శివాజీకి కూతురు ఉంది.. బయటపెట్టిన సమీర్‌ | Actor Sameer Shocking Comments On Bigg Boss Telugu 7 Contestant Sivaji Over Daughter | Sakshi
Sakshi News home page

Sivaji: శివాజీకి ఇద్దరు కొడుకులే కాదు కూతురు కూడా ఉంది.. బయటపెట్టిన సమీర్‌

Published Fri, Dec 15 2023 3:50 PM | Last Updated on Fri, Dec 15 2023 4:52 PM

Actor Sameer Shocking Comments On Bigg Boss Telugu 7 Contestant Sivaji Over Daughter - Sakshi

శివాజీ.. ఒకప్పుడు మంచి నటుడు.. కానీ రాజకీయాల్లోకి అడుగుపెట్టి మురికిపట్టిపోయాడు. స్వార్థపరులకు, అవకాశవాదులవైపు నిలబడి అందరితో ఛీ కొట్టించుకున్నాడు. ఫలితంగా జనాల్లో ఆదరణ తగ్గిపోయింది. అవకాశాలు దూరమయ్యాయి. ఇంట్లో ఖాళీగా ఉంటున్న సమయంలో బిగ్‌బాస్‌ ఛాన్స్‌ రావడంతో ఓకే చెప్పాడు. అలా బిగ్‌బాస్‌ తెలుగు ఏడో సీజన్‌లో పాల్గొన్నాడు. ఎప్పుడూ నిజాలే మాట్లాడతాను, అబద్ధం చెప్పను.. అసలు అబద్ధం అంటే ఎలా ఉంటుందో తెలీదన్నట్లుగా పోజు కొడుతుంటాడు శివాజీ.

పీక మీద కాలేసి తొక్కుతా..
చెప్పేవి శ్రీరంగ నీతులు.. చేసేది చిల్లర పనులు అన్నట్లుగా ఈయన చెప్పేది ఒకటుంటుంది.. వాస్తవం మరొకటి ఉంటుంది. ఈ మధ్య అతడు షోలో ఆడవాళ్ల గురించి పిచ్చి కూతలు కూశాడు. శోభ కోపంతో అరిచినందుకుగానూ.. అలాంటి అమ్మాయిలు మా ఇంట్లో ఉంటే పీక మీద కాలేసి తొక్కేవాడిని.. రెండు పీకేవాడిని.. అంటూ నోటికొచ్చింది వాగాడు శివాజీ. అలా అపడం తప్పని నాగార్జున చెప్పినా వినిపించుకోలేదు. మీ ఇంట్లో ఆడపిల్ల ఉంటే పీక మీద కాలేసి తొక్కుతావా? అని నాగ్‌ నిలదీస్తే.. అవును.. ఇలాగే ప్రవర్తిస్తా.. రెండు పీకుతా అని దురుసుగా సమాధానమిచ్చాడు.

ఎవరికీ తెలియని విషయం చెప్పిన సమీర్‌
ఆఖరికి ఆడియన్స్‌ కూడా అలా కాలేసి తొక్కుతాననడం నచ్చలేదని చెప్తున్నా.. తనను తాను సమర్థించుకున్నాడే తప్ప తప్పును అంగీకరించడానికి ఇష్టపడలేదు. హౌస్‌లో ఉన్న ప్రియాంక, శోభను కూడా ఎప్పుడూ చులకన చేసి మాట్లాడుతూ ఆడవారి పట్ల తనకెంత చులకన భావం ఉందనే విషయాన్ని బయటపెడుతూనే వచ్చాడు. ఈ నేపథ్యంలో బిగ్‌బాస్‌ మాజీ కంటెస్టెంట్‌, నటుడు సమీర్‌.. శివాజీ గురించి ఓ షాకింగ్‌ విషయాన్ని బయటపెట్టాడు. శివాజీకి ఇద్దరు కొడుకులతో పాటు ఓ కూతురు ఉందని చెప్పాడు.

శివాజీకి కూతురు ఉందా?
ఈ విషయం తెలిసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. ఎందుకంటే శివాజీ.. ఇప్పటివరకు తనకు ఇద్దరు కొడుకులు మాత్రమే సంతానం అని చెప్పుకుంటూ వచ్చాడు. ఎక్కడా తనకు కూతురు ఉన్నట్లు ప్రస్తావించలేదు. బిగ్‌బాస్‌ షోలోనూ పెద్ద కొడుకు ఫ్యామిలీ వీక్‌లో హౌస్‌లోకి వెళ్లాడు. అలాగే సండే ఎపిసోడ్‌లో శివాజీ భార్యతో పాటు చిన్న కొడుకు స్టేజీపై కనిపించారు. కానీ కూతురు ప్రస్తావన, ఉనికి మాత్రం ఎక్కడా లేదు.

నెటిజన్ల డౌటానుమానాలు
అయితే ఇన్నాళ్లూ శివాజీ గుట్టుగా దాచిన తన కూతురి విషయాన్ని బయటపెట్టాడు సమీర్‌. ఓ ఇంటర్వ్యూలో సమీర్‌ మాట్లాడుతూ.. శివాజీకి ఓ కూతురు ఉందన్నాడు. దీంతో యాంకర్‌.. శివాజీకి ఇద్దరు కొడుకులతో పాటు ఓ కూతురు ఉందా? అని తిరిగి ప్రశ్నించగా.. అవును, అతడికి ఓ కూతురు కూడా ఉందని నొక్కి చెప్పాడు. మరి శివాజీ ఆ విషయాన్ని ఎందుకు బయటపెట్టలేదు? తన కూతురి గురించి ఇంతవరకు ఎక్కడా ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడలేదు? అని నెటిజన్లు రకరకాలుగా అనుమానిస్తున్నారు.

చదవండి: Adhik Ravichandran Marriage Photos: ప్రముఖ డైరెక్టర్‌తో ప్రభు కూతురి రెండో పెళ్లి.. విశాల్‌ స్వీట్‌ వార్నింగ్‌..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement