'ఆన్‌లైన్ లో ప్రాజెక్ట్‌లకు అనుమతులు'
హైదరాబాద్: రియల్‌ఎస్టేట్ రంగానికి పూర్తిస్థాయి సహాయ సహకారాలు అందిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలిపారు. హైటెక్స్ లో ఏర్పాటు చేసిన క్రెడాయ్ ప్రాపర్టీ షోను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఆన్‌లైన్ పద్దతిలో ప్రాజెక్ట్‌లకు అనుమతులు మంజూరు చేయనున్నట్టు తెలిపారు.
రియాల్టీ ప్రాజెక్ట్‌లకు, విమాన సంస్థ అనుమతులు హైదరాబాద్‌లోనే మంజూరు చేస్తామని కేసీఆర్ వెల్లడించారు. మూడు రోజుల పాటు జరగనున్న క్రెడాయ్ ప్రాపర్టీ షోలో రియార్టీ సంస్థలు పాల్గొంటున్నాయి.