ఓ మంచి దేవుడా.. తినడానికి నాకో చేపనివ్వు! | otter prayers for food at park | Sakshi
Sakshi News home page

ఓ మంచి దేవుడా.. తినడానికి నాకో చేపనివ్వు!

Published Sun, Oct 9 2016 6:37 PM | Last Updated on Mon, Sep 4 2017 4:48 PM

otter prayers for food at park

దేవుడా.. ఓ మంచి దేవుడా.. నువ్వు మాకు తినడానికి తోటకూర పప్పు ఇచ్చావు. బంగాళాదుంప ఫ్రై ఇచ్చావు. చారు కూడా ఇచ్చావు... ఇలాగే ప్రపంచంలోని వారందరికీ ఇవ్వాలంటూ ఓ సినిమాలో హీరో వేడుకుంటాడు. ఆ హీరోకి ఏం తీసిపోను అంటోంది ఈ నీరుపిల్లి (ఆట్టర్‌). హాలెండ్‌ ఎమ్మెన్‌లోని వైల్డ్‌ ల్యాండ్‌ అడ్వెంచర్‌ పార్కులో ఇది నివసిస్తుంది. దీనికి రోజుకు ఐదు చేపలు కావాల్సిందే. కేవలం చేపలు తిని బతికే ఈ నీరుపిల్లి.. కడుపులో ఎలుకలు పరిగెత్తినట్టు కాగానే.. ఇదిగో ఇలా అచ్చం మనిషిలాగే రెండు చేతులు జోడించి.. అర్థిస్తుంది.

దాని ఆకలి గుర్తించిన పార్కు సిబ్బంది వెంటనే దానికి చేపల్ని ఆహారంగా అందిస్తారు. ఆ చేపల్ని కడుపు రాసుకుంటూ బుద్ధిగా ఆరగించిన తర్వాత.. ఇదిగో ఇలా చెయ్యి ఊపి థాంక్స్‌ కూడా చెప్తుంది. ఆహారం కోసం ఈ నీరుపిల్లి చేసే చేష్టలు.. అచ్చం మనిషి ప్రార్థనలాగే ఉండటంతో  ఓ ఫొటోగ్రాఫర్‌ తన కెమెరాలో బంధించారు. ఆ ఫొటోలు ఇప్పుడు ఆన్‌లైన్‌లో హల్‌చల్‌ చేస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement