
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమవారం పలు కీలక విభాగాలపై సమీక్ష చేపట్టారు. ఉదయం నుంచి ఆయన ఐదు కీలక శాఖలపై అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో డ్రగ్స్ మాట వినపడొద్దని అన్నారు. ప్రతినెల నార్కోటిక్ బ్యూరోపై రివ్యూ చేస్తామని తెలిపారు. వ్యవసాయం, నార్కోటిక్ అండ్ డ్రగ్స్, ఎక్సైజ్, టీఎస్‌పీఎస్సీ, సింగరేణిలపై రేవంత్‌రెడ్డి సుదీర్ఘంగా సమీక్ష చేశారు. మరోసారి టీఎస్‌పీఎస్సీపై సమీక్ష నిర్వహించినున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment