పారిస్: నరేంద్ర మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు హోలండ్ శుక్రవారం నౌకా విహారం చేశారు. ఇద్దరి ద్వైపాక్షిక చర్చల తర్వాత ‘నావపై చర్చ’గా పేర్కొన్న ఈ విహార కార్యక్రమం లా సీన్ నదిపై జరిగింది. నౌక సాగుతుండగా ఆయా ప్రదేశాల గురించి మోదీకి హోలండ్ వివరించారు. ద్వైపాక్షిక చర్చల సందర్భంగా పౌర అణు విద్యుత్, రక్షణ, అంతరిక్షం, వాణిజ్యం తదితర రంగాల్లో సహకారంపై ఇరువురు లోతుగా చర్చించారు. ప్రపంచ స్థాయి నేతతో మోదీ నావపై చర్చ జరపడం ఇదే ప్రథమం. గతంలో అమెరికా అధ్యక్షుడు ఒబామా, జపాన్ ప్రధాని షింజో అబెతో మోదీ చాయ్ పె చర్చ సాగించారు.