మాదాపూర్ : మాదాపూర్‌లోని హైటెక్స్‌లో శుక్రవారం 5వ ఇండియా మెడికల్ ఎక్స్‌పో-2015 అంతర్జాతీయ సదస్సును ఏర్పాటు చేశారు. వైద్య, ఆరోగ్య రంగంలో ఉపయోగించే అత్యాధునిక పరికరాలు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. ల్యాబ్స్, హాస్పిటల్స్‌లలో ఉపయోగించే అత్యాధునిక పరికరాలు అందుబాటులో ఉన్నాయి. దాదాపు 250 కంపెనీలకు చెందిన 5000 మెడికల్, సర్జికల్, మెడికల్ టెక్నాలజీ ఉత్పత్తులు ప్రదర్శనలో కొలువు దీరాయి. తైవాన్, మలేషియా, కొరియా, చైనా, హాంగ్‌కాంగ్ కు చెందిన కంపెనీల ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. ఈ ప్రదర్శన ఈ నెల 13వ తేదీ వరకు కొనసాగనుంది.