Ayyappan
-
తెలంగాణ పథకాలు ఆదర్శనీయం
హైదరాబాద్: రైతాంగ సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శనీయమని, వాటిపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందని భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి మాజీ డైరెక్టర్ జనరల్, ఇంఫాల్ కేంద్రీయ వ్యవసాయ వర్సిటీ వైస్ చాన్స్‌లర్ డాక్టర్ ఎస్.అయ్యప్పన్ పేర్కొన్నారు. అన్నదాతకు గౌరవం, లాభదాయకత పెంపొందించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం మూడో స్నాతకోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2050 వరకు పెరిగే జనాభా ఆహార అవసరాలు తీర్చేందుకు ఆహార ఉత్పత్తి రెట్టింపు చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. పెరుగుతున్న జనాభా, తరుగుతున్న సహజ వనరుల కారణంగా ఆహార భద్రత చాలా కీలకాంశంగా మారిందని తెలిపారు. దీనికి తగ్గట్లుగా వ్యవసాయంలో మార్పులు రావాల్సిన అవసరం ఉందని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కృతమవుతున్న బిగ్‌డేటా ఎనాలసిస్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, బ్లాక్ చైన్ టెక్నాలజీ తదితరాలను వినియోగించి వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా మార్చాల్సిన అవసరం ఉందని తెలిపారు. పట్టణ జనాభా అధికమవుతున్న పరిస్థితుల్లో పంటల సాగు విధానం కూడా మారాలని సూచించారు. వ్యవసాయం మరింత ఆకర్షణీయంగా, లాభదాయకంగా మార్చాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. అతి స్వల్ప కాలంలోనే ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ వర్సిటీ అనేక అంశాల్లో పురోగతి సాధించిన నేపథ్యంలో ఉపకులపతి డాక్టర్ ప్రవీణ్‌రావు, సిబ్బందిని అయ్యప్పన్ అభినందించారు. కాగా, ఈ స్నాతకోత్సవంలో 592 మంది యూజీ విద్యార్థులు, 144 మంది పీజీ, పీహెచ్డీ విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేశారు. వివిధ కోర్సుల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన 9 మంది పీజీ, పీహెచ్డీ విద్యార్థులతోపాటు 17 మంది అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు పతకాలు అందించారు. ఈ కార్యక్రమంలో వర్సిటీ ఉపకులపతి డాక్టర్ వి.ప్రవీణ్‌రావు, రిజిస్ట్రార్ డాక్టర్ ఎస్.సుధీర్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
శరణం అయ్యప్ప
మలయాళ హీరో పృథ్వీరాజ్ అయ్యప్పగా మారబోతున్నారు. అయ్యప్ప మాల వేసుకుంటున్నారా అంటే? కాదు.. అయ్యప్ప స్వామి పాత్రనే పోషిస్తున్నారు ఆయన. అయ్యప్ప స్వామి జీవితం ఆధారంగా దర్శకుడు శంకర్ రామకృష్ణ ‘అయ్యప్పన్’ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. పృథ్వీరాజ్ నిర్మాణ సంస్థ ‘ఆగస్ట్ సినిమాస్’ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. వచ్చే ఏడాది స్టార్ట్ కానున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ని రిలీజ్ చేశారు. ‘అయ్యప్పన్: రియల్. రెబల్’ అన్నది క్యాప్షన్. ప్రస్తుతం హీరోగా రెండు సినిమాలు చేయడంతో పాటు మోహన్‌లాల్‌తో ‘లూసిఫర్’ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు పృథ్వీరాజ్. -
4జీ టెక్నాలజీతో ఆరోగ్యమైన పంటలు
ఐకార్ డెరైక్టర్ జనరల్ ఎస్. అయ్యప్పన్ మాదాపూర్: 4జీ టెక్నాలజీతో ఆరోగ్యకరమైన పంటలు సాధ్యమని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ (ఐసీఏఆర్) డెరైక్టర్ జనరల్ డాక్టర్ అయ్యప్పన్ అన్నారు. మాదాపూర్ హెచ్ఐసీసీలో ఆదివారం రాత్రి ప్రతిష్ట ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ రూపొందించిన 4జీ నానో టెక్నాలజీ వ్యవసాయ ఎరువులను మార్కెట్లోకి విడుదలజేశారు. ముఖ్యఅతిథిగా ఐకార్ డెరైక్టర్ జనరల్ డాక్టర్ అయ్యప్పన్ మాట్లాడుతూ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని అధిగమించి వ్యవసాయ రంగం నాలుగవతరం 4జీ నానో టెక్నాలజీని సాధించడం ప్రపంచ వ్యవసాయరంగానికి శుభసూచకమన్నారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసె ర్చ్ ఐదున్నరేళ్ళ పాటు పరిశోధించి ప్రపంచవ్యాప్తంగా 170 పరిశోధనశాలలో పరీక్షించిన ఈ 4జీ నానో ఫార్ములాతో ప్రతి ష్టా ఇండస్ట్రీస్ లిమిటెడ్ అగ్రికల్చర్ ఇన్పుట్స్ (ఎరువులు) రూపొందించినందుకు సంతోషం వ్యక్తం చేశారు. ప్రస్తుతం పవర్ ఆఫ్ టెక్నాలజీగా పేర్కొంటున్న నానో టెక్నాలజీని వ్యవసాయరంగం సాధించడం ప్రపంచ వ్యవసాయ రంగంలో కీలకమైన మలుపని అన్నారు. ప్రతిష్టా ఇండస్ట్రీస్ లిమిటెడ్ 4జీ నానో వ్యవసాయ ఎరువులను మార్కెట్లోకి విడుదల చేయడం టెక్నాలజీని ఆర్థికరంగానికి మరియు వ్యవసాయ రంగానికి అత్యంత అందుబాటులోకి తీసుకువెళ్ళడమే అవుతుందన్నారు. వ్యవసాయ దారులు ఎవరో అందించే ఆర్థిక ప్రోత్సాహకాలపై అంత మక్కువగా లేరని, వారికి అనువైన టెక్నాలజీని అందుబాటులోకి తీసుకెళితే వ్యవసాయదారులే ఆర్థిక శక్తులుగా ఎదుగుతారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రతిష్టా ఇండస్ట్రీస్ లిమిటెడ్ రూపొందించిన 4జీ నానో వ్యవసాయ ఎరువులను ఇక్రిశాట్ డెరైక్టర్ జనరల్ డాక్టర్ విలియం ధార్ మార్కెట్లోకి విడుదల చేశారు. ఈ ఎరువులను నాగార్జున ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ మార్కెట్లోకి తీసుకువెళ్తుంది. ఈ సందర్భంగా ప్రతి ష్టా కంపెనీ లోగోను, పుస్తకావిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రతిష్టా ఇండస్ట్రీస్ మేనేజింగ్ డెరైక్టర్ డాక్టర్ కేవీఎస్ఎస్ సాయిరాం, ఇక్రిశాట్ డెరైక్టర్ జనరల్ విలియం ధార్, ఆంధ్రబ్యాంక్ డీజీఎం వెంకటేశ్వర్లు, మాజీ న్యాప్ నేషనల్ డెరైక్టర్ డాక్టర్ రామారావు, శాస్త్రవేతలు పాల్గొన్నారు. -
4జీ టెక్నాలజీతో ఆరోగ్యమైన పంటలు
మాదాపూర్: 4జీ టెక్నాలజీతో ఆరోగ్యకరమైన పంటలు సాధ్యమని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ (ఐసీఏఆర్) డెరైక్టర్ జనరల్ డాక్టర్ అయ్యప్పన్ అన్నారు. మాదాపూర్ హెచ్ఐసీసీలో ఆదివారం రాత్రి ప్రతిష్ట ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ రూపొందించిన 4జీ నానో టెక్నాలజీ వ్యవసాయ ఎరువులను మార్కెట్లోకి విడుదలజేశారు. ముఖ్యఅతిథిగా ఐకార్ డెరైక్టర్ జనరల్ డాక్టర్ అయ్యప్పన్ మాట్లాడుతూ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని అధిగమించి వ్యవసాయ రంగం నాలుగవతరం 4జీ నానో టెక్నాలజీని సాధించడం ప్రపంచ వ్యవసాయరంగానికి శుభసూచకమన్నారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసె ర్చ్ ఐదున్నరేళ్ళ పాటు పరిశోధించి ప్రపంచవ్యాప్తంగా 170 పరిశోధనశాలలో పరీక్షించిన ఈ 4జీ నానో ఫార్ములాతో ప్రతి ష్టా ఇండస్ట్రీస్ లిమిటెడ్ అగ్రికల్చర్ ఇన్పుట్స్ (ఎరువులు) రూపొందించినందుకు సంతోషం వ్యక్తం చేశారు. దేశంలో కొనడానికి స్వచ్ఛమెన బంగా రం దోరుకుతుంది కానీ పూర్తి ఆరోగ్యకరమైన బియ్యం, ఆహారం లభించడం ప్రశ్నార్ధకంగా మారిందన్నారు. ఇటువంటి తరుణంలో నానో న్యియెంట్స్ ల్యక్టొగ్లూకొనేట్స్ సమ్మిళతమైన పూర్తి స్థాయిఖని జాలు కలిగిన వ్యవసాయ పంటలను పెంచడానికి ఈ 4 జీ నానో అగ్రికల్చర్ టెక్నాలజీ ద్వారా సాధ్యమవుతుందని ఆయన తెలియజేశారు. ప్రస్తుతం పవర్ ఆఫ్ టెకాన్లజీగా పేర్కొంటున్న నానో టెక్నాలజీని వ్యవసాయరంగం సాధించడం ప్రపం చ వ్యవసాయ రం గంలో కీలకమైన మలుపని అన్నారు. ప్రతిష్టా ఇండస్ట్రీస్ లిమిటెడ్ 4జీ నానో వ్యవసాయ ఎరువలను మార్కెట్లోకి విడుదల చేయడం టెక్నాలజీని ఆర్థికరంగానికి మరియు వ్యవసాయ రంగానికి అత్యంత అందుబాటులోకి తీసుకువెళ్ళడమే అవుతుందన్నారు. వ్యవసాయ దారులు ఎవరో అందించే ఆర్థిక ప్రోత్సాహకాలపై అంత మక్కువలేరని, వారికి అనువైన టెక్నాలజీని అందుబాటులోకి తీసుకువెళితే వ్యవసాయదారులే ఆర్థిక శక్తులుగా ఎదుగుతారని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రతిష్టా ఇండస్ట్రీస్ లిమిటెడ్ రూపొందించిన 4జీ నానో వ్యవసాయ ఎరువలను ఇక్రిశాట్ డెరైక్టర్ జనరల్ డాక్టర్ విలియం ధార్ మార్కెట్లోకి విడుదల చేశారు. ఈ ఎరువులను నాగార్జున ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ మార్కెట్లోకి తీసుకువెళ్తుంది. ఈ సందర్భంగా ప్రతిష్టా కంపెనీ లోగోను, పుస్తకావిష్కరనను చేశారు. ఈ కార్యక్రమంలో ప్రతిష్టా ఇండస్ట్రీస్ మేనేజింగ్ డెరైక్టర్ డాక్టర్ కేవీఎస్ఎస్ సాయిరాం, ఇక్రిశాట్ డెరైక్టర్ జనరల్ విలియం ధార్, ఆం ధ్రబ్యాంక్ డీజీఎం వెంకటేశ్వర్లు, మాజీ న్యాప్ నేషనల్ డెరైక్టర్ డాక్టర్ రామారావు, శాస్త్రవేతలు లు పాల్గొన్నారు. -
తెలుగు వెనుకబడి పోతోంది!
అయ్యప్పన్ సిఫార్సులకు చెల్లు చీటీ ! ఖరీఫ్‌లో ప్రస్తావనే లేని గోరుచిక్కుడు, కినోవా పంటలు అనంతపురం అగ్రికల్చర్ : కరువు జిల్లా అనంతను ఆదుకోవడానికి, రైతులకు కరువు బారి నుంచి శాశ్వత విముక్తి కల్పించాలన్న సంకల్పంతో ప్రభుత్వం ఆర్భాటంగా ప్రారంభించిన ‘ప్రాజెక్టు అనంత’ పథకం అటకెక్కింది. 2012 జనవరిలో భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ (ఐసీఏఆర్) డెరైక్టర్ జనరల్ డాక్టర్ అయ్యప్పన్ సారథ్యంలో ఉన్నత స్థాయి నిపుణుల బృందం(హైపవర్ టెక్నికల్ కమిటీ) జిల్లాలో రెండు దఫాలుగా పర్యటించింది. 2013 ఏప్రిల్ 18, 2014 ఏప్రిల్ 22న కూడా కేంద్ర బృందాలు జిల్లాలో పర్యటించాయి. జిల్లాను శాశ్వతంగా కరువు బారి నుంచి కాపాడాలంటే చీనీ, అరటి, ఆయిల్‌పాం లాంటి పంటల విస్తీర్ణం తగ్గించాలని, వ్యవసాయానుబంధ రంగాలైన పశు పోషణ, పాడి, గొర్రెలు, మేకల పెంపకం, కోళ్ల పెంపకం, పట్టుసాగు పెంపు చేపట్టాలని, కొర్ర, సజ్జ, రాగి, జొన్న లాంటి చిరుధాన్యపు పంటలు, పప్పుధాన్యపు పంటల విస్తీర్ణాన్నీ పెంచి, అన్నింటికీ మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలని సంబంధిత అధికారులు సిఫారసు చేశారు. గోరుచిక్కుడు, కినోవా.. అంటూ హడావిడి... వేరుశనగ విస్తీర్ణాన్ని 5 లక్షల హెక్టార్లకు తగ్గించి వాటి స్థానంలో గోరుచిక్కుడు పంటను సాగులోకి తీసుకు రావాలని 2012 ఖరీఫ్‌లో ప్రణాళిక రచించారు. అయ్యప్పన్ కమిటీ సిఫారసుల ఆధారంగా రూ.7,676 కోట్ల భారీ బడ్జెట్‌తో ‘ప్రాజెక్టు అనంత’ రూపొందించారు. దీంతో గత రెండేళ్లుగా జిగురుకు ఉపయోగించే గోరుచిక్కుడు, బలవర్ధకమైన పోషకాలు కలిగిన కినోవా పంటల గురించి అధికారులు విశేష ప్రాచుర్యం కల్పించి హడావిడి చేశారు. ఈ క్రమంలో 2012 ఏప్రిల్‌లో కొందరు అధికారులు, రైతులు రాజస్తాన్ రాష్ట్రంలో పర్యటించి గోరుచిక్కుడు గురించి తెలుసుకున్నారు. తిరిగొచ్చాక కొందరు రైతులు సుమారు 2 వేల ఎకరాలల్లో గోరుచిక్కుడు సాగు చేశారు. అయితే మార్కెటింగ్ విషయంలో తీవ్ర నిరుత్సాహం ఎదురైంది. దీంతో మరుసటి ఏడాది ఈ పంట కనిపించలేదు. 2013లో ప్రసన్నాయపల్లికి చెందిన శివశంకర్‌రెడ్డి ద్వారా ఆపార్డ్ సంస్థ కినోవా పంటను ప్రయోగాత్మకంగా సాగు చేయించింది. దిగుబడులు ఆశాజనకంగా ఉండడంతో దీనిని కూడా ప్రాజెక్టు అనంతలో చేర్చారు. ప్రస్తుత ఖరీఫ్‌లో 100 గ్రామాల్లో కినోవా పంట సాగు చేయించాలని భావించారు. అలాగే జిల్లాలో కినోవా ఫ్యాక్టరీ ఏర్పాటు చేసి గిట్టుబాటు ధర, మార్కెటింగ్ వసతి కల్పిస్తామని గొప్పగా చెప్పారు. ఇపుడు ఆ ఊసే ఎత్తడం లేదు. సరైన కారణాలు చెప్పకుండా జిల్లా అధికారులు దాటవేస్తున్నారు. -
రైతు శాస్త్రవేత్తలకు పెద్దపీట!
‘సాగుబడి’తో ముఖాముఖిలో ఐసీఏఆర్ డెరైక్టర్ జనరల్ డా. అయ్యప్పన్ . మెరుగైన సాగు పద్ధతులను, మెలకువలను రైతాంగం దరికి చేర్చే క్రమంలో రైతు శాస్త్రవేత్తలకు పెద్దపీట వేస్తున్నామని భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్) డెరైక్టర్ జనరల్ డా. అయ్యప్పన్ వెల్లడించారు. శాస్త్ర విజ్ఞానాన్ని, సంప్రదాయ విజ్ఞానంతో మేళవించి సాగును కొత్తపుంతలు తొక్కిస్తున్న రైతు శాస్త్రవేత్తలతో ఐసీఏఆర్ ప్రాంతీయ సమవేశాల్లో ప్రత్యేక సెషన్‌ను కూడా నిర్వహిస్తున్నామన్నారు. రైతు శాస్త్రవేత్త చింతల వెంకటరెడ్డి ఎండిన మట్టినే ఎరువుగా వాడుతూ నాణ్యమైన, అధిక పంట దిగుబడులు సాధిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా కుందనపల్లిలోని వెంకటరెడ్డి ద్రాక్ష తోటను డా. అయ్యప్పన్ ఇటీవల సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ‘సాగుబడి’ ప్రతినిధి పంతంగి రాంబాబుతో ముచ్చటించారు. ఇవీ ముఖ్యాంశాలు.. రసాయనిక ఎరువులు వాడకుండా ఎండిన మట్టినే ఎరువుగా వాడే వెంకటరెడ్డి వినూత్న సాగు విధానంపై మీ అభిప్రాయం ఏమిటి? ఎండిన మట్టినే ఎరువుగా వేస్తూ ఏళ్ల తరబడి పండిస్తున్న ద్రాక్ష తోట గురించి గతంలో విన్నాను. ఇవ్వాళ స్వయంగా చూడడం ఆనందంగా ఉంది.. అద్భుతం. అనేక రాష్ట్రాల్లో ద్రాక్ష తోటలను చూశా. కానీ, ఈ తోట చాలా ప్రత్యేకమైనది. మట్టిని ఎరువుగా వేసి ఏళ్ల తరబడి నాణ్యమైన, అధిక దిగుబడులు సాధిస్తూ ఉండడం గొప్ప విషయం. ఈ పొలం వ్యవసాయ పరిశోధన సంస్థగా మారిపోయింది. అగ్రికల్చర్ ఎమ్మెస్సీ, పీహెచ్డీ చదువుతున్న విద్యార్థులను 3,4 నెలల పాటు ఈ క్షేత్రానికి డిజర్టేషన్కు పంపిస్తాం. ఈ తోట నాకు భూలోకంలో వైకుంఠంలా కనిపిస్తోంది.. ఏ, సీ విటమిన్లతో కూడిన వరి, గోధుమలను కూడా వెంకటరెడ్డి గారు పండిస్తున్నారు. ‘గోల్డెన్ రైస్’ అవసరమే లేదని అంటున్నారు. ఈ సాగు పద్ధతిని రైతుల దగ్గరకు తీసుకెళ్లడానికి ఐసీఏఆర్ ఏమైనా చేయబోతోందా? శాస్త్ర విజ్ఞానం, సంప్రదాయ విజ్ఞానం మేళవింపుతో ఆవిష్కృతమైన ఈ టెక్నిక్ ఇక్కడి(రంగారెడ్డి జిల్లా) ఎర్ర నేలల్లో, ఈ వాతావరణంలో మంచి దిగుబడుల నిస్తున్నది. అయితే, ఇతర ప్రాంతాల్లో ఎలాంటి ఫలితాల నిస్తుందో తెలీదు. మా పరిశోధన కేంద్రాల్లో పరీక్షించి చూస్తాం. ఎక్కడెక్కడ మెరుగైన ఫలితాలు వస్తే.. అక్కడి రైతులకు ఈ ఇన్నోవేటివ్ నమూనాను ఆచరించమని సిఫారసు చేస్తాం. దేశవ్యాప్తంగా పలువురు రైతులు స్థానిక పరిస్థితులకు అనుగుణమైన వినూత్న సాగు పద్ధతులను, యంత్ర పరికరాలను ఆవిష్కరిస్తున్నారు కదా..? నిజమే. గత నాలుగేళ్లుగా ఐసీఏఆర్ అనుబంధ సంస్థలన్నిటిలోనూ రైతు శాస్త్రవేత్తల దినోత్సవం నిర్వహిస్తున్నాం. వారి విజయాలను రికార్డు చేస్తున్నాం. ప్రాంతీయ సమావేశాల్లో వీరితో ప్రత్యేకంగా ఒక సెషన్ నిర్వహిస్తున్నాం. ఈ ఏడాది ప్రపంచ కుటుంబ వ్యవసాయ సంవత్సరం. హరిత విప్లవ పితామహుడు నార్మన్ బోర్లాగ్ శతజయంతి సంవత్సరం కూడా. ‘మీకు తెలిసిన దాన్ని రైతుల దగ్గరకు తీసుకెళ్లండి’ అనేది ఆయన చివరి కోరిక. ఈ లక్ష్య సాధన క్రమంలో రైతు శాస్త్రవేత్తలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. వాతావరణ మార్పులపై తాజా నివేదికల నేపథ్యంలో వ్యవసాయ ఉద్గారాలను తగ్గించే చర్యలేమైనా తీసుకుంటున్నారా? పర్యావరణ అనుకూల వ్యవసాయ పద్ధతుల వల్ల ఉద్గారాలు తగ్గుతున్న విషయం గురించి ఎవరూ గుర్తించడం లేదు. సేంద్రియ, ప్రకృతి వ్యవసాయ దారులకు పర్యావరణ అనుకూల పద్ధతులు పాటిస్తున్న పారిశ్రామికవేత్తలకు ఇస్తున్నట్లుగానే ఆర్థిక ప్రయోజ నాలు చేకూర్చాలని మేం అడుగుతున్నాం..కరువుసీమ అనంతపురంలో జిగురు గోరుచిక్కుడు, కీన్వా తదితర పంటలను సాగు చేయిస్తున్నారు కదా.. ఫలితాలు ఎలా ఉన్నాయి? జిగురు గోరుచిక్కుడు సాగు చేసిన రైతులకు మంచి ధర వచ్చింది. కీన్వాను ఎగుమతి చేయాల్సి ఉంటుంది. అలాగే, టెఫ్ అనే పంటనూ ప్రయత్నించవచ్చు. అయితే, ఇక్కడున్న సమస్యేమిటంటే.. ఒక పంట బాగుంది అన్నామంటే.. రైతులందరూ అదే పంట వైపు వెళ్తుంటారు. అదే ఇబ్బంది.. ప్రాసెసింగ్ యూనిట్లను ప్రభుత్వమే ఏర్పాటు చేస్తే సమస్య ఉండదేమో? అవును..