గొంతులో ఇడ్లీ ఇరుక్కుని చిన్నారి మృతి | kid died while eating idly in mahabubnagar district | Sakshi
Sakshi News home page

గొంతులో ఇడ్లీ ఇరుక్కుని చిన్నారి మృతి

Published Wed, Sep 16 2015 2:32 PM | Last Updated on Sun, Sep 3 2017 9:31 AM

గొంతులో ఇడ్లీ ఇరుక్కుని చిన్నారి మృతి

గొంతులో ఇడ్లీ ఇరుక్కుని చిన్నారి మృతి

నర్వ: మురిపెంతో పెట్టిన ఇడ్లీ ముక్క ముద్దులొలికే చిన్నారి ఉసురు తీస్తుందని ఆ కన్నతల్లి ఊహించి ఉండదు. కానీ, జరగరాని ఘోరం జరిగిపోయింది. ఇడ్లీ ముక్క గొంతులో ఇరుక్కుపోవడంతో ఆ చిన్నారి ప్రాణాలు విడిచాడు. మహబూబ్‌నగర్ జిల్లా ఆత్మకూరు మండలం అమరచింత పట్టణంలో బుధవారం ఉదయం జరిగిన ఈ ఘటన చిన్నారి తల్లిదండ్రులతో పాటు స్థానికులను విషాదంలో ముంచివేసింది.

వెంకటయ్య, పద్మ దంపతులకు ఐదు నెలల పృథ్వీరాజ్ సంతానం. బుధవారం ఉదయం చిన్నారికి పద్మ ఇడ్లీ తినిపించే ప్రయత్నం చేసింది. ఓ ఇడ్లీ ముక్క నోట్లో పెట్టగా గొంతులో ఇరుక్కుపోవడంతో పసివాడు విలవిలలాడిపోయాడు. చిన్నారిని తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళుతుండగానే తుది శ్వాస విడిచాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement