prudhviraj
-
పృద్వీ రాజ్ దర్శకత్వంలో ‘కొత్త రంగుల ప్రపంచం’
ఇప్పటివరకు ప్రేక్షకులను తనదైన కామెడీతో మేనరిజంతో ఆకట్టుకున్న సీనియర్ నటుడు పృద్వీ రాజ్ దర్శకత్వం వహించిన సినిమా ‘కొత్త రంగుల ప్రపంచం’. పృద్విరాజ్, క్రాంతి కృష్ణ, శ్రీలు, విజయ రంగరాజు, అశోక్ కుమార్, గీతాసింగ్, కృష్ణ తేజ, అంబటి శ్రీను, జబర్దస్త్ నవీన్, జబర్దస్త్ గణపతి నటీనటులుగా శ్రీ పిఆర్ క్రియేషన్స్ పతాకంపై పద్మ రేఖ, గుంటక శ్రీనివాస్ రెడ్డి, కుర్రి కృష్ణా రెడ్డిలు ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా షూటింగ్ పూర్తిచేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ఈ సినిమాకి సంబంధించిన గ్లిమ్ప్స్ ను తాజాగా రిలీజ్ చేసింది చిత్రబృందం. ఈ సందర్భంగా30 ఇయర్స్ ఇండస్ట్రీ పృద్వి మాట్లాడుతూ... ఈ సినిమా చాలాబాగా వచ్చింది. ఒక సీన్ ను మొదలుపెట్టేముందు డీఓపీ తో కూర్చుని మాట్లాడుకునే వాళ్ళం. ఈ సినిమాకి సినీ ప్రముఖులు నుంచి మంచి ప్రశంసలు వచ్చాయి’అని అన్నారు. ‘సీనియర్ నటులతో నేను సినిమా చేసినందుకు చాలా సంతోషంగా ఉంది అని హీరో క్రాంతికృష్ణ అన్నారు. ‘మా నాన్న దర్శకత్వంలో నేను ఈ సినిమా చెయ్యడం లక్కీ ఫీల్ అవుతున్నాను. -
చంద్రబాబు గగ్గోలుపెట్టడం హాస్యాస్పదంగా ఉంది: పృథ్వీరాజ్
సాక్షి, ఒంగోలు: రైతుల పక్షాన పోరాటం చేస్తున్నానని.. రైతు శ్రేయస్సే ముఖ్యమని టీడీపీ అధినేత చంద్రబాబు గగ్గోలుపెట్టడం హాస్యాస్పదంగా ఉందని ఎస్వీబీసీ ఛైర్మన్ పృథ్విరాజ్ విమర్శించారు. ఆదివారం ప్రకాశం జిల్లా ఒంగోలులో పర్యటించిన ఆయన.. అమరావతిలో ఆందోళనలపై స్పందించారు. చంద్రబాబు పెయిడ్ ఆర్టిసుల చేత నిరసన ప్రదర్శనలు చేస్తున్నారే తప్ప... అసలైన రైతులెవ్వరూ ఆయన పక్షాన లేరని స్పష్టం చేశారు. రైతు పక్షపాతి అని తనకు తాను కితాబు ఇచ్చుకుంటున్న బాబు.. గత టీడీపీ పాలనలో రైతులకు ఏం చేశారని నిలదీశారు.. -
చంద్రబాబు గగ్గోలుపెట్టడం హాస్యాస్పదంగా ఉంది: పృథ్వీరాజ్
-
పృథ్వీరాజ్‌కు సవాల్‌గా ఎస్వీబీసీలో డీవీడీల గోల..
శ్రీవేంకటేశ్వర భక్తి చానల్లో డీవీడీల వివాదం ముదురుతోంది. ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు ప్రవచనాలను డీవీడీలుగా మలచి విక్రయించే క్రమంలో రూ.20 లక్షల నిధులు దుబారా కావడానికి కారణమైన అధికారులపై ఇంతవరకు చర్యలు తీసుకోకపోవడమే దీనికి ప్రధాన కారణమైంది. విలువైన డీవీడీలను రెండేళ్లుగా కార్యాలయ ఆవరణలో పడేశారు. ఇందులో అనేక డీవీడీలు పనికిరాకుండా పోగా, కొన్ని పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఈ అక్రమాలను నిగ్గుతేల్చడం ఎస్వీబీసీ నూతన చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన పృథ్వీరాజ్‌కు సవాల్‌గా మారింది. సాక్షి, తిరుపతి సెంట్రల్: శ్రీ వేంకటేశ్వర భక్తితత్వం పై ప్రపంచవ్యాప్తంగా ప్రచారం నిర్వహించడమే లక్ష్యంగా సుమారు 12 ఏళ్ల కిందట ఏర్పాటైన శ్రీవేంకటేశ్వర భక్తి చానెల్(ఎస్వీబీసీ) వివాదాలకు వేదికగా మారడం విస్మ యం కలిగిస్తోంది. టీటీడీ కనుసన్నల్లో నడవాల్సిన ఎస్వీబీసీపై సరైన నియంత్రణ లేకపోవడమే అన్ని వివాదాలకు కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కొంతకాలంగా ఎస్వీబీసీకి నేతృత్వం వహిస్తున్న అధికారుల తీరుతో సంస్థ ప్రతిష్ట దెబ్బతింటోంది. చాగంటి డీవీడీల విక్రయానికి శ్రీకారం చాగంటి కోటేశ్వరరావుకు ప్రజల్లో అనూహ్య స్పందన లభిస్తున్న కారణంగా ఎప్పటికప్పుడు ఎస్వీబీసీ ద్వారా రికార్డింగ్ చేశారు. కొంత కాలానికి వీటిని డీవీడీలుగా మార్చి విక్రయించే పనికి శ్రీకారం చుట్టారు. అప్పటికే చాంగటి తన సొంత ట్రస్ట్ ద్వారా తన ప్రవచనాలను లాభాపేక్ష లేకుండా డీవీడీలు చేసి, తన ప్రవచనాలను ప్రజలకు అందించేవారు. కానీ, శ్రీవారి మీద ఉన్న భక్తి భావన కారణంగా తన ట్రస్ట్ ద్వారా కాకుండా ఎస్వీబీసీ ద్వారా ప్రవచనాలను అందించేందుకు అంగీకరించడం గమనార్హం. ఈ క్రమంలో చాగంటి కోటేశ్వరరావు ప్రవచనాలను ఎస్వీబీసీ అధికారులు డీవీడీలుగా మార్చి, విక్రయానికి సిద్ధం చేశారు. శివానందల హరి, వేంకటేశ్వర మహత్యం, శ్రీవారి బ్రహ్మోత్సవాలు వంటి విభిన్న అంశాలతో కూడిన వాటిని అందుబాటులోకి తీసుకొచ్చారు. రికార్డింగ్, మార్కెటింగ్ వంటి పనులకు ఎస్వీబీసీ అధికారులు రూ.20 లక్షల వరకు వెచ్చించారు. అధికారి మారడమే కారణం తిరుమల నాదనీరాజనంతో సహా ఎక్కడ నుంచి ప్రత్యక్ష ప్రసారాలను చేసినా..ఆ ప్రాంతానికి డీవీడీలు తరలిస్తూ విక్రయించడానికి వీలుగా ముగ్గురు సిబ్బందిని ప్రత్యేకంగా నియమించుకున్నారు. పరిమిత కాలంలో కొద్ది పాటి డీవీడీలను కూడా ఎస్వీబీసీ విక్రయించింది. ఆ డీవీడీలను రూపకలప్పన చేసిన అధికారి ఉన్నంత కాలం విక్రయాలు కొనసాగాయి. అయితే ఆయన స్థానంలో మరొక అధికారి ఎస్వీబీసీలో కీలక బాధ్యతలను చేపట్టారు. ఆయనకు చాగంటి అంటే గిట్టని కారణంగా డీవీడీలను పక్కన పడేశారు. డీవీడీలకు మార్కెట్లో డిమాండ్ తగ్గిపోయిందన్న సాకు చూపి, మిగిలిన అన్నింటిని ఎస్వీబీసీ కార్యాలయంలో ఓ మూలన పడేసినట్టు సమాచారం. డీవీడీల కంటెంట్ సరిగ్గా లేదంటూ తొలుత పరిశీలన కోసం ప్రత్యేక అధికారిని నియమించారు. ప్రణాళికా ప్రకారం డీవీడీల్లో కంటెంట్ లేదని ఆ ప్రత్యేక అధికారితో బలవంతంగా నివేదికను తయారు చేయించారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. డీవీడీలను విక్రయించడం కోసం నియమించిన సిబ్బందిని కూడా ఆయన హయాంలోనే తొలగించారు. మాతృదేవోభవ డీవీడీపై మరో వివాదం శ్రీవారి ఉత్సవాల్లో కాకుండా ప్రత్యేకంగా రూపొందించిన డీవీడీల రికార్డింగ్ విషయంలోనూ వివాదాలు తలెత్తాయి. ఎస్వీబీసీ చానెల్ లేదా అనుమతి పొందిన స్టూడియోలో రికార్డింగ్ చేయాల్సి ఉంటే...ఓ ప్రవచన కర్త సొంతింట్లో నిర్వహించిన కార్యక్రమాన్ని సైతం మాతృదేవో భవ పేరిట డీవీడీగా రూపొందించడంపై అప్పట్లో తీవ్ర దుమారమే చెలరేగింది. సదరు కార్యక్రమానికి సినీ ప్రముఖుల కుటుంబ సభ్యులు హాజరు కావడాన్ని డీవీడీల్లో వీక్షించిన భక్తులు విస్తుపోవాల్సి వచ్చింది. -
డీ గ్లామర్ లుక్ లో...
మలయాళం యాక్టర్ పృథ్వీరాజ్ కొత్త లుక్‌లోకి మారిపోయారు. డ్రీమ్‌బాయ్ లుక్‌లో కనిపించే ఆయన డీ గ్లామర్ రోల్‌లోకి చేంజ్ అయ్యారు. ఇదంతా ఆయన తాజా చిత్రం ‘ఆడు జీవితం’ కోసమే. మలయాళ ఇండస్ట్రీలో రాబోతున్న క్రేజీ ప్రాజెక్టుల్లో ‘ఆడు జీవితం’ ఒకటి. మలయాళంలోని ఓ ప్రముఖ నవల ఆధారంగా ఈ సినిమాను దర్శకుడు బ్లెస్సీ తెరకెక్కిస్తున్నారు. ఇందులో పృథ్వీరాజ్ విభిన్న గెటప్స్‌లో కనిపిస్తారట. ఆ గెటప్స్‌లో ఇదొకటి. ఈ చిత్రానికి ఏ ఆర్ రెహమాన్ సంగీత దర్శకుడు. 25 సంవత్సరాల తర్వాత మలయాళ చిత్రానికి రెహమాన్ సంగీతం అందించనుండటం విశేషం. 2020లో రిలీజ్ కానున్న ఈ చిత్రంలో అమలా పాల్ కథానాయిక. -
శరణం అయ్యప్ప
మలయాళ హీరో పృథ్వీరాజ్ అయ్యప్పగా మారబోతున్నారు. అయ్యప్ప మాల వేసుకుంటున్నారా అంటే? కాదు.. అయ్యప్ప స్వామి పాత్రనే పోషిస్తున్నారు ఆయన. అయ్యప్ప స్వామి జీవితం ఆధారంగా దర్శకుడు శంకర్ రామకృష్ణ ‘అయ్యప్పన్’ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. పృథ్వీరాజ్ నిర్మాణ సంస్థ ‘ఆగస్ట్ సినిమాస్’ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. వచ్చే ఏడాది స్టార్ట్ కానున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ని రిలీజ్ చేశారు. ‘అయ్యప్పన్: రియల్. రెబల్’ అన్నది క్యాప్షన్. ప్రస్తుతం హీరోగా రెండు సినిమాలు చేయడంతో పాటు మోహన్‌లాల్‌తో ‘లూసిఫర్’ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు పృథ్వీరాజ్. -
ట్రైలర్ చాలా బాగుంది
ఖయ్యూమ్, తనిష్క్ రాజన్, షానీ, ఫృథ్వీరాజ్, సమీర్, లోహిత్ ముఖ్య తారలుగా గౌతమ్ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘దేశంలో దొంగలు పడ్డారు’. అలీ సమర్పణలో సారా క్రియేషన్స్ పతాకపంపై రూపొందిన ఈ సినిమా ట్రైలర్‌ను నటుడు చిరంజీవి రిలీజ్ చేసి, మాట్లాడుతూ– ‘‘నా చేతుల మీదగా ఈ సినిమా ట్రైలర్‌ను ఆవిష్కరించడం ఆనందంగా ఉంది. ముందు అలీ నా దగ్గరికి వచ్చి ఖయ్యూమ్ నటించిన సినిమా అనగానే ఇదొక కామెడీ సినిమా అనుకున్నాను. కానీ ట్రైలర్ చూశాక అర్థం అయ్యింది.. ఇది సీరియస్ మూవీ అని. ఈ సినిమా ఖయ్యూమ్కు కచ్చితంగా ఒక టర్నింగ్ పాయింట్ అవుతుంది. అతని కెరీర్లో ఇది బెస్ట్ మూవీ అవుతుంది. మొదటి సినిమా అయినప్పటికీ మంచి అనుభం ఉన్న దర్శకునిలా గౌతమ్ హ్యాండిల్ చేసాడని అనిపిస్తుంది. ట్రైలర్ ఇంప్రెసివ్‌గా ఉంది. పిల్లల అక్రమ రవాణా నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాతో గౌతమ్ ఒక మంచి సందేశాన్ని అందిస్తాడని భావిస్తున్నాను. అలాగే కొత్త అమ్మాయి తనిష్క కూడా నటనకు ఆస్కారం ఉన్న పాత్రలో నటించిందని అర్థం అవుతోంది. ఖయ్యూమ్, గౌతమ్‌లతో పాటు టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్’’ అన్నారు. గిరిధర్, ‘జబర్దస్త్’ రాఘవ, తడివేలు తదితరులు నటించిన ఈ సినిమాకు సంతోష్ డొంకాడ, సెలెబ్ కనెక్ట్ ప్రతినిథులు సహ–నిర్మాతలు. -
జగన్‌కు జనం పట్టం కట్టడం ఖాయం
తూర్పు గోదావరి, కొత్తపేట: రానున్న ఎన్నికల్లో జననేత వైఎస్ జగన్మోహన్రెడ్డికే ప్రజలు పట్టం కడతారని ప్రముఖ సినీ కమెడియన్ 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్ పేర్కొన్నారు. ఆయన శుక్రవారం కొత్తపేటలో మిత్రుడు, ప్రముఖ పండితుడు పెద్దింటి రామం ఇంటికి వచ్చారు. ఆ సందర్భంగా పృథ్వీరాజ్ విలేఖరులతో మాట్లాడారు. రాజకీయాలు, సినీ అంశాలు ఆయన ప్రస్తావించారు. ఆయన మాటల్లోనే..‘నేను 2014 నుంచి వైఎస్సార్ సీపీ ప్రచార కార్యదర్శిగా పనిచేస్తున్నాను. విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లో విస్తృతంగా పర్యటించాను. గత ఎన్నికల్లో కొత్త రాష్ట్రం, చంద్రబాబు సీనియార్టీ, రైతు, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తాననే బాబు హామీ నమ్మి ప్రజలు ఆయన ఓట్లేశారు. మాకు ప్రతిపక్ష హోదా ఇచ్చారు. సంతోషంగా స్వీకరించాం. నాలుగేళ్లుగా చంద్రబాబు పాలన ఎలా ఉందో ప్రజలు గమనించారు. ఆయనపై పెట్టుకున్న ఆశలు అన్నీ అడియాసలయ్యాయి. దాంతో ప్రజల దృష్టి జగన్ వైపు మళ్లింది. ఆయన పాలన కోరుకుంటున్నారు. ప్రజా సమస్యలు, వారు పడుతున్న ఇబ్బందులను గుర్తించేందుకు ఎండనకా, వాననకా, ఆరోగ్యం గురించి లెక్కచేయకుండా జగన్మోహన్రెడ్డి ‘ప్రజా సంకల్పయాత్ర’ చేస్తున్నారు. దీంతో ప్రజలను దోచుకునే నాయకులు ఇంటికి పోతారు. ప్రజలకు సేవ చేసే నాయకులే అధికారంలోకి వస్తారు. ఇచ్చిన మాటకు కట్టుబడి, మడమతిప్పని, ప్రజా క్షేమం కోరుకున్న ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖరరెడ్డిల పాలన చూశాం. మళ్లీ వారి స్థానంలో ఆ తరహా పాలన అందించగల జగన్‌ను సీఎంగా చూస్తామన్నది నా ప్రగాఢ నమ్మకం. నీతి నిజాయితీల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు. సంతలో పశువులను కొన్నట్టు ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారు. కానీ ఎమ్మెల్సీ చక్రపాణిరెడ్డి వైఎస్సార్ సీపీలోకి వస్తానంటే ఆ పదవికి రాజీనామా చేయించి పార్టీలోకి తీసుకున్న జగన్ రాజకీయ విలువలకు అద్దం పట్టిన నాయకునిగా నిలిచారు. ప్రజలు జగన్ నాయకత్వ ఆవశ్యకతను బలంగా నమ్మి ఆయనకే పట్టం కట్టేందుకు ఎదురు చూస్తున్నారు. శ్రీరెడ్డి వివాదం అర్ధరహితం ఇటీవల తలెత్తిన శ్రీరెడ్డి వివాదం అర్ధరహితం. ఎవరో ఆమె వెనకుండి నడిపిస్తున్నారా? అనే సందేహం కలుగుతోంది. ఏదేమైనా ఈ వివాదంలో మెగాస్టార్ చిరంజీవి తల్లిని విమర్శించడం బాధాకరం. చిరంజీవి ఫ్యామిలీలో అందరూ కష్టపడి పైకి వచ్చిన వారే. మహామనీషి దాసరి నారాయణరావు ఉంటే శ్రీరెడ్డి, కత్తి మహేష్ లాంటి వారు మాట్లాడేవారు కాదు. 135 సినిమాల్లో నటించా నేను 135 సినిమాల్లో నటించాను. ఖడ్గం సినిమా నుంచి నాకు గుర్తింపు లభించింది. అప్పటి నుంచి 30 ఇయర్స్ ఇండస్ట్రీ నా ఇంటిపేరుగా మారిపోయింది. ప్రస్తుతం రామ్‌చరణ్, అల్లరి నరేష్, సాయిధరమ్‌తేజ్ హీరోలుగా చేస్తున్న సినిమాల్లో మంచి క్యారెక్టర్లు పోషిస్తున్నా. -
కోర్టులో నటుడు పృథ్వీరాజ్‌కు చుక్కెదురు!
విజయవాడ: విభేదాలతో వేరుగా ఉంటున్న తన భార్యకు నెలకు రూ. 8 లక్షల చొప్పున భరణం చెల్లించాలని ప్రముఖ టాలీవుడ్ హాస్యనటుడు పృథ్వీరాజ్‌కు ఫ్యామిలీ కోర్టు ఆదేశాలు జారీచేసింది. పృథ్వీరాజ్ తనను నిర్లక్ష్యం చేస్తూ మానసికంగా వేధిస్తున్నారంటూ సెక్షన్ 498 ఏ గృహహింస చట్టం కింద ఆయన భార్య శ్రీలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత జనవరి నుంచి ఈ కేసును విజయవాడ ఫ్యామిలీ కోర్టు విచారణ నడుస్తున్నప్పటికీ, ఎన్నడూ పృథ్వీరాజ్ కోర్టు విచారణకు హాజరుకాలేదు. పృథ్వీరాజ్, శ్రీలక్ష్మికి 1984లో పెళ్లయింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. పృథ్వీరాజ్ కుటుంబం మొదట విజయవాడలో నివసించేంది. పృథ్వీరాజ్ కు సినిమాల్లో బ్రేక్ వచ్చిన తర్వాత ఆయన కుటుంబం హైదరాబాద్‌కు తరలివచ్చింది. ప్రస్తుతం టాలీవుడ్లో భారీ డిమాండ్ ఉన్న కమెడియన్లలో పృథ్వీరాజ్ ఒకరు. ముఖ్యంగా ’ఖడ్గం’ సినిమాలో ‘థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ’ డైలాగ్‌తో పృథ్వీరాజ్ లైమ్‌లైటులోకి వచ్చారు. ఇటీవలికాలంలో పృథ్వీరాజ్ తనను నిర్లక్ష్యం చేస్తూ.. మనసిక క్షోభకు గురిచేస్తున్నారని, ఇక ఆయనతో కలిసి ఉండటం తనకు సాధ్యం కాదని శ్రీలక్ష్మి కోర్టుకు తెలిపారు. భర్త ఆదాయ వివరాలను కోర్టుకు సమర్పించిన ఆమె.. తనకు నెల రూ. 10 లక్షల భరణం ఇవ్వాల్సిందిగా కోర్టును కోరారు. అయితే, పృథ్వీరాజ్ ఆదాయ మార్గాలను పరిశీలించిన కోర్టు నెలకు రూ. 8 లక్షలు భరణం చెల్లించాలని గురువారం ఆదేశాలు జారీచేసింది. -
గొంతులో ఇడ్లీ ఇరుక్కుని చిన్నారి మృతి
నర్వ: మురిపెంతో పెట్టిన ఇడ్లీ ముక్క ముద్దులొలికే చిన్నారి ఉసురు తీస్తుందని ఆ కన్నతల్లి ఊహించి ఉండదు. కానీ, జరగరాని ఘోరం జరిగిపోయింది. ఇడ్లీ ముక్క గొంతులో ఇరుక్కుపోవడంతో ఆ చిన్నారి ప్రాణాలు విడిచాడు. మహబూబ్‌నగర్ జిల్లా ఆత్మకూరు మండలం అమరచింత పట్టణంలో బుధవారం ఉదయం జరిగిన ఈ ఘటన చిన్నారి తల్లిదండ్రులతో పాటు స్థానికులను విషాదంలో ముంచివేసింది. వెంకటయ్య, పద్మ దంపతులకు ఐదు నెలల పృథ్వీరాజ్ సంతానం. బుధవారం ఉదయం చిన్నారికి పద్మ ఇడ్లీ తినిపించే ప్రయత్నం చేసింది. ఓ ఇడ్లీ ముక్క నోట్లో పెట్టగా గొంతులో ఇరుక్కుపోవడంతో పసివాడు విలవిలలాడిపోయాడు. చిన్నారిని తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళుతుండగానే తుది శ్వాస విడిచాడు.