లో ‘ఆవు కావలింత’ని. మన దేశంలో ఆవును గోమాతగా తలిచే వారుంటే ఆ దేశంలో ఆవును ఒక డాక్టర్‌గా చూసే వారున్నారు. ఆవును కావలించుకుని కాసేపు గడిపితే, ఆవును నిమిరితే, ఆవుతో బాధలు చెప్పుకుంటే, ఆవు నిర్మలమైన కళ్లల్లో కళ్లు పెట్టి చూస్తే, ఆవుకు ప్రేమ ఇస్తే, ఆవు నుంచి ప్రేమ పొందితే మనసు, శరీరం స్వస్థత పొందుతాయని కౌ హగింగ్ని ఒక థెరపీగా వారు భావిస్తారు. పదేళ్ల నుంచి ఉన్న సాంత్వన వైద్య భావన ఇప్పుడు అమెరికాకు మిగిలిన దేశాలకు కూడా ఒక నమ్మకంలా విస్తరిస్తోంది. అమెరికాలో అయితే కౌ హగింగ్ కోసం గోశాలలు నిర్వహిస్తున్నారు. కొన్ని గోశాలల్లో ఒక గోవును పట్టుకుని కూచోవడానికి దాదాపు 75 డాలర్లు (5 వేల రూపాయలు) వసూలు చేస్తున్నారు. అయితే అక్కడి గోశాలలు చాలా శుభ్రంగా, వాసన లేకుండా మెయింటెయిన్ చేస్తున్నారు. గరిక మీద తిరిగే ఆవులను అక్కడ చూడవచ్చు. ఇప్పుడు భారతదేశంలో ముఖ్యంగా ఈ కోవిడ్ సమయంలో మానసిక ఆందోళనలు పెరుగుతున్నాయి కనుక కౌగిలింత మంచి ఫలితాలిస్తుందని సైకియాట్రిస్ట్‌లు కూడా చెబుతున్నారు. బెంగళూరుకు చెందిన సైకియాట్రిస్ట్ ‘పసిపిల్లలనో, గోవు, శునకం వంటి పెంపుడు జంతువులనో కావలించుకుంటే ఆక్సీటోసిన్, సెరోటోనిన్ వంటి హార్మోన్లు విడుదలయ్యి వత్తిడి కలిగించే కార్టిసోల్ హార్మోన్‌ను అదుపు చేస్తాయి’ అంటున్నారు. భారతదేశంలో విశ్వాసాల వల్ల కాని విధానాల వల్లగాని ప్రతి జీవి నుంచి, జీవజాలం నుంచి స్వస్థత పొందడానికే చూస్తారు. పశువులున్న వారి ఇళ్లల్లో పశువులతో అనుబంధం వల్ల పొందే ఆనందం తెలుసు.. -
వైరస్‌కు హాట్‌బెడ్‌గా హాలండ్
చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం అంటే ఇదేనేమో! ప్రాణాంతక కరోనా వైరస్ బారిన పడకుండా రక్షించుకోవడానికి ప్రపంచ ప్రజలంతా ముఖాన మాస్కులు ధరించి తిరుగుతుంటే నెదర్లాండ్స్ ప్రజల్లో ఎక్కువ మంది ఎలాంటి మాస్కులు ధరించకుండానే సాధారణ రోజుల్లాగే తిరిగారు. ఫలితంగా అతి తక్కువగా ఉన్న కరోనా కేసులు అతి ఎక్కువగా పెరిగిపోయాయి. వైరస్‌కు హాట్‌బెడ్‌గా మారిపోవడంతో హాలండ్ (నెదర్లాండ్స్) కరోనా బారిన పడి కొట్టుమిట్టాడుతున్న టాప్ దేశాల్లో ఒకటిగా చేరింది. దీంతో ప్రజలు తప్పనిసరిగా మాస్కులు ధరించాలంటూ అత్యవసర చట్టం తీసుకరావడం కోసం అక్కడి ప్రభుత్వం డచ్ పార్లమెంట్లో బుధవారం ఓ బిల్లును ప్రవేశపెట్టి చర్చ చేపట్టింది. ప్రతి లక్ష మందిలో 160 మందికి వైరస్ సోకుతోందని, ప్రతి రోజుకు ఐదువేల మంది వైరస్ బారిన పడుతున్నారని అక్కడి వైద్యులు తెలిపారు. మాస్కులు ధరించి, సామాజిక దూరం పాటించడం ద్వారా కరోనాను నియంత్రించవచ్చని ప్రపంచ బ్యాంకు చేసిన సూచనలను పెడ చెవిన పెట్టిన హాలండ్ ప్రధాన మంత్రి మార్క్ రుట్టే మాత్రం మొదటి నుంచి ఒకటే మాట చెబుతూ వస్తున్నారు. ప్రజలు బలవంతంగా మాస్కులు ధరించేలా చేయలేనంటూ వచ్చారు. ఇప్పుడేమో బిల్లు పాస్ కాగానే మాస్క్‌లను తప్పనసరి చేస్తూ చట్టం తీసుకొద్దామని చెబుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన మార్గదర్శకాల ప్రకారం కూడా కరోనా నిర్ధారణ పరీక్షలు ప్రభుత్వం నిర్వహించడం లేదని, దేశంలో కరోనా ప్రభావం ఇంకా ఎక్కువే ఉందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. -
ట్రక్ పట్టాలు దాటుతుండగా ఢీకొట్టిన ట్రైన్
-
ఓ మంచి దేవుడా.. తినడానికి నాకో చేపనివ్వు!
దేవుడా.. ఓ మంచి దేవుడా.. నువ్వు మాకు తినడానికి తోటకూర పప్పు ఇచ్చావు. బంగాళాదుంప ఫ్రై ఇచ్చావు. చారు కూడా ఇచ్చావు... ఇలాగే ప్రపంచంలోని వారందరికీ ఇవ్వాలంటూ ఓ సినిమాలో హీరో వేడుకుంటాడు. ఆ హీరోకి ఏం తీసిపోను అంటోంది ఈ నీరుపిల్లి (ఆట్టర్). హాలెండ్ ఎమ్మెన్లోని వైల్డ్ ల్యాండ్ అడ్వెంచర్ పార్కులో ఇది నివసిస్తుంది. దీనికి రోజుకు ఐదు చేపలు కావాల్సిందే. కేవలం చేపలు తిని బతికే ఈ నీరుపిల్లి.. కడుపులో ఎలుకలు పరిగెత్తినట్టు కాగానే.. ఇదిగో ఇలా అచ్చం మనిషిలాగే రెండు చేతులు జోడించి.. అర్థిస్తుంది. దాని ఆకలి గుర్తించిన పార్కు సిబ్బంది వెంటనే దానికి చేపల్ని ఆహారంగా అందిస్తారు. ఆ చేపల్ని కడుపు రాసుకుంటూ బుద్ధిగా ఆరగించిన తర్వాత.. ఇదిగో ఇలా చెయ్యి ఊపి థాంక్స్ కూడా చెప్తుంది. ఆహారం కోసం ఈ నీరుపిల్లి చేసే చేష్టలు.. అచ్చం మనిషి ప్రార్థనలాగే ఉండటంతో ఓ ఫొటోగ్రాఫర్ తన కెమెరాలో బంధించారు. ఆ ఫొటోలు ఇప్పుడు ఆన్లైన్లో హల్చల్ చేస్తున్నాయి. -
గ్రూప్ ‘బి’లో భారత్
- రియో ఒలింపిక్స్ హాకీ లాసానే: వచ్చే ఏడాది జరిగే రియో ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్టుకు కఠిన పరీక్ష ఎదురుకాబోతుంది. ఎనిమిది సార్లు స్వర్ణ పతకం సాధించిన రికార్డు ఉన్న భారత జట్టు పూల్ ‘బిలో ఉండగా దీంట్లోనే డిఫెండింగ్ చాంపియన్ జర్మనీ, ప్రపంచ నంబర్ టూ జట్టు నెదర్లాండ్స్ కూడా ఉన్నాయి. అర్జెంటీనా (6), ఐర్లాండ్ (12), కెనడా (14) మిగతా జట్లు. భారత జట్టు ప్రస్తుతం ఏడో ర్యాంకులో ఉంది. ఇటీవలి హాకీ వరల్డ్ లీగ్ ఫైనల్లో కాంస్యం కోసం జరిగిన పోరులో భారత్ షూటవుట్‌లో నెదర్లాండ్స్‌పై నెగ్గగా అంతకుముందు జర్మనీని 1-1తో నిలువరించింది. కొత్త నిబంధనల ప్రకారం భారత జట్టు ఐర్లాండ్, కెనడాలపై నెగ్గినా క్వార్టర్స్ చేరుకుంటుంది. ఇక పూల్ ‘ఎ’లో ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియా (1), గ్రేట్ బ్రిటన్ (4), బెల్జియం (5), కివీస్ (8), స్పెయిన్ (11), ఆతిథ్య బ్రెజిల్ (32) ఉన్నాయి. మహిళల హాకీ జట్టు కూడా పూల్ ‘బి’లోనే ఉండగా అర్జెంటీనా, ఆసీస్, గ్రేట్ బ్రిటన్, అమెరికా, జపాన్‌లతో పోటీపడుతుంది. -
యూఎఫ్‌వోనా? సూర్యుడి ఎఫెక్టా!?
గ్రహాంతరవాసుల వ్యోమనౌక నేలకు దిగుతున్నట్లున్న ఈ దృశ్యం హాలెండ్లోని గ్రోనింజెన్‌లో కనిపించింది. హ్యారీ పెర్టన్ అనే బ్లాగర్ తన ఇంటి నుంచి ఇటీవల తుపాను వాతావరణాన్ని ఫొటోలు తీస్తుండగా ఆకాశంలో మెరుపు మెరిసింది. ఫొటోలు వచ్చాక చూస్తే ఇలా.. ఓ యూఎఫ్‌వో(గుర్తు తెలియని ఎగిరే పళ్లెం) నేలకు దిగుతున్నట్లుగా కనిపించింది. ఇది యూఎఫ్వోనే కావొచ్చని కొందరు.. వాతావరణం మారిపోవడంతో ఇలా కనిపించి ఉంటుందని మరికొందరు అంటున్నారు. తుపాను మేఘాల్లోకి సూర్యకిరణాలు చొచ్చుకొచ్చి ఇలా రంగుల కాంతి విరజిమ్మి ఉంటుందని శాస్త్రవ్తేలు చెబుతున్నారు. -
హోలండ్‌తో నావపై చర్చ!
పారిస్: నరేంద్ర మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు హోలండ్ శుక్రవారం నౌకా విహారం చేశారు. ఇద్దరి ద్వైపాక్షిక చర్చల తర్వాత ‘నావపై చర్చ’గా పేర్కొన్న ఈ విహార కార్యక్రమం లా సీన్ నదిపై జరిగింది. నౌక సాగుతుండగా ఆయా ప్రదేశాల గురించి మోదీకి హోలండ్ వివరించారు. ద్వైపాక్షిక చర్చల సందర్భంగా పౌర అణు విద్యుత్, రక్షణ, అంతరిక్షం, వాణిజ్యం తదితర రంగాల్లో సహకారంపై ఇరువురు లోతుగా చర్చించారు. ప్రపంచ స్థాయి నేతతో మోదీ నావపై చర్చ జరపడం ఇదే ప్రథమం. గతంలో అమెరికా అధ్యక్షుడు ఒబామా, జపాన్ ప్రధాని షింజో అబెతో మోదీ చాయ్ పె చర్చ సాగించారు. -
హర్యానా యువతిపై అత్యాచారం
హాలెండ్ వ్యక్తి అరెస్ట్ కెంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు పీఎస్‌లో కేసు నమోదు నెట్ చాటింగ్‌లో పరిచయం 8 నెలలుగా అత్యాచారం చేశాడని ఫిర్యాదు దొడ్డబళ్లాపురం : హర్యానా చెందిన యువతిపై అత్యాచారం ఆపై మోసం చేసాడన్న ఆరోపణపై హాలెండ్‌కు చెందిన వ్యక్తిని ఇక్కడి కెంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు పోలీసులు అరెస్టు చేశారు. బెంగళూరులోని డచ్ ఎడ్యుకేషన్ ఆర్గనైజేషన్ సంస్థలో డెరైక్టర్‌గా పని చేస్తున్న హాలెండ్‌కు చెందిన పీటర్(45)ను పోలీసులు అరెస్ట్ చేశారు. హర్యానాకు చెందిన యువతి (25) ఇతనిపై మంగళవారం రాత్రి ఎయిర్‌పోర్టు పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పీటర్‌ను బుధవారం సాయంత్రం అరెస్టు చేశారు. ఘటనకు సంబంధించి డీసీపీ వికాస్ కుమార్ మాట్లాడుతూ... హర్యానాకు చెందిన యువతికి జనవరిలో నెట్ చాటింగ్ ద్వారా పీటర్ పరిచయం అయ్యాడు. ఈ క్రమంలో పీటర్ ఆమెను వివాహం చేసుకుంటానని బెంగళూరుకు రప్పించి, ఎయిర్ పోర్టు రోడ్డులో ఉన్న స్విస్టౌన్ రిసార్ట్‌లో కొన్నాళ్లు సహజీవనం చేశాడు. బాధితురాలు గర్భవతి కాగా, ఆమెను అబార్షన్ చేసుకోమని బెదిరించాడని, తన ను వివాహం చేసుకుంటానని మాయమాటలు చెప్పి 8 నెలలుగా అత్యాచారం చేశాడని మహిళ ఫిర్యాదులో పేర్కొందని చెప్పారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని పీటర్‌ను అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు వివరించారు. -
సౌరబ్ గంగూలీ జోస్యం ఫలిస్తుందా?
ప్రపంచ క్రీడాభిమానులందరికి ఫుట్ బాల్ ఫీవర్ పట్టుకుంది. ప్రపంచ పుట్ బాల్ కప్ టోర్నిలో నాకౌట్ దశ ముగిసి సెమీఫైనల్ పోటీలకు జట్లు సిద్దమవుతున్నాయి. ఇక ఫైనల్ కు ఏ జట్లు చేరుతాయా అని అంచనాలు వేసుకోవడం, జోస్యం చెప్పడం పనిలో పడ్డారు. పుట్ బాల్ అభిమానైన భారత క్రికెట్ మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ప్రపంచ కప్ పోటీలను ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఇంగ్లాండ్ తో జరిగే భారత సిరీస్ కోసం కామెంటేటర్ గా మారిన గంగూలీ ప్రపంచ కప్ ఫుట్ బాల్ ఫైనల్ పోటీల్లో ఏ జట్లు ఆడబోతున్నాయో.. ముందే ఓ అంచనాకు వచ్చాడు. జూలై 13న జరిగే ఫైనల్ మ్యాచ్ లో జర్మనీ, నెదర్లాండ్ జట్టు పోటీ పడుతాయని జోస్యం చెప్పాడు. ఓ ఫుట్ బాల్ అభిమానిగా బ్రెజిల్, అర్జెంటీనా జట్లు ఫైనల్ మ్యాచ్ ఆడాలని కోరుకుంటాను. కాని పుట్ బాల్ జట్ల ఫామ్ ను పరిగణనలోకి తీసుకుంటే జర్మనీ, నెదర్లాండ్ జట్లు ఫైనల్ పోటీకి అర్హత సాధిస్తాయనిపిస్తోంది అని గంగూలీ అన్నారు. ఇక ఇంగ్లాండ్ లో పర్యటిస్తున్న భారత జట్టు ఐదు టెస్టుల సిరీస్ ను జూలై 9 తేదిన ఆరంభం కానుంది. Follow @sakshinews -
ప్రపంచ కప్... వింతలు - విశేషాలు
-
ఒక్క రివెంజ్‌తో ఇతడి రేంజ్ ఎక్కడికో పాకింది!
-
స్పెయిన్‌కు ఘెర పరాభవం