ప్లాస్టిక్ ఎక్స్‌పో ప్రారంభించిన వెంకట్ నర్సింహారెడ్డి తదితరులు
మాదాపూర్: టీఎస్ ఐపాస్ ద్వారా గత 8.5 ఏళ్లలో 24000 పరిశ్రమ ప్రతిపాదనలను ఆమోదించినట్లు టీఎస్‌ఐఐసీ ఎండీ వెంకట్ నర్సింహారెడ్డి తెలిపారు. మాదాపూర్‌లోని హైటెక్స్‌లో నాలుగు రోజుల పాటు నిర్వహించనున్న ప్లాస్టిక్ ఎక్స్‌పో, హిప్‌లెక్స్ 2023 ను శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మొదటి ప్లాస్టిక్ పార్క్ పూర్తిగా అమ్ముడు పోయిందని, రెండోదాని ఏర్పాటుకు టీఎస్‌ఐఐసీ స్థలాన్ని ఇచ్చేందుకు సిద్ధంగా ఉందన్నారు.
ఎంఎస్‌ఎంఈ లకు వసతి కల్పించేందుకు వీలుగా టీఏపీఎంసీ చర్యలు తీసుకుంటుందన్నారు. ఎంఎస్‌ఎంఈ అడిషనల్ డెవలప్‌మెంట్ కమిషనర్ డి. చంద్రశేఖర్ మాట్లాడుతూ హైదరాబాద్ ప్లాస్టిక్ పరిశ్రమకు హబ్‌గా ఉందన్నారు. ఎక్స్‌పోలో పాల్గొనేందుకు ఎంఎస్‌ఎంఈ మంత్రిత్వశాఖ 60 ఎంఎస్‌ఎంఈలకు ఆర్ధికసాయాన్ని అందించిందన్నారు. హెచ్‌కె గెయిల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్( మార్కెటింగ్ పెట్రోకెమికల్స్) శ్రీ వాస్తవ మాట్లాడుతూ దక్షిణ భారతదేశంలో ప్లాస్టిక్ పరిశ్రమకు తాప్మా మార్గనిర్దేశం చేస్తుందన్నారు.
నేడు యూఎస్‌ఏ, చైనా తర్వాత భారతదేశం మూడో అతిపెద్ద ప్లాస్టిక్ వినియోగదారుగా ఉందన్నారు. 6 శాతం నుండి 7శాతం సీఎజీఆర్ వద్ద నిరంతరం వృద్ధి చెందుతుందన్నారు. గెయిల్ అమ్మకాల్లో దక్షిణ ప్రాంతం 18శాతం వాటాను అందిస్తుందన్నారు. చైనా జనాభా పెరిగినప్పటికీ మన తలసరి ప్లాస్టిక్ వినియోగం చైనాకంటే చాలా తక్కువ అన్నారు. 11 కేటీల వద్ద చైనా తలసరి వినియోగం, 46కేజీ, యూఎస్‌ఏ 170 కేజీ, ప్రపంచ సగటు 28 కేజీలు వాటి కంటే మనం వెనుకబడి ఉన్నామన్నారు. ప్లాస్టిక్‌పై విధించిన 18శాతం జీఎస్టీని తగ్గించాలని ఆప్మా, తాప్స్ తరఫున ఆయన కోరారు. ఆహార ప్యాకేజింగ్ పరిశ్రమతో పాటు ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్‌మెంట్ పరిశ్రమలో ఉపయోగించే ప్లాస్టిక్‌లపై విధించిన జీఎస్టీని తగ్గించాలన్నారు.
తెలంగాణ, ఆంధ్రా ప్లాస్టిక్స్ తయారీదారుల సంఘం(టాప్మా)నాలుగురోజుల పాటు నిర్వహించనున్న ఈ ప్రదర్శనలో రూ.500 కోట్ల వ్యాపారం జరుగుతుందని అంచనా వేస్తున్నట్టు తాప్మా అద్యభుడు విమలేష్‌గుప్త తెలిపారు. దశాబ్దం క్రితం 9 మిలియన్ టన్నుల నుంచి ఇప్పుడు 18 మిలియన్ టన్నుల వినియోగం స్ఠాయికి చేరుకున్నామని ఇండియన్ ప్లాస్టిక్స్ ఇనిస్టిట్యూట్ జాతీయ అధ్యక్షుడు అనిల్‌రెడ్డి వెన్నం తెలిపారు. పర్యావరణ సంక్షోభానికి కేవలం ప్లాస్టిక్ పరిశ్రమనే నిందించలేమని సమర్థవంతమైన వ్యర్థాల నిర్వహణ అవసరమన్నారు. భారతదేశంలో 3.5 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ ఉత్పత్తిలో కేవలం 30శాతం మాత్రమే రీసైకిల్ చేయబడుతుందన్నారు.
కీలకమైన వృద్ధి రంగంలో ప్లాస్టిక్ వినియోగాన్ని పెంచేందుకు ప్రభుత్వానికి ప్రాతినిథ్యాలను అందించాలని కోరారు. ఈ ప్రదర్శనలో ప్రపంచ వ్యాప్తంగా 400 ఎగ్జిబిటర్లు తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నారు. స్పెషాలిటీ కెమికల్స్, మాస్టర్‌బ్యాచ్‌లు, ప్రాసెస్ మిషనరీ, ప్రింటింగ్, ప్యాకేజింగ్, రామెటీరియల్స్, మోల్డ్స్, డై, పోస్ట్ ప్రాసెసింగ్ ఎక్విప్‌మెంట్, క్వాలిటి టెస్టింగ్ ఎక్విప్‌మెంట్, ఫినిస్ట్ ప్రొడెక్ట్‌లు అందుబాటులో ఉన్నాయి. కార్యక్రమంలో హెచ్‌ఎంఈఎల్ ఎండి ప్రభుదాస్,ఆలిండియా ఇండియా ప్లాస్టిక్ మానుప్యాక్చరర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మీలా జయదేవ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment