శని మహిమలు చూడండి | look to the glory of sani | Sakshi
Sakshi News home page

శని మహిమలు చూడండి

Published Wed, Sep 10 2014 12:40 AM | Last Updated on Sat, Sep 2 2017 1:07 PM

శని మహిమలు చూడండి

శని మహిమలు చూడండి

శనీశ్వరుని మహిమల నేపథ్యంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘శనిదేవుడు’. ‘చూడండి మహిమలు’ అనేది ఉపశీర్షిక. శివ జొన్నలగడ్డ స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సుమన్, ఆకాశ్, శివ జొన్నలగడ్డ ఇందులో ప్రధాన పాత్రధారులు. నండూరి అనిల్‌కుమార్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలు ఇటీవలే విడుదలయ్యాయి. ఈ పాటలకు మంచి స్పందన లభిస్తోందని శివ జొన్నలగడ్డ ఆనందం వెలిబుచ్చారు. ‘‘భారతదేశంలో శనిదేవునిపై వస్తున్న తొలి సినిమా ఇది. శనీశ్వరుణ్ణి పూజిస్తే ఎలాంటి మంచి ఫలితాలు కలుగుతాయో తెలిపే సినిమా ఇది. విజయదశమి కానుకగా సినిమాను విడుదల చేస్తాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: బీఎస్ కుమార్, సమర్పణ: గుద్దేటి బసవప్ప మేరు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement