Hyderabad: హైటెక్స్‌లో రేపు 40 వేల మందికి టీకాలు | Hyderabad: Mega Vaccination Drive 40000 Hitex Area Pre Registered | Sakshi
Sakshi News home page

Hyderabad: హైటెక్స్‌లో రేపు 40 వేల మందికి టీకాలు

Published Sat, Jun 5 2021 9:58 AM | Last Updated on Sat, Jun 5 2021 10:51 AM

Hyderabad: Mega Vaccination Drive 40000 Hitex Area Pre Registered - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, హైదరాబాద్‌( రాయదుర్గం) : దేశంలోకెల్లా అతి పెద్ద టీకా కార్యక్రమం ఆదివారం హైదరాబాద్‌లోని హైటెక్స్‌ ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో జరగనుంది. ఒకేరోజు ఏకంగా 40 వేల మందికి టీకాలు వేసేందుకు సైబరాబాద్‌ పోలీసులు, సొసైటీ ఫర్‌ సైబరాబాద్‌ సెక్యూ రిటీ కౌన్సిల్‌ (ఎస్‌సీఎస్‌సీ)తో కలసి మెడికవర్‌ ఆస్పత్రి ఈ మెగా డ్రైవ్‌ను చేపడుతోంది.

ఉదయం 8 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు నిరాటంకంగా టీకాల కార్యక్రమం జరుగుతుందని, ఇందుకోసం 500 కౌంటర్లను ఏర్పాటు చేశామని నిర్వాహకులు తెలిపారు. టీకాలకు అర్హులైన (18 ఏళ్లు నిండిన) వారు http://medicoveronline.com/vaccination వెబ్‌సైట్‌లో స్లాట్‌ బుక్‌ చేసుకోవచ్చని, కోవాగ్జిన్‌ టీకా వేస్తామని పేర్కొన్నారు. టీకా ధరను అన్ని చార్జీలతో కలిపి రూ.1,400గా నిర్ణయించామన్నారు. మరిన్ని వివరాలకు 040–6833 4455 ఫోన్‌ నంబర్‌ను సంప్రదించాలన్నారు.  

చదవండి: టిప్పన్‌ నక్ష.. రాష్ట్రంలో భూముల సర్వేకు ఈ పేరుకు సంబంధం ఏంటి?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement