సాక్షి, సిటీబ్యూరో: కండలు తిరిగిన బాడీ బిల్డర్‌లు, విదేశాలకు చెందిన అంతర్జాతీయ బాడీ బిల్డర్‌లు హైటెక్స్ వేదికపై ప్రదర్శన ఇవ్వనున్నారు. దీంతో పాటు ఫిట్‌నెస్ అండ్ మెడికల్ సర్వీసెస్ సైతం ప్రారంభం కానుంది. ఇటీవల ఏర్పడిన సర్టిఫైడ్ పర్సనల్ ట్రెయినర్స్ అసోసియేషన్ (సీపీటీఏ) ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ నెల 23, 24, 25 తేదీల్లో హైటెక్స్‌లో ‘స్పోర్ట్స్ ఎక్స్‌పో’ పేరుతో ఈ పోటీలను నిర్వహించనున్నారు.
దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన క్రాంతికిరణ్‌రావు నగరంలోని పలు ప్రాంతాల్లో ‘క్రాన్ ఫిట్‌నెస్’ను ఏర్పాటు చేశారు. ఆయన ‘సర్టిఫైడ్ పర్సనల్ ట్రెయినర్స్ అసోసియేషన్’ (సీపీటీఏ)కు వర్కింగ్ ప్రెసిడెంట్. ట్రెయినర్‌గా ఎందరికో ఫిట్‌నెస్‌పై అవగాహన కల్పిస్తున్నారు. ఈ నెల 23, 24, 25వ తేదీల్లో హైటెక్స్‌లో ‘స్పోర్ట్స్ ఎక్స్‌పో’ను నిర్వహిస్తున్నారు. ప్రత్యేకంగా ‘సీపీటీఏ’ ‘హైదరాబాద్ ఇంటర్నేషనల్ బాడీ బిల్డింగ్ చాంపియన్‌షిప్’ను ప్రారంభించనున్నారు. మూడు రోజుల పాటు జరిగే ఈ ఎక్స్‌పోలో బాడీబిల్డింగ్ పోటీలు నిర్వహిస్తారు. పోటీలకు బెంగళూరు, ఢిల్లీ, కోల్‌కతా, చెన్నై, విజయవాడ, విశాఖపట్టణం ప్రాంతాలతో పాటు విదేశాలకు చెందిన కండల వీరులు సైతం సందడి చేయనున్నారు. 24న బాడీ బిల్డింగ్‌తో పాటు ఫిట్‌నెస్ అండ్ మెడికల్ ప్రొఫెషనల్ సర్వీసెస్‌ను సైతం ప్రారంభిస్తున్నట్లు నిర్వాహకుడు క్రాంతికిరణ్‌రావు తెలిపారు.
ఫిట్‌నెస్‌పై అవగాహనకల్పిస్తారు..
‘సర్టిఫైడ్ పర్సనల్ ట్రెయినర్స్ అసోసియేషన్’ (సీపీటీఏ) ఆధ్వర్యంలో ‘హైదరాబాద్ ఇంటర్నేషనల్ బాడీ బిల్డింగ్ ఛాంపియన్‌షిప్’ పోటీలు నిర్వహిస్తున్నాం. సర్టిఫికెట్ ట్రెయిన్డ్ ట్రెయినర్స్‌గా ఈ పోటీలను తొలిసారిగా చేపట్టాం. ఫిట్‌నెస్, హెల్త్‌పై ఇన్‌స్ట్రక్టర్స్ అవగాహన కల్పిస్తారు. – క్రాంతికిరణ్‌రావు, క్రాన్‌ఫిట్‌నెస్‌అధినేత, సీపీటీఏ వర్కింగ్ ప్రెసిడెంట్
ఇవీ కేటగిరీలు..
బాడీ బిల్డింగ్ పోటీల్లో ‘బాడీ బిల్డింగ్, క్లాసిక్ బాడీబిల్డింగ్, మాస్టర్స్ బాడీ బిల్డింగ్, మెన్స్ ఫిజిక్, మెన్స్ ఫిట్‌నెస్ మోడల్, ఫిజికల్లీ చాలెంజ్‌డ్, ఉమెన్ ఫిట్‌నెస్ మోడల్’ వంటి కేటగిరీల్లో పోటీలు ఉంటాయి. పాల్గొనదల్చినవారు నేరుగా అదే రోజు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment