
పృథ్వీరాజ్
మలయాళ హీరో పృథ్వీరాజ్ అయ్యప్పగా మారబోతున్నారు. అయ్యప్ప మాల వేసుకుంటున్నారా అంటే? కాదు.. అయ్యప్ప స్వామి పాత్రనే పోషిస్తున్నారు ఆయన. అయ్యప్ప స్వామి జీవితం ఆధారంగా దర్శకుడు శంకర్ రామకృష్ణ ‘అయ్యప్పన్’ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. పృథ్వీరాజ్ నిర్మాణ సంస్థ ‘ఆగస్ట్ సినిమాస్’ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. వచ్చే ఏడాది స్టార్ట్ కానున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్‌ని రిలీజ్ చేశారు. ‘అయ్యప్పన్: రియల్. రెబల్’ అన్నది క్యాప్షన్. ప్రస్తుతం హీరోగా రెండు సినిమాలు చేయడంతో పాటు మోహన్‌లాల్‌తో ‘లూసిఫర్’ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు పృథ్వీరాజ్.
Comments
Please login to add a commentAdd a comment