సాక్షి, హైదరాబాద్: భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. 15 రోజులపాటు రాష్ట్ర వ్యాప్తంగా సాగే ఈ ఉత్సవాలను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీ వేదికగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జిల్లా పరిషత్ చైర్మన్ లు, జడ్పీటీసీలు, ఎంపీపీలు ఇతర ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ అనేక త్యాగాలు, పోరాటాల వల్లే దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని కేసీఆర్ అన్నారు. మహాత్ముడి దేశంగానే భారత్ ఉంటుందని చెప్పారు. కొంతమంది గాంధీని కించపరచాలని చిల్లర ప్రయత్నాలు చేస్తున్నపటికీ అవి ఫలించవన్నారు. అలాంటి ఘటనలు దురదృష్టకరమన్నారు. మహాత్ముడు ఎప్పటికీ మహాత్ముడే అని స్పష్టం చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా దేశ భక్తి ఉట్టిపడేలా, అత్యంత ఘనంగా ఈ వేడుకలను నిర్వహిస్తున‍్నారు. భారత స్వతంత్ర వజ్రోత్సవాల స్ఫూర్తిని చాటేలా కళా ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. ప్రారంభోత్సవంలో 75 మంది వీణ కళాకారులతో వాయిద్య ప్రదర్శన చేశారు. హైదరాబాద్‌లోని అన్ని జంక్షన్లు, ప్రభుత్వ కార్యాలయాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు.
చదవండి: యూపీలో అనూహ్య పరిణామం.. బీజేపీ కార్యకర్త ఇంటిపైకి బుల్‌డోజర్
Comments
Please login to add a commentAdd a comment